Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు
పంట అన్ని దశలలోనూ ఈ తెగులు సోకుతుంది. అయితే సాధారణంగా మొక్క రెండు నెలల వయస్సు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వస్తుంది.
ముందుగా కింద ఉన్న ఆకుల మీద తెగులుకు సంబంధించిన తుప్పు లక్షణాలు కనపడతాయి. ఆకు కింది భాగంతో పోలిస్తే, పైన ఈ తుప్పు మచ్చలు ఎక్కువగా ఉంటాయి.
మొక్క పెరుగుతున్న కొద్దీ తెగులు ఎక్కువవుతుంది. క్రమేపీ అది ఇతర లేత అక్కులకు కూడా వ్యాపిస్తుంది. పైన ఉండే రెండు, మూడు ఆకులు తప్పితే, మిగతా ఆకులన్నింటికీ ఈ తెగులు వ్యాపిస్తుంది.
తుప్పు మచ్చలు చిన్నగా, ఎరుపు, గోధుమ రంగులో, గుండ్రంగా ఉంటాయి. ఒక్కోసారి గుడ్డు మాదిరి ఆకారంలో కూడా ఉంటాయి.
మచ్చలు 1 - 2 మిల్లి మీటర్ల వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి. వంగడం రకాన్ని బట్టి ఈ మచ్చల రంగు ఉంటుంది.
మచ్చలు ఆకుల కింద భాగంలో గుంపులు గుంపులుగా కనపడతాయి. తెగులు పెరుగుతున్న కొద్దీ మచ్చలు కలిసిపోతాయి.
సీజను చివర్లో మచ్చలు ఎరుపు, గోధుమ రంగు నుంచి నలుపు రంగు గాయాల మాదిరి కనపడతాయి. క్రమంగా తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.
తెగులు సోకి రోగం బారిన పడిన మొక్కలను దూరం నుంచి కూడా గమనించవచ్చు.