వ్యాప్తి :

తెగులుకు కారకమయ్యే ఫంగస్ విత్తనాల మీద, నేలలోనూ, పంట అవశేషాల మీదను ఉంటుంది.   తొలి  దశ తెగులు లక్షణాలు కింద ఉన్న ఆకుల మీద కనపడతాయి. వాటిమీద చిన్నని బూడిద – ఆకుపచ్చ రంగు మచ్చలు ఉంటాయి. తెగులు పెరుగుతున్న కొద్దీ ఈ మచ్చలు ఆకులోని ఇతర భాగాలనన్నిటికీ విస్తరిస్తాయి. ఇవి గోధుమ రంగులో సిగరెట్ ఆకారంలో ఉంటాయి. మధ్యలో పాలిపోయినట్టు ఉండి, చుట్టూ చిక్కటి అంచులు ఉంటాయి. మచ్చల పొడవు ౩ – 7 సెంటిమీటర్లు, వెడల్పు 0.4 – 1.0 సెంటి మీటరు ఉంటుంది.   వాతావరణం  అనుకూలంగా ఉన్నప్పుడు ఈ మచ్చలు కలిసిపోతాయి. దానివల్ల ఆకులు ఎండిపొయినట్లు కనపడుతాయి.    వేడి వాతావరణం, గాలిలో తేమ ఉన్నప్పుడు తెగులు సోకిన ఆకుల మీద ఆకుపచ్చ నల్లటి ఫంగస్ జీవకణాలు కనపడతాయి.  బహుళ కణాలతో కూడి ఉన్న ఈ  జీవ కణాలు తిన్నగా కానీ, కొంచెం వంకర తిరిగి కానీ ఉంటాయి. చలి కాలంలో తెగులుకు కారకమయ్యే ఫంగస్ కంకి అవశేషాల మీద బతుకుతుంది. వేసవి తొలిరోజుల్లో ఏర్పడే జీవకణాలు గాలి ద్వారా లేదా వాన ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇవి లేతమొక్కల కింది ఆకుల వద్దకు చేరుతాయి.   

ఆకు ఉపరితలంలో 6 – 18 గంటల పాటు నీటి తేమ ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత 18 – 27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు  ఈ జీవ కణాలు తెగులుకు కారకమవుతాయి. ఆకుల్;అ  కణజాలంలో ఉండే జీవ కణాలు రెండో దశ తెగులుకు కారణమవుతాయి.