వ్యాప్తి: 

ఈ రోగ కారక జీవి పరాన్న భుక్కు. నేలలోని కుళ్ళుతున్న సేంద్రియ పదార్ధంలో చాల సంవత్సరాలు పాటు సజీవంగా వుంటుంది. 

బలహీనంగా ఉన్న మొక్క రోగ కారక జీవితో సంపర్కంలోకి రాగానే ఆ జీవి వేళ్ళల్లో వేగంగా వృద్ది చెందుతుంది. చివరికి వేరు / కాండం మధ్య భాగంలోకి దారు కణజాలంలోకి విస్తరిస్తుంది.

తెగులుకి లోనైనా మొక్క వేళ్ళల్లో కాల్షియం, ఇనుము, ఇతర విష పదార్ధంలు అధిక మోతాదులో జమ అవుతాయి. దీనివల్ల మొక్క వడలిపోయిన లక్షణాలను కనబరుస్తూ వుండవచ్చు.

ఈ శిలీంద్రం ఇతర పంటలపైన కూడా వృద్ది చెందుతుంది.

పత్తిని తిరిగి విత్తినపుడు శిలీంద్రం మళ్ళి క్రియాశీలకంగా అయ్యి పంటకు తెగులు ఆశింప చేస్తుంది.