Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/agri.php
Line Number: 2462
Severity: Notice
Message: Undefined variable: links
Filename: views/view_agri_tabs.php
Line Number: 221
భూసార పరిక్ష:
పైర్లకు కావలసిన అన్ని పోషకాలు కొంత ప్రమాణంలో నేలలో సహజంగానే వుంటాయి. ఇవి తయారై, పైర్లకు లభ్యం కావడం అనేది నేల భౌతిక, రసాయనిక లక్షణాలు, సుక్ష్మ జీవుల చర్య,వాతావరణ పరిస్తితులపై ఎధరపడి వుంటుంది. వాటిలో చాలా తేడా వుండే అవకాశం వుంది. నేలలో అవి ఎంతవరకు లభ్యమవుతున్నాయో, వేయదలచిన పైరుకు ఎంత ఎక్కువ పడుతున్నదో నిర్ధారించి ఎరువులు వేయాలి.
భుసార పరీక్షా వలన ఉపయోగం-
భూసారాన్ని నిర్ధారించి రైతు వేయదలచిన పంటలకు నత్రజని, భాస్వరం, పోటాష్ ఎరువులు ఖచ్చితమైన మోతాదులో వేయవచ్చు
సాగుకు అనుకూలంగా లేని అమల భూములు, చౌడు భూముల్లో చాలా తక్కువ దిగుబడి వస్తుంది. కావున వాటిని గుర్తించి బాగు చేసే విధానాలు ఇతర యాజమాన్య పడతులు అర్ధమవుతాయి.
ఎంపిక చేసిన నమునాల్లో సుక్ష్మ పోషకాల విశ్లేషణ చేయవచ్చు.
ముఖ్య పోషకలైన నత్రజని, భాస్వరం, పోటాష్ ఆహారపు పంటకు 4;2 ;1 నిష్పతిలో వాడమని సిఫారసు చేస్తుండగా, రైతులు భాస్వరం, పోటాష్ సిఫారసు చేసిన దానికన్నా తక్కువగాను , నత్రజని పోషకాన్ని 2 నుండి ౩ రెట్లు ఎక్కువగాను వాడుతున్నారు. దీనివల్ల పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది.
పోషకాల సమతుల్యత అంటే పోషకాలను సమానంగా వాడమని అర్ధం కాదు. ఏ పంటకు ఏ పోషకం ఎంత పరిమాణంలో నెలకు అవసరమో తెలుసుకుని ఎక్కువ, తక్కువ కాకుండా అందించడాన్ని పోషకాల సమతుల్యత అంటారు. దీనివలన విలువైన ఎరువులను పొదుపుగా వాడవచ్చును.
పొదుపుగా వాడటం అంటే తగ్గించి వాడటం అని అర్ధం కాదు. అవసరం లేని పోషకాలను వేసి వృధా చేయకుండా అరికట్టాలి. దీనివల్ల ఖర్చు తగ్గును. ఆశించిన నికరాదయం ఏమాత్రం తగ్గదు. పోషకాల సమతుల్యత లోపించడం వాళ్ళ ప్రత్యేకించి నత్రజనిని అధికంగా వాడటం వాళ్ళ పైరు విపరీతంగా ఎదిగి పడిపోవడం, పంటకు ఆలస్యంగా రావడం, దిగిబడి నాణ్యత తగ్గిపోవడం, చివరకు రైతులు నష్ట పోవడం జరుగుతుంది.
సమతుల ఎరువుల వాడకం భుసార పరిక్షల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.