కోశాస్త దశ :       లేదు

తల్లి పురుగు దశ ;

రెక్కలు గలవి, రెక్కలు లేనివి అనే రెండు రూపాంతరాలలో వుంటాయి.

ఇవి గ్రుడ్లకు బదులుగా పిల్లలకు జన్మనిచ్చే అలవాటు వుంది. ప్రత్యుత్పత్తి లేకుండా పిల్లలని కంటాయి.

జీవిత చక్రం 7-10 రోజులలో పూర్తి అవుతుంది.

ఒక సంవ్సతర కాలంలో ఎక్కువ జీవిత చక్రాలను పూర్తి చేస్తుంది. కావున కొద్ది కాలంలో విపరీతమైన సంతతిని పెంచుకుంటుంది. తద్వారా ఉదృతి ఎక్కువ.

గుర్తించడం ఎలా ?: 

ఆకుపచ్చ నుండి ముదురు వర్ణంలో మెత్తగా, చిన్నగా వున్న కీటకాలు రెక్కలు గలవి. సమూహాలుగా వుంటాయి. ఇవి సుమారు 1.65 మిమి. పొడవు వుంటాయి.

రెక్కలు లేనివి 1.53 మి.మి పొడవుతో వుంటాయి.