వరి -  పురుగులు

  • ఉల్లి కోడు

ఇది మే – సెప్టెంబర్ మధ్య కాలంలో వరి పంటను ఆశిస్తుంది
లక్షణాలు
అంకురం ఉలికాడవలె పొడుగాటి గొట్టంగా మారి బయటకు వస్తుంది.   పిలకలు ఎండిపోతాయి.  కంకి వేయదు.

మొక్కలో  పాడయ్యే భాగాలు
పిలకలు ఎండిపోతాయి.  నారుమడి దశ నుండి పిలక దశ వరకు నస్టపరుస్తుంది.     

    • నారుమడిలో :   చ.మీ.కు 1 ఉలికోడు సోకిన పిలక.
    • పిలక దశలో:     5 శాతం ఉల్లిగొట్టాలు లేక దుబ్బుకి 1 కోడు సోకిన

పిలక  ఉంటుంది.
పురుగు జీవిత చక్రం
గుడ్లు దశ:

ఆకుల కొనల దగ్గర, మొవ్వు మట్టాల కింద ఒక్కొక్కటిగా గుడ్లను పెడుతుంది.   ఈ దశలో ౩-5 రోజుల పాటు ఉంటుంది.

పిల్ల పురుగు (లార్వా) దశ:
గుడ్డు నుంచి వచ్చిన వెంటనే పిల్ల పురుగు, మొక్క కాండంలోకి  తొలుచుకునిపోతుంది. అంకురం వద్ద వృద్ధి చెందుతుంది. ఫలితంగా తరువాత వచ్చే అంకురం ఉల్లి కోడు (బొందు) మాదిరి, ఆకుపచ్చని పొడుగాటి గొట్టంగా మారుతుంది.
కోశాస్థ (ప్యుపా)  దశ:
గొట్టంలోనే కోశాస్థ దశకు చేరుకుంటుంది. ఈ దశలో 4-8 రోజుల పాటు ఉంటుంది.
తల్లి పురుగు:
శరీరం   నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. పొడవైన కాళ్ళు ఉంటాయి.

పురుగును గుర్తించడం
శరీరం   నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. పొడవైన కాళ్ళు ఉంటాయి

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • తట్టుకునే వంగడాల సాగు.
  • ఒక సెంటు నారుమడిలో 16౦ గ్రాములు కార్బోపురాన్ లేక 5౦ గ్రాములు పోరేట్ గుళికలు విత్తనం మొలకేతిన 10 నుండి 15 రోజులలోపు వేయాలి.
  • నాటిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు కార్బోపురాన్ 10 కిలోలు లేక పోరెట్5 కిలోల గుళికలు వాడాలి.
  • జీవ పద్దతులు

అనుకూల వాతావరణం
పొడి వాతావరణంలో,  వానాకాలం ఆరంభంలో ఈ పురుగు ఎక్కువగా వస్తుంది.

 
  • కాండం తొలిచే పురుగు:

కాండం తొలిచే పురుగు   ఏప్రిల్ _ అక్టోబర్ మధ్య కాలంలో వారి పంటను ఆశిస్తుంది.

లక్షణాలు
పిలక దశలో – మొవ్వ ఎండి చనిపోతుంది.  పూత దశలో –  వెన్నులు తెల్ల కంకులుగా మారతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
నారుమడి నుండి పూత దశ వరకు ఆశిస్తుంది.    

పురుగు జీవిత చక్రం
గుడ్లు దశ:

ఈ దశలో   6-8 రోజుల పాటు ఉంటుంది. ఆకు చివరి భాగాన తల్లి పురుగు ఒకేసారి 80-150 గుడ్లు పెడుతుంది. గుడ్లు గుంపుగా ఉంటాయి. పైన గోధుమ రంగు వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ:
పిల్ల పురుగు తెలుపు - గోధుమ రంగులో ఉంటుంది. తల నారింజ పసుపు రంగులో ఉంటుంది. ఈ దశలో   20-30 రోజుల పాటు గడుపుతుంది.

కోశాస్థ (ప్యుపా) దశ:
నీటి మట్టానికి 5-10 సెంటిమీటర్ల పైన  మొక్క మొదళ్ళలో గూడు కట్టుకుని ఉంటాయి. 10 రోజుల నుంచి 6 నెలల పాటు ఉంటుంది.

తల్లి పురుగు :
ముదురు గోధుమ రంగులో కనపడుతుంది. రెక్కలపై  నల్లటి మచ్చలు ఉంటాయి. 2-5 రోజులు బతుకుతుంది. కాంతికి ఆకర్షితమవుతుంది.

పురుగును గుర్తించడం
నారుమడి దశలో చదరపు మీటరుకి ఒక తల్లి  పురుగు లేదా  గుడ్ల సముదాయం కనపడుతుంది.  పిలక దశలో 5 శాతం చచ్చిన మొవ్వలు లేక చదరపు మీటరుకి ఒక తల్లి పురుగు లేక గుడ్ల సముదాయం ఉంటుంది.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • క్లోరిపైరిపాస్ 2.5 మి.లి. లేక పస్పమిడనే 4౦ శాతం 2 మి.లీ. లేక ఏసేపిట్ 1.5 గ్రా.లు లేదా కార్టప్ హైడ్రోక్లోరిడ్ 2.౦ గ్రాములు క్లోరోస్త్నేలిపోలే 20 ఎస్.సి. ౦.4 మి.లి. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
    • లేక చిరు పొట్ట దశలో కార్టప్ హైడ్రోక్లోరిడ్ 4జి ఎకరాకు 8 కిలోలు లేదా కార్బోపురాన్ ౩జి గుళికలు ఎకరాకు 10 కిలోలు వాడాలి.
  • జీవ పద్దతులు
  • నాటేముందు వరి నారు చివరలు తుంపటం వల్ల చాలావరకు అరికట్టవచ్చు.
  • గుడ్లపై పరాన్న జీవులు (ట్రైకోగామా, టెలి నోమస్)
  • వేప కషాయం పిచికారి
  • మోళ్ళు తగలబెట్టడం, పైరుని కిందికి కోయడం
  • లింగాకర్షక బుట్టలు పెట్టడం  
 

౩. ఆకు ముడుత/ నాము/ తెల్ల తెగులు

గొంగళి పురుగు ఆకు ముడుతలో వుండి పత్రహరితాన్ని గోకి తినివేయటం వలన ఆకులు తెల్లబడతాయి. పోటాకు దశలో నష్టం ఎక్కువ.    
లక్షణాలు
ఆకులు తెల్లగా మారి ఎండిపోతాయి
మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
తెలుపుతో కూడిన పసుపు రంగుతో ఉంటాయి. ఆకుల మీద ఒక్కొక్కటి విడివిడిగా ఉంటాయి.  ఈ దశలో 6-8 రోజుల పాటు ఉంటాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
చుట్టుకున్న ఆకు ముదతలోనే ఉంటుంది. 20-30 రోజుల పాటు ఈ దశలో గడుపుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఆకు ముదతలోనే ఈ దశకు వెడుతుంది.  అనుకూల, అననుకూల  పరిస్థితులు బట్టి వారం రోజుల నుంచి 6 నెలల పాటు  ఈ దశలో ఉంటుంది.  

తల్లి పురుగు
రెక్కలు పసుపు పచ్చని రంగులో ఉంటాయి.  అంచు నల్లగా, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. కాంతికి ఆకర్ష్టితం అవుతుంది.  వాలినప్పుడు రెక్కలు పరుచుకుని ఉంటుంది. 2-5 రోజులు బతుకుతుంది.

పురుగును గుర్తించడం
దుబ్బుకి 1  లార్వాలేక 2 పురుగులు సోకిన ఆకులు ఉంటాయి.  ఇవి ఆకుల అంచులను గొట్టం మాదిరిగా చుట్టుకుని లోపల ముడుచుకుని ఉంటాయి. ఆకుపై ఉన్న పచ్చ దనాన్ని (పత్రహరితాన్ని) గోకి గోకి తింటాయి. పచ్చదానం కోల్పోయిన ఆకులు తెల్లగా మారుతాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

రసాయన పద్దతులు

    • క్లోరిపైరిపాస్ 2.5 మి.లి. లేక ఎసిపిట్ 1.5 గ్రా. లేక కార్టప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు . ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక కార్టప్ హైద్రోక్లోరిడ్ 4జి గుళికలు ఎకరాకు 8 కిలోలు వేయాలి.
  • జీవ పద్దతులు
    • కొబ్బరి తాడుకి ముళ్ళు / కంప కట్టి అటు ఇటు లాగి పురుగులు నీటిలో పడి చనిపోయేలా చేయవచ్చు.
    • వేప కషాయం (గుడ్డు దశలో ౩%,  పిల్ల పురుగు దశలో 2-4% ద్రావణం)
    • మిత్ర కీటకాలు (కోకోకోలా బిళ్ళ పురుగు)
    • పరాన్న జీవులు వదలడం (లార్వ, కోశాస్థ దశలలో)

అనుకూల వాతావరణం

 
  • పచ్చ దోమ / దీపపు పురుగులు

పచ్చ దోమ / దీపపు పురుగులు  వరి పంటలో తుంగ్రోవైరస్ ను వ్యాప్తి చేస్తాయి.   మార్చి – నవంబర్ మధ్య కాలంలో ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా  ఉంటుంది.
లక్షణాలు
తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకుల నుండి రసం పిలుస్తాయి. దాంతో క్రమేపి ఆకులు పసుపు రంగుకి మారుతాయి.
మొక్కలో  పాడయ్యే భాగాలు           
ఆకులు

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :  

తల్లి పురుగు ఆకుల పొరల మధ్యలో ఈనెలు, మట్టల దగ్గర గుంపులు గుంపులుగా గుడ్లు పెడుతుంది.  గుడ్డు దశ 6-8 రోజుల పాటు ఉంటుంది.
పిల్ల పురుగు (లార్వా) దశ :
ఈ దశలో 20-30 రోజులపాటు ఉంటుంది. ఆకులు, మొక్కలోని ఇతర భాగాల నుంచి రసాలను పీల్చడంవల్ల ఆకులు, / మొక్కలు పసుపు లేదా రంగులోకి మరి గిడసబారి పోతాయి. వీటి ద్వారా టుంగ్రో వైరస్ వ్యాప్తి చెందుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:

  • ఉండదు.

తల్లి పురుగు
తల్లి పురుగు లేత / ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. త్రికోణ రూపం కలిగి ఉంటుంది. పైన నల్లటి మచ్చలు ఉంటాయి. రెక్కల అంచు నల్లగా ఉంటుంది. అడ్డంగా నడుస్తూ ఉంటాయి. గుర్తించడం చాలా సులువు.

పురుగును గుర్తించడం
తల్లి పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులో వుంది ముందు రెక్కల మీద నల్లటి మచ్చలు ఉంటాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ఇతోఫెన్ఫ్రాక్స్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లి లీటర్ల బి.పి.ఎం.సి లేదా 0. 25 గ్రాముల ఇమిదాక్లోప్రిడ్ + ఎతిప్రోల్ 80 డబ్ల్యు.జి లేదా 2 మిల్లి లీటర్ల మొనోక్రోటోఫాస్   వంటి మందులను కలిపి చల్లాలి.
  • జీవ పద్దతులు
    • తట్టుకునే  రకాలు సాగు చేయాలి.
    • అడపా దడపా  పొలం ఆరబెట్టాలి.
    • ప్రతి రెండు మీటర్లకి 20 సెంటి మీటర్ల మేర బాటలు వదలాలి.
    • పొలంలో దీపపు ఎరలు ఉంచి పురుగు ఉధృతి తగ్గించవచ్చు.  
    • వేప కషాయం చల్లడం

అనుకూల వాతావరణం

 
  • సుడి దోమ

సుడి దోమ పిల్ల దశలో దుబ్బుకి 10 పురుగులు,  పూత దశలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు కనపడతాయి.   ఈ  పురుగు మార్చి – నవంబర్ మధ్య కాలంలో పంటను ఆశిస్తుంది.

లక్షణాలు
గోధుమ వర్ణపు / తెల్ల మచ్చదోమలు దుబ్బుల అడుగున నీటి మట్టంపై వుండి దుబ్బుల నుండి  రసాన్ని పిలుస్తాయి.  పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది.
మొక్కలో  పాడయ్యే భాగాలు
పైరు, ఆకులు, మొక్కలు  

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :

గుడ్లు తెల్లగా ఉంటాయి. ఆకుల ఈనెలలో, మట్టలలోని పొరల్లో ఉంటాయి.  గుడ్ల అంచులు ఒకదానితో ఒకటి కలసిఉంటాయి.  ఈ దశ 4-8 రోజుల పాటు ఉంటుంది.
పిల్ల పురుగు (లార్వా) దశ :
రెక్కలు ఉండవు. దుబ్బుల మోడళ్లలో చేరి రసాన్ని పీలుస్తాయి. ఈ దశలో 14-18 రోజులపాటు ఉంటుంది. 
కోశాస్థ (ప్యుపా) దశ:

  • ఉండదు.

