పత్తి పంటలో వ్యాప్తి :

రోగ కారకమైన శిలింద్రము చనిపోయిన ఆకుల పైన ఉంటుంది. కుళ్ళని ఆకులు, వ్యాధి సోకిన విత్తనాలు ఈ శిలింద్రాల వ్యాప్తికి తోడ్పడతాయి. వాటినుంచి వ్యాధి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. 

వ్యాధి సోకిన పంట అవశేషాల నుంచి మెల్లగా ఇది ఆరోగ్యంగా ఉన్నపంటను ఆశిస్తుంది. తొలుత కింద నున్న  కొమ్మల ఆకులకు సోకుతుంది. రానురాను పంటకు మొత్తంగా ఎగబాకుతుంది.

ఒక్కొక్కసారి కాయకు కూడా వ్యాపిస్తుంది. గాలిలో తేమ ఉన్నప్పుడు కాయను తొలిస్తే అది విత్తనానికి కూడా వ్యాపిస్తుంది.

రోగం సోకిన మొక్క ఆకులు నేల రాలిన తరువాత ఈ ఫంగస్ జీవిత చక్రం ముగుస్తుంది. 

కంది పంటలో వ్యాప్తి:

త్వరిత గతిన వ్యాప్తి చెందే శిలింద్రము , ఇది సమూహం సమతలంగా ఉండి., ఊలుతో కప్పబడినట్లు  దారపు పోగుల వలె ఉంటుంది.  ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

వంగడాల రకాన్ని బట్టి తెగులు ప్రభావం ఉంటుంది. తెగులు సోకిన విత్తనాలు రంగు కోల్పోయి, చిన్నగా మారుతాయి. వానలు పడిన తరువాత తెగులు ఉధృతి ఎక్కువవుతుంది. 

వంగ పంటలో వ్యాప్తి :

చలి కాలంలో ఫంగస్ పంట అవశేషాల కింద ఉంటుంది. పరిస్థితులు అనుకూలించగానే ఇది జీవ కణాలను విడుదల చేస్తుంది. ఈ జీవ కణాలు నీటి ద్వారా లేదా గాలి ద్వారా వేరే మొక్క దగ్గరికి చేరతాయి.  మొక్కలోని లేత భాగాలలో చిన్న చిన్న గాయాలు లేదా రంధ్రాలు చేయడం లేదా నేరుగా కాడలోకి చొచ్చుకుపోవడం ద్వారా మొక్కలోనికి పోతాయి.  తొలుత నెలకు దగ్గరగా ఉన్న ఆకులకు తెగులు సోకుతుంది.   జీవ కణాలు పెరిగి తెగులు మచ్చలుగా కనపడడానికి కొంత సమయం తీసుకుంటాయి.  ఈ మచ్చలున్న చోటునుంచే మరిన్న్హి జీవ కణాలు విడుదల అవుతాయి. ఇలా తెగులు అ మొక్కలోని ఇతర భాగాలకు లేదా ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.  మొక్కలోని అన్ని భాగాలకు ఈ తెగులు సోకుతుంది.  కాయలకు, వేర్ల భాగాలకు తెగులు సోకినప్పుడు ఇది ఇంకా త్వరితంగా వ్యాపిస్తుంది.  పంటలో ఉన్న కలుపు, దగ్గరగా ఉన్న ఇతర ఆతిధేయ పంటలను బట్టి కూడా తెగులు వ్యాప్తి ఉంటుంది. ఎదిగిన మొక్కలలో తెగులు తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది.