తల్లి పురుగు:
ఆడ పురుగు ముందు రెక్కలు పసుపు నుంచి నారింజ రంగులో ఉంటాయి. మగ పురుగులో ఇవి ఆకుపచ్చ నుంచి మసక గోధుమ రంగులో కనపడతాయి. రెక్కల అంచుల వెంబడి నల్లటి చారలు ఉంటాయి. వెనుక రెక్కలు లేత పసుపులో ఉండి, అంచుల పైన గోధుమ రంగు చారలు, మధ్యలో గుండ్రటి మచ్చలు ఉంటాయి.