తల్లి పురుగు
తల్లిపురుగు గోధుమ రంగులో ఉంటుంది. 2-5 రోజులపాటు బతుకుతుంది. దుబ్బుల మొదళ్ళలో, నీటి మట్టానికి పైన గుంపులు గుంపులుగా ఉంటుంది.
పురుగును గుర్తించడం

    • తల్లిపురుగు గోధుమ రంగులో ఉంటుంది. దుబ్బుల మొదళ్ళలో, నీటి మట్టానికి పైన గుంపులు గుంపులుగా ఉంటుంది.  
    • పిల్ల పురుగుకు రెక్కలు ఉండవు.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ఇతోఫెన్ఫ్రాక్స్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లి లీటర్ల బి.పి.ఎం.సి లేదా 0. 25 గ్రాముల ఇమిదాక్లోప్రిడ్ + ఎతిప్రోల్ 80 డబ్ల్యు.జి లేదా 2 మిల్లి లీటర్ల మొనోక్రోటోఫాస్   వంటి మందులను కలిపి చల్లాలి.
  • జీవ పద్దతులు
    • తట్టుకునే రకాలు సాగు చెయ్యాలి.
    • పొలాన్ని అడపా దడపా ఆరబెట్టాలి
    • పొలంలో ఎప్పుడూ ఎక్కువగా నేరు నిలవ ఉంచకుండా చూడాలి. నీటిని తోడేస్తూఉండాలి.
    • పంటలో ప్రతి రెండు మీటర్లకి మధ్య కాలిబాట వదలాలి . అప్పడు పంటకు గాలి బాగా ప్రసరించి పురుగు ఉద్రితి తగ్గుతుంది.
    • 15 కిలోల ఇసుకకు 1.5 లీటర్ల వేప నూనె బాగా పట్టించి, రాత్రంతా ఉంచి, ఉదయాన్నే పొలంలో చల్లాలి.  

అనుకూల వాతావరణం

 
  • కంపు నల్లి:

తెలంగాణ, చిత్తూరు జిల్లాలో  కంపు నల్లి ఉదృతి ఎక్కువ. ఈ పురుగు జూలై – నవంబర్ మధ్య కాలంలో
వస్తుంది.

లక్షణాలు
పురుగు ఆశించిన పొలం నుండి చెడు వస్తుంది. గింజలు తాలై పోతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు  
పిల్ల పురుగులు, పెద్ద పురుగులు  రసాన్ని పీల్చడం వల్ల గింజలు తాలైపోతాయి.

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :

తల్లి పురుగులు ఆకుల ఈనెల దగ్గర నిలువుగా వరుసలలో గుడ్లు పెడతాయి.  ఈ దశ 6-7 రోజులు ఉంటుంది.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు సాయంత్రం, పొద్దున వేళల్లో ఎక్కువ నష్టం చేస్తాయి.  మొక్క వెన్నుల నుండి రసాన్ని,  గింజ పాలు పోసుకునే దశలో వాటినుంచి పాలను పీలుస్తాయి. దీనితో తాలు వస్తుంది. గింజ గట్టిపడే సమయంలో పీలిస్తే గింజ మీద మచ్చలు ఏర్పడతాయి.  ఈ దశలో 25-30 రోజుల పాటు ఉంటాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:

  • ఈ దశ ఉండదు

తల్లి పురుగు
తల్లి పురుగులు  బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఇవి బాగా చెడు వాసన వదులుతాయి.. 7-10 రోజులు బతుకుతుంది.

పురుగును గుర్తించడం
దుబ్బుకి 1 లేక 2 పురుగులు కనపడతాయి.  తల్లి పురుగులు  బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

పురుగు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

లీటర్ నీటికి,.  ఒక మిల్లి లీటర్ డైక్లోర్ వాస్,  2 మిల్లి లీటర్లు  ఎండోసల్ఫాన్ లేక  2 మిల్లి లీటర్లు క్లోరిపైరిపాస్ లేక 2 మిల్లి లీటర్లు మలాదీయాన్ కలిపి గింజ పాలుపోసుకునే దశలో సాయంత్రం పూట పిచికారి చేయాలి. పొలం అంచు నుండి చుట్టూ తిరుగుతూ మధ్యకు పిచికారి చేయాలి.

