వ్యాప్తి :
నులి పురుగులు, ఇతర పురుగుల వల్ల మొక్కల వేళ్ళకు అయిన గాయాలు, రంధ్రాలు ద్వారా శిలీంద్రం లోపలికి ప్రవేశిస్తుంది.
వేళ్ళ కణజాలాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకుంటుంది. ఫలితంగా మొక్క పై భాగానికి పోషక పదార్ధాలు అందక ఎదుగుదల కుంటుబడుతుంది. దీనివల్ల మొక్క వడలినట్లు అయిపోతుంది.
శిలీంద్రం దారు కణజాలంతో కణతులు ఏర్పడేలా చేసి పోషకాలు పైకి వెళ్ళే మార్గాన్ని అడ్డుకుంటుంది.
శిలీంద్రం కొన్ని రకాల మొక్కలలో ఫ్యూ జేరిక్ ఆమ్లం ఉత్పతి చేయటం వల్ల కూడా మొక్క వడలిపోయే లక్షణాలు కనబడతాయి.
శిలీంద్రం కుళ్ళిన సేంద్రియ పదార్ధంలోనూ, సిద్ధ బీజాల రూపంలోనూ నేలలో అనేక సంవత్సరాల పాటు సజీవంగా వుంటుంది.
ఈ శిలీంద్రం విత్తనాల లోపల, బయట వుండి తెగులు వ్యాప్తికి కారణమౌతుంది.
శిలీంధ దారాలు, సిద్ధ బీజాలు కూడా తెగులు వ్యాప్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.