వ్యాప్తి :
మొక్క బాగా పెరిగిన దశలో ఈ తెగులు ముదురు ఆకుల మీద కనపడుతుంది. 1-10 మి.మీ. పరిమాణంలో మసక ప్రత్యక ఆకారం లేకుండా ఏర్పడతాయి.
ఆకు ఈనెలు ఈ మచ్చలకు అంచులుగా వుంటాయి. ఈ మచ్చలు ఆకు పై వైపున లేత పసుపు పచ్చ, ఆకు పచ్చ కలిసిన రంగులో వుంటాయి. మచ్చలు క్రమేపి పసుపు పచ్చ గోధుమ రంగులోకి మారతాయి.
ఆకుల అడుగున తెల్ల నురగ లాంటి ఎదుగుల కనపడుతుంది. ఇది శిలీంద్రం కొనీడియల్ దశ.
ప్రభావితమైన ఆకులు చివరికి రాలిపోతాయి.
ఉష్ణ , ఉప ఉష్ణ వాతావరణంలో రోగ కారక జీవి చెట్ల మీద, దానికి ఆశ్రయ మిచ్చే ఇతర మొక్క మీద బతికి వుంటాయి. అక్కడినుంచి పత్తి పంట మీదకి వ్యాపిస్తాయి.
ఒకసారి పత్తికి ఈ తెగులు సోకిన తరువాత గాలి, సాగు నీళ్ళు, పనివాళ్ళు, చేలో నడిపే యంత్రాల ద్వారా తెగులు వ్యాపిస్తుంది.
ఈ శిలీంద్రం ఆకు గాలి పీల్చేరంధ్రం గుండా మొక్క లోపలికి ప్రవేశిస్తుంది.
రాత్రి తడిగాను, పగలు పొడిగాను వుండే పరిస్తితులు ఈ తెగులుకు అనుకూలం. నాలుగు రోజుల పాటు వాతావరణం ఇలావుంటే తెగులు ఉధృతంగా ఆశిస్తుంది.