  • జీవ పద్దతులు

అనుకూల వాతావరణం

 

వరి తెగుళ్ళు

  • అగ్గి తెగులు లెక మెడవిరుపు తెగులు

అగ్గి తెగులు లేక మెడ విరుపు తెగులు  నవంబర్ -  ఫిబ్రవరి మధ్య కాలంలో వస్తుంది.
లక్షణాలు
అకులపై  1-౩ మిల్లి మీటర్ల వ్యాసం కలిగిన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.  ఈ మచ్చలు పెద్దవై నూలుకండె ఆకారం పొందుతాయి.  ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద మచ్చలుగా మారతాయి.   పెద్దగా మారిన మచ్చలతో ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. నారుమడిలో ఆశిస్తే నారుమడి పూర్తిగా ఎండిపోతుంది.  నాట్లు వేసిన తరువాత ఆశిస్తే మొక్క పూర్తిగా ఎదగదు. కురచగా ఉంటాయి. పిలకలు తగ్గిపోతాయి.  వెన్నుల మెడభాగంలో వెన్నులు విరిగి పోతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, వెన్నులు 

తెగులు జీవిత చక్రం

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • కిలో విత్తనానికి ౩ కార్బదైజింని కలిపి విత్తన శుద్ధి చేయాలి.
      • లీటర్ నీటికి  ౦.6 గ్రాముల  ట్రైస్క్య్లోజేల్ 75 శాతం లేదా 1.5 మిల్లి లీటర్ల ఇసోప్రోధ్యున్లెన్ లేదా  2.5 మిల్లి లీటర్ల కసుగా మైసిన్ ౩  ఎల్ కలిపి పైరుపై పిచికారి చేయాలి.
  • జీవ పద్దతులు
      • తట్టుకునే వంగడాలు వాడటం ( పినాకిని, ఫాల్గుణ, తిక్కన వంటివి)
      • విత్తన శుద్ధి చేయడం (ఆవు మూత్రంతొ)
        500 మిల్లి మీటర్ల పశువుల మూత్రాన్ని ఒక బకెట్లో తీసుకుని, దానికి రెండున్నర లీటర్ల నీటిని కలపాలి. వరి విత్తనాలను గుడ్డ సంచిలో కట్టి, ఈ ద్రావణంలో నానబెట్టాలి. తరువాత విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవచ్చు.
      • పశువుల మూత్రం – మజ్జిగ ద్రావణం చల్లడం
        లీటర్ పశువుల మూత్రాన్ని, లీటర్ మజ్జిగను, 8 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి.  
      • మారేడు ఆకు – పశువుల మూత్రం కషాయం

కిలో మారేడు ఆకులు తీసుకుని 5 లీటర్ల నీటిలో ఉడకబెట్టి చల్లార్చాలి. దీనికి 5 లీటర్ల పశువుల మూత్రంతో పాటు, 100 గ్రాముల సున్నం కలపాలి. దీనికి 100 లీటర్ల నీటిని కలిప పిచికారి చేసుకోవచ్చు.

      • పశువుల పేడ – పశువుల మూత్రం – ఇంగువ కషాయం

ఒక కుండలో 5 కిలోల పేడ, 5 లీటర్ల పశువుల మూత్రం, 5 లీటర్ల నీటిని కలిపి  5 రోజులు మురగబెట్టాలి.  రోజూ ఒక పుల్ల తీసుకుని కలియబెడుతూ ఉండాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడబోసి,  100 గ్రాముల సున్నం కలిపి, 250 గ్రాముల ఇంగువ కలిపి  పిచికారి చేయాలి.

అనుకూల వాతావరణం    

    • 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత
    • గాలిలో 90% కంటే ఎక్కువ తేమ
    • రాత్రి పూట మంచు బిందువులు ఆకుల మీద పడటం

పై మూడు పరిస్థితులు వారం రోజుల పాటు ఉంటే ఈ తెగులు ఎక్కువ అవుతుంది.

 
  • పొడ తెగులు లెక మూగుడు తెగులు

పొడ తెగులును  పాము పొడ తెగులు లేదా మాగుడు తెగులు అని కూడా అంటారు.  ఇది రోగ బీజాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బీజాలకు 21 నెలల వరకు మొలక శక్తి ఉంటుంది. పొలంలోనూ, గట్ల మీద ఉన్న కలుపు మొక్కల ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
ఆకు తొడిమెల మీద ముందుగా వలయాకారంలో బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమంగా  పెద్దవిగా మారి పాము పొడ వంటి మచ్చలుగా మారతాయి.
మచ్చలు పెరిగిన తరువాత అంచు గోధుమ రంగులోనూ, మచ్చ బూడిద రంగులోనూ ఉంటుంది.
మచ్చలు ఒక దానితో ఒకటి కలిసి, చివరకు ఆకులు, తరువాత మొక్కలు ఎండిపోతాయి. గింజలు సరిగా పాలుపోసుకోవు.  

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, గింజలు 

తెగులు జీవిత చక్రం

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • సిఫారసు చేసిన నత్రజని ౩-4 సార్లు వేయాలి.
      • గట్లపైన , చేనులో కలుపు లేకుండా చూడాలి. 
      • లీటర్ నీటికి 2 మిల్లి లీటర్లు హేక్షా కొనజోల్ లేక 2 మిల్లి లీటర్లు వలిడా మైసిన్ లేదా  మిల్లి లీటర్ ప్రోపికోనజోల్ కలిపి 15 రోజులకు ఒకసారి రెండు పర్యాయాలు పిచికారి చేయాలి.
  • జీవ పద్దతులు
      • తట్టుకునే వంగడాలు  (దీప్తి, పంకజ్, ఎం.టి.యు. 101౩ రకాలు)
      • నాణ్యమైన, మంచి విత్తనం వాడటం  
      • విత్తన శుద్ధి (పశువుల మూత్రం, వస గడ్డతొ కలిపి)
      • కలుపు మొక్కలు ఏరివేయడం   (ప్రత్యేకించి గట్ల మీద ఉన్నవి)

అనుకూల వాతావరణం
25 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, మబ్బులు పట్టిన వాతావరణం చెట్ల నీడ ఎక్కువగా ఉన్నా ఈ తెగులు ఎక్కువవుతుంది.  

 
  • ఆకు ఎండు తెగులు

బాక్టీరియా వల్ల వస్తుంది. దీనినే ఎండాకు తెగులు అనికూడా అంటారు.   నవంబర్ – ఫిబ్రవరి మధ్య కాలంలో పంటను ఆశిస్తుంది.

లక్షణాలు
ఆకు కొన భాగంలో  ముందు అంచుల దగ్గర 5-10 మిల్లి మీటర్ల పొడవు కలిగిన ఆకుపచ్చని లేదా పసుపు పచ్చని మచ్చలు ఏర్పడతాయి.  ఆకు చివరినుంచి కింది వరకు ఒక పక్క గాని, లేక రెండు పక్కల గాని, లేదా ఆకు మధ్య భాగంలో కాని తడిచినట్లు ఉండి మచ్చగా మారుతుంది.  రోగం సోకిన భాగం పూర్తిగా ఎండిపోతుంది.  పచ్చగా మారిన చోట ఉదయం 7 గంటలకు చూస్తే, పచ్చని జిగురు వంటి పదార్థం పైకి వస్తుంది. ఈ ద్రవ పదార్థంలో ఉండే సూక్ష్మ జీవులు, నీటి ద్వారా వ్యాపించి, ఇతర మొక్కలకు రోగాన్ని చేరవేస్తాయి.  రోగం తీవ్రమైన కొద్దీ ఈ ఎండు చారలు ఒకదానితో ఒకటి కలుస్తాయి. చివరకు ఆకులు మొత్తంగా ఎండినట్లు కనపడతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • తెగులు ఎక్కువగా ఉంటే నత్రజని వేయడం ఆపివేయాలి
  • జీవ పద్దతులు
      • తట్టుకునే వంగడాలు  (స్వర్ణ, అజయ్, మసూరి, సస్యశ్రీ రకాలు)
      • కలుపు, పంట వ్యర్ధాలను నాశనం చేయడం (పంట కోత తరువాత వరి దుబ్బులను కాల్చి వేయడం)
      • నాణ్యమైన, మంచి విత్తనం వాడటం   
      • పశువుల పేడ ద్రావణం పిచికారి చేయడం
      • మబ్బులు కమ్మినప్పుడు, జల్లులు పడుతున్నప్పుడు నత్రజని ఎరువులు వేయకపోవడం  

అనుకూల వాతావరణం
30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, జల్లులు కురిసే వాతావరణం లేదా గాలివాన కురిసే సమయం తెగులు వ్యాప్తికి అనుకూల సమయం.   పోషక లోపాలు ఉన్నప్పుడు కూడా తెగులు ఎక్కువవుతుంది. 

 
  • కాండం కుళ్లు తెగులు

పొలంలో ఈ తెగులు, వ్యాధి సోకిన మొక్క ల భాగం నుండి, విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత నీటి ద్వారా మిగిలిన పొలాలకు విస్తరిస్తుంది.  కాండం కుళ్ళు తెగులు వరితో పాటు  కందిని కూడా ఆశిస్తుంది. 

లక్షణాలు
కాండం లోపల కణువుల మధ్య భాగమంతా నల్లగా మారుతుంది. ఆకులు పసుపురంగుకు మారి పిలకలు చనిపోతుంటాయి. పాలు పోసుకునే దశలో కాండం కుల్లిన ప్రదేశం దగ్గర పిలకలు వాలిపోయి  ఎండిపోతాయి. క్రమంగా  దుబ్బు అంతా  ఎండిపోతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు

కాండం

తెగులు జీవిత చక్రం

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • లీటర్ నీటికి 2 మిల్లి లీటర్లు హేక్షా కొనజోల్ లేక 2 మిల్లి లీటర్లు వలిడా మైసిన్ లేదా  గ్రాము కార్బండైజిం లేదా గ్రాము బెనోమిల్ కలిపి 15 రోజులకు ఒకసారి రెండు పర్యాయాలు పిచికారి చేయాలి.
  • జీవ పద్దతులు
      • తెగులు సోకిన పొలంలో పరిశుభ్రత పాటించాలి.
      • మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
      • విత్తన శుద్ధి చేయాలి.
      • అనుకూల వాతావరణం
 
  • తుంగ్రో వైరస్

తుంగ్రో వైరస్ పచ్చ దీపపు పురుగుల వల్ల వ్యాపిస్తుంది . కొన్ని ప్రాంతాలలో దీనిని ఎర తెగులు  అని కూడా అంటారు. రోగం చాల తొందరగా వ్యాపిస్తుంది కనుక దీనిని వైర్ లెస్ తెగులు అనికూడా అంటారు. ఊద గడ్డి ఈ వైరస్ కు ఆశ్రయం ఇస్తుంది.  సెప్టెంబర్ – నవంబర్, మార్చి – ఏప్రిల్ మధ్య కాలంలో ఈ తెగులు వస్తుంది.  
రోగ నిర్ధారణ :
ఒక గాజు గ్లాసులో సగం వరకు అయోడిన్ ద్రావణం వేయాలి. 20-25 ఆకులు తీసుకుని కత్తిరించిన వైపు ద్రావణంలో పెట్టాలి.  అర గంట సేపు ఉంచిన తరువాత, బయటకు తీసి చూస్తె, ద్రావణంలో ముంచిన భాగాలు నీలి రంగుకు మారితే, తుంగ్రో వైరస్ ఆశించినట్టు భావించాలి.
లక్షణాలు
వైరస్ సోకిన మొక్కలు కురచగ ఉంటాయి. సరిగా పెరగవు.  పిలకలు తగ్గిపోతాయి. ముదురు ఆకులు కొన నుంచి ప్రారంభమై లేత ఆకుపచ్చ లేక కాషాయం లేదా పసుపు రంగులోకి మారుతాయి. ముదురు ఆకులమీద తుప్పు మచ్చలు గమనించవచ్చు.
వైరస్ ఆశించిన మొక్కల ఆకుల్లో ఈనెలు స్పష్టంగా కనపడతాయి.. కొన్ని ఆకులు వంగిపోతాయి. కొన్ని పూర్తిగా బయటకు రాకుండా, ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి.  వేర్లు సరిగా అభివృద్ధి చెందవు. వెన్నులు రావు. లేదా ఆలస్యంగా వస్తాయి.,  వచ్చిన వెన్నులు కూడా చిన్నవిగా ఉంటాయి. గింజలు గట్టి పడక తాలుగా మారతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
వెన్నులు, గింజలు

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
      • ఈ వైరస్ ఆశించిన మొక్కలను గుర్తించిన మొక్కలను వెంటనే తీసి నాశనం చేయాలి.
      • పచ్చ దీపపు పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి.
  • జీవ పద్దతులు
      • అనువైన వంగడాలు (సురక్ష, విక్రమార్క, ఐ. ఆర్. ౩6, ఎం.టి.యు. 9992,  వంటివి)
      • పంట అవశేషాలను కాల్చి వేయడం
      • వేప కషాయం  చల్లడం (దీపపు పురుగుల నివారణకు)
      • దీపపు ఎరలు పెట్టడం (పురుగుల నివారణకు)

అనుకూల వాతావరణం
వైరస్ ఆశించిన ప్రాంతంలో పచ్చ దీపపు పురుగులు ఎక్కువైనప్పుడు రోగం తీవ్రత ఎక్కువ

 
  • పొట్టకుళ్ళు తెగులు

పొట్ట కుళ్ళు తెగులు సారోక్లేదియం అనే శిలీంధ్రం వల్ల  వస్తుంది. ఎక్కువగా నవంబర్ –  ఫిబ్రవరి మధ్య కాలంలో వస్తుంది.  రోగం తీవ్రత ఎక్కువగా ఉంటే, దిగుబడి 20% వరకు తగ్గవచ్చు. మామూలుగా వారి పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు ఈ రోగం వస్తుంది. అప్పుడు వెన్ను పూర్తిగా బయటకు రాదు. మొక్కలో ఆయా  కీటకాలు చేసిన రంధ్రాల ద్వారా, లేదా మొక్కకు అయిన గాయాల ద్వారా  శిలీంధ్రం మొక్క లోపలి పోయి రోగానికి  కారణమవుతుంది.  

