Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు
టమాట పంటలో సాధారణంగా వచ్చే తెగులు ఇది. పంట ఏ దశలో ఉన్నప్పుడైనా ఈ తెగులు వస్తుంది. ప్రధానంగా మొక్కలోని లేత భాగాల మీద దాడి చేస్తుంది. ఆకుల మీద మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి ఎండిపోతాయి. తొలుత చిన్న చిన్న మచ్చలు ఏర్పడి, అవన్నీ కలిసినప్పుడు ఎండిపొయినట్లు కనపడుతాయి. మచ్చలు పెద్దవి అవుతున్నప్పుడు, అంటే ¼ అంగుళం లేదా అంత కన్నా ఎక్కువ వ్యాసార్దానికి పెరిగినప్పుడు , తెగులు సోకిన ప్రాంతం మధ్య భాగంలో వలయారపు వృత్తాలు ఏర్పడతాయి. ఈ మచ్చలకు దగ్గరగా ఉన్న కణజాలం పసుపు రంగులోకి మారుతుంది. ఈ సమయంలో వాతావరణంలో వేడి, తేమ గనుక ఎక్కువైతే ఆకులు చచ్చిపోతాయి.
కాండం మీద కూడా ఆకుల మీద ఉన్న మచ్చలు లాంటివే కనపడతాయి. మొక్క మొదట్లో, నేలకు దగ్గరగా కాండం మీద ఈ మచ్చలు ఉంటే, క్రమేపి మొక్క నిలబడలేక పడిపోతుంది. లేత మొలకలకు తెగులు సోకితే, నాటిన వెంటనే చనిపోతాయి. ఒక్కొక్కసారి ఫంగస్ కాయలను కూడా పాడు చేస్తుంది. కాయల మీద కూడా ఆకుల మాదిరే వలయాకారపు వృత్తాలతో కూడిన మచ్చలు కనపడుతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాండం, మొలకలు, కాయలు