అనుకూల వాతావరణం:

తేమతో కూడిన వాతావరణ పరిస్తితులు (ఉష్ణోగ్రతలు 23 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన గాలిలో తేమ శాతం 85 శాతం పైన) తెగులు వ్యాప్తికి ప్రత్యేకంగా అనుకూలిస్తాయి.

గాయాలు ఉన్న మొక్కలలో (ఉదాహరణకు నులి పురుగుల వల్ల మొక్క దెబ్బతిని ఉంటే) ఈ తెగులు ఎక్కువగా సోకుతుంది.

క్షార లక్షణాలున్న బంక మట్టి నేలలో శిలీంద్రం వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి.

నులి పురుగులు బూడిద రంగు ముక్కు పురుగులు మొక్క వేళ్ళల్లోకి శిలీంద్రం తేలికగా ప్రవేశించేలా చేస్తాయి.

నల్ల నేలల్లో వర్షాల తరువాత పొడిగా, వేడిగా వుండే వాతావరణం ఈ శిలీంద్రం తెగులు సోకటానికి అనువుగా వుంటుంది.

నత్రజని, భాస్వరం, మ్యాంగనిస్ ఎరువులు తెగులు వృద్దికి, జింకు, పోటాష్ తెగులు తగ్గటానికి దోహదం చేస్తాయి.