A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు :

పొలంలో ఈ వ్యాధి గుంపులు గుంపులుగా, అక్కడక్కడ వుండును. మొదటిగా మొక్కలలోని పై ఆకులు వాడిపోయి, 2 నుండి ౩ రోజుల తరువాత మిగతా ఆకులూ రాలిపోయి మొక్కలు ఎండిపోవును. చనిపోయిన మొక్కలు నలుపు రంగులో వుండును.

వ్యాధి సోకిన  కాండం భూమి నుండి25 సెం.మీ. ఎత్తు వరకు వంకరగా మరి వుండును. ఈ ప్రాంతం మెత్తగా వుండి నీటితో తడిపినట్లు కనిపించును. దీనిపై తెల్లని శిలీంద్ర తంతువులు పెరుగును, అంతేకాకుండా ఆవగింజ పరిమాణంలో గల స్క్లిరోషియా బీజాలు ఏర్పడి, కాండం భూమి ఉపరితలం దగ్గర చీలిపోయి మొక్కలు విరిగి పడిపోవును.

మొవ్వు క్రింది భాగాన మొదట నీటిలో తడిపినాటు వంటి మచ్చలు ఏర్పడిన ప్రాంతం ఉదా రంగులోకి మారును., తేమతో కూడిన వాతావరణాలలో దీనిపై తెల్లని శిలీంద్రపు పెరుగుదల కనిపించును.దీనివలన మొవ్వ భాగం అంతా కుళ్ళిపోతుంది.

విత్తనం పై పొర రంగు కోల్పోవును. విత్తనాల క్రింద పొరలో మరియు విత్తనాల చుట్టు, ఆవగింజ పరిమాణంగల స్క్లిరోషియా బీజాలు ఏర్పడతాయి.