లక్షణాలు  
పోటాకు తొడిమలపై నల్లటి లేదా ముదురు గోధుమ లేదా చాక్లెట్ రంగు మచ్చలు ఏర్పడతాయి.  వెన్నులు  పొట్టలో కుళ్ళిపోతాయి. వెన్ను పాక్షికంగా మాత్రమే బయటకి వస్తుంది. తాలు గింజలు ఏర్పడతాయి.  ఈ గింజలు కూడా రంగు మారుతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
వెన్నులు, గింజలు  

తెగులు జీవిత చక్రం

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

లీటరు నీటికి 1 గ్రాము  కర్బందిసం 50 శాతం మందు చొప్పున కలిపి, పొట్ట దశలో ఒకసారి, 7 రోజులు తరువాత రెండవసారి పిచికారి చేయాలి.

  • జీవ పద్దతులు
      • అనువైన వంగడాలు (తెల్లహంస, ఐ.ఇ.టి. 7789,  ఐ.ఇ.టి. 8144 వంటి రకాలు)

అనుకూల వాతావరణం
ఈ కింద తెలిపిన పరిస్థితులు ఉన్నప్పుడు రోగం తీవ్రత పెరుగుతుంది.

      • రాత్రి ఉష్ణోగ్రత 20 సెల్సియస్ కంటే తక్కువ
      • మంచు పడటం
      • వాతావరణం చల్లగా ఉండటం
      • గాలిలో తేమ ఎక్కువగా  ఉండటం
 
  • ఆకు మచ్చ తెగులు

ఆకు మచ్చ తెగులును  బ్రౌన్ స్పాట్ తెగులు అని కూడా అంటారు. రోగ బీజాలు వడ్ల గింజలలో రెండు సంవత్సరాలు,  వరి గడ్డిలో మూడు సంవత్సరాలు సజీవంగా ఉంటాయి.        

లక్షణాలు
ఈ రోగం వరి పైరును మూడు దశలలో ఆశిస్తుంది.   నారు మడిలో చల్లిన విత్తనాలలో  కొన్ని విత్తనాలు అసలు మొలకెత్తవు. మరికొన్ని మొలకెత్తిన తరువాత చనిపోతాయి.  పైరు పిలకలు పెట్టే దశలో, ఆకులు, కండెల మీద కోలగా లేదా గుండ్రంగా, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి నువ్వు గింజ అంత సైజులో ఉంటాయి. ఈ మచ్చలు ఒకదానితో కలిసి పెద్దవిగా కనిపిస్తాయి. చివరకు ఆకు భాగం ఎండిపోతుంది.  వెన్ను బయటికి వచ్చిన తరువాత వడ్ల గింజ మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కొన్ని గింజల మీద కుంకుమ చల్లినట్టు మెరుస్తూ ఉంటాయి. కొన్ని వంకర్లు తిరుగుతాయి. కొన్ని గింజలు తాలు  లేదా పొల్లు అవుతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, వెన్నులు, గింజలు

తెగులు జీవిత చక్రం

తెగులు నియంత్రణ – నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • జీవ పద్దతులు
      • అనువైన వంగడాలు (రాశి, ఐ.ఇ.టి. 4106 వంటి రకాలు)
      • నాణ్యమైన విత్తనం
      • విత్తన  శుద్ధి
      • పోషకాల యాజమాన్యం (నత్రజని, పొటాశియం, మాంగనీస్, మెగ్నీషియం వంటివి తగు మోతాదుల్లో ఇవ్వడం)
      • మురుగు నీరు తీసివేయడం

అనుకూల వాతావరణం
ఈ కింద తెలిపిన పరిస్థితులు ఉన్నప్పుడు రోగం తీవ్రత పెరుగుతుంది.

  • అకస్మాత్తుగా ­గాలిలో తేమ పెరగడం
  • మబ్బులు కమ్మడం
  • ఉష్ణోగ్రత తగ్గడం
  • నిస్సారమైన భూములు
  • మురుగు నిలిచే భూములు
  • పోషక లోపలున్న భూములు