A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు

బీజ దళాల మీద మొక్క మొదటి ఆకు మీద చిన్న ఎర్రటి మచ్చలు లేదా లేత రంగు మచ్చలు ఏర్పడతాయి.

కాండలకు ఏమైనా గాయాలు వుంటే వాటి ద్వార రోగం దాడి చేసి మొక్కలను బలహీన పరుస్తుంది. 

పత్తి కాయలకు అన్ని దశలోనూ తెగులు ఆశిస్తుంది. 

శిలింద్రం  దూది లోకి , గింజల్లోకి  విస్తరిస్తుంది. దూది పసుపుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారి ముద్దగా అయిపోతుంది.

తెగులు సోకిన పత్తి కాయల పైన చిన్న, గుండ్రటి లోపలికి నొక్కులా వుండే మచ్చలు ఏర్పడతాయి, ఇవి ఎరుపు గోధుమ రంగులోనూ, నీటితో తడిచినట్లు ఉంటాయి.

తీవ్రంగా ప్రభావితమైన విత్తనాలు తేలికగా, గోధుమ రంగులో వుండి పూర్తిగా తయారై వుండవు. ఇవి సాధారణంగా మొలకెత్తవు.