వ్యాప్తి :
ఈ తెగులు ప్రధానంగా విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
విత్తటంతోనే శిలీంద్రం క్రియాశీలకం అవుతుంది. ఆ తరువాత ఇది గాలి ద్వారా, నేలలోని కొనిడియా ద్వారా వ్యాపిస్తుంది.
తేమ, తడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో తెగులు వేగంగా వ్యాపిస్తుంది.
మొక్క చిన్న దశలో వడిలి పోవటం, కాండం మీద మచ్చలు, కాయ కుళ్ళి పోవటం వంటివి సంభవిస్తాయి. తెగులు సోకిన కాయల ద్వారా విత్తనాలు వ్యాధిగ్రస్తమవుతాయి.