 |
గేదెల పోషణ – యాజమాన్యం
గ్రామీణ ప్రాంతాలలో ఆవులు, గేదెలను పెంచడం అన్నది వ్యవసాయంలో అంతర్భాగం. పంటలను, పశు జీవాలను రైతులు వేరుగా చూడరు. వ్యవసాయానికి ఇవి ఆదరువుగా ఉంటాయి. పాడి జీవాల నుంచి వచ్చే ఆదాయం పంటల నుంచి వచ్చే ఆదాయానికి ఆసరాగా ఉంటుంది. కాలం కలిసి రానప్పుడు, పంటలు సరిగా చేతికి అందనప్పుడు, పేద కుటుంబాలను ఆదుకునే ఆపన్న హస్తాలు ఈ జీవాలు.
కాలానికి అనుగుణంగా గేదెల పోషణ వ్యాపారాత్మకంగా కూడా మారింది. పేద కుటుంబాలకు ఆధారమైన ఈ జీవాలు పెట్టుబడి పెట్టే స్థోమత కలిగి ఉన్న వారికి కాసుల రాసులు కురిపించే వనరులుగా మారాయి. మనదేశంలోనూ, మన రాష్ట్రంలోనూ పాల ఉత్పత్తి ఎక్కువగా గేదెల ద్వారా జరుగుతుంది. ఆధారపడిన కుటుంబాలకు ఆదరువుగా ఉన్న పాడి జీవాలు దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న ఈ పాడి జీవాల పెంపకానికి సంబంధించిన మెళకువలు తెలుసుకుంటే, వీటి ద్వారా అందే ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. |
గేదె జాతులు
భారతదేశంలో గేదె జాతులను 5 గ్రూపులుగా విభజించవచ్చు. అవి ముర్రా గ్రూపు (జాతులు – ముర్రా, నీలిరావి, కుంది); గుజరాత్ గ్రూప్ (జాతులు – సుర్తి, మెహసానా, జఫరాబాది); మధ్య భారతదేశపు గ్రూపు (నాగపురి, పండరపురి, మండా, జరంగి, కలహండి, సంబాల్పూర్, పర్లాకిమిడి); ఉత్తరప్రదేశ్ గ్రూపు (బాధవారి, తారాయ్); దక్షిణ భారతదేశపు గ్రూపు (తోడ, సౌత్ కెనరా). మనదేశంలో ముర్ర మరియు గుజరాత్ గ్రూపు జాతులను మాత్రమే పాలకు ఉపయోగిస్తారు. మిగిలిన జాతులు పాలు తక్కువగా ఇస్తాయి. వీనిని ఎక్కువగా పనికి ఉపయోగిస్తారు. |
 |
ముర్ర :
ఇది పాల ఉత్పత్తికి ప్రసిద్ది గాంచిన జాతి. దీని జన్మస్థలం రోహ్తక్, కర్నాల్, హిస్సార్, జింద్, గుర్గావ్ మరియు పంజాబ్ ప్రాంతం. ముర్రా అంటే గుండ్రని కొమ్ములు కలది అని అర్థం. ఇది నల్లని కాతుకరంగు శరీరంతో, తోక పొడవుగా ఉంది తోక కుచ్చు మాత్రం తెల్లగా ఉంటుంది. శరీరం పెద్దదిగా, తల కొంచెం చిన్నదిగా, కొమ్ములు బాగా దగ్గరికి వంపు తిరిగి ఉంటాయి. గేదె శరీరం వెనుక భాగం వెడల్పుగా ఉంటుంది. దున్నపోతులు 570 కిలోలు, అడవి 450 కిలోల బరువు కలిగి ఉంటాయి. ఒక్కక్క ఈతకు 1600 నుండి 2300 కిలోల పాలనిస్తాయి. వెన్న 7% ఉంటుంది. మనరాష్ట్రంలో నాటు గేదెలకు ముర్రా జాతి వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేసి నాటు పశువుల అభివృద్ది కృషి చేస్తున్నారు. |
|
సూర్తి:
వీటి జన్మస్థలం గుజరాత్ రాష్ట్రంలోని కైరా, బరోడా మరియు నదియా జిల్లాలు. ఇవి బాగా నెమ్మదైన మనస్తత్వం కలిగి ఉంటాయి. ఇవి గుజరాత్లోని ఆనంద్ కోఆపరేటివ్ పాల్ కేంద్రాల్లో పాల్ ఉత్పత్తికి వాడబడుతున్నవి. నలుపు లేక గోధుమ రంగులో ఉంటాయి. తల మీద, కళ్ళు, తోక కుచ్చు తెల్లగా ఉంటాయి. కొమ్ములు కొంచెం పొడవుగా ఉండి అర్దచంద్రాకారంగా కింది నుంచి పైకి కొంచెం వంపు తిరిగి ఉంటాయి. ఇవి ముర్రా గేదెల కంటే సైజు కొంచెం తక్కువగా ఉంటాయి. బరువు 550 – 600 కిలోలుంటాయి. ఒక్కక్క ఈతకు 1550 నుండి 1700 కిలోల పలనిస్తాయి. మంచి గేదెలు 2200 నుండి 2500 కిలోల పాలను కూడా ఇస్తాయి. పాలలో వెన్న శాతం 8.
|
 |
మొహసానా :
ఇది ముర్ర మరియు సూర్తి జాతుల సంపర్కం ద్వారా ఏర్పడింది. జన్మస్థలం గుజరాత్లోని మెహసాన, సిద్దాపూర్. శరీరం కాటుక నలుపు నుండి గోధుమ రంగుతో కొమ్ములు ముర్రజాతి కొమ్ముల కన్నా కొంచెం తక్కువ వంకర తిరిగి ఉంటాయి. శరీరం పెద్దదిగా ఉంది కండ్లు పెద్దవిగా పైకి ఉబ్బి ఉంటాయి. మెడ దవుగా ఉంటుంది. బొంబాయి నగరంలో బాగా ప్రజాదరణ పొందండి. మగవి 500 – 600 కిలోలు, అడవి 400 – 500 కిలోల బరువు తూగుతాయి. ఒక్కక్క ఈతకు 1400 కిలోల పాలనిస్తాయి. |
 |
|
 |
జఫరిబాదీ:
జన్మస్థలం గుజరాత్ రాష్ట్రంలోని ‘గిర్’ అటవీ ప్రాంతం. శరీరం నలుపు రంగుతో కొమ్ములు వెడల్పుగా, మందంగా, పొడవుగా చివర కొంచెం వంపు తిరిగి ఉంటాయి. కొమ్ములు పైకి రాకుండా కిందికి మెడకు రెండు వైపులా పెరిగి పైకి మేలి తిరుగుతాయి. నుదురు ఎత్తుగా ఉంటుంది. ఇవి మన దేశపు జాతులన్నింటిలొనూ భారీ శరీరం కలిగి ఉంటాయి. దున్నలు 650 కిలోలు, అడవి 550 కిలోల బరువుంటాయి. ఒక్కక్క ఈతకు 1800 – 2700 కిలోల పలనిస్తాయి. పాలలో 8% వెన్న ఉంటుంది. |
|
నాగపురి:
ఇవి నాగపూర్, వార్ధా, హైదరాబాద్, మధ్య ప్రదేశ్ మరియు మహారాష్ట్రా సరిహద్దు ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటిని ‘మరట్వాడా’ గేదె అని కూడా అంటారు. నలుపు రంగు శరీరంతో కొమ్ములు బాగా పొడవుగా ఉండి భుజాల వరకు విస్తరించి ఉంటాయి. హైదరాబాద్ మరియు మధ్యప్రదేశ్ లో పాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచినవి. ఒక్కొక్క ఈతలో 1000-1100 కిలోల పాలనిస్తాయి. దున్నలు బాగా పనిచేస్తాయి. |
 |
మంచి పాడి గేదె ఎంపిక
- శారీరక లక్షణాలకు మరియు పాల ఉత్పత్తికి కొంత సంబంధం ఉంది కనుక శారీరక లక్షణాలను బట్టి మంచి పాల్ సార గల పాదిగేడెను ఎంపిక చేసుకోవాలి.
- మనం ఎన్నుకునే పాడిగేదే దాని జాతి లక్షణాలు కలిగి ఉండాలి.
- తల చిన్నదిగా, దవడలు గట్టిగా, కళ్ళు పెద్దవిగా కాంతి వంతంగా వెడల్పాటి నుదురు కలిగి ఆరోగ్య వంతంగా ఉండాలి.
- మెడ సన్నదిగా జబ్బలలో కలిసిపోయి ఉండాలి.
- వీపు భాగం సమతలంగా వెడల్పుగా ఉండాలి.
- చర్మం పలుచగా, ప్రక్కటేముకలు ఎడంగా, గజ్జలు లోతుగా ఉండాలి.
- కాళ్ళు నిటారుగా బలంగా కొంచెం ఎడంగా ఉండాలి.
- వెనుక నుండి చూస్తే తొడలు ఎడంగా ఉంది పొడుగుకు ఎక్కువ చోటు ఉండాలి.
- గేదెను ముందు నుండి చూసినా లేదా పక్క నుండి శరీరం త్రికోనాకరంలో ఉండాలి.
- పాలు పితికిన తర్వాత, పితకక ముందు పొడుగు పరిమాణంలో బాగా మార్పు ఉండాలి. పాలు పితికిన తర్వాత పొదుగు పూర్తిగా తగ్గిపోవాలి.
- చన్నులు నాలుగు ఒకే పరిమాణంలో ఉంది పొదుగు మీద చతురస్రాకారంలో అమరి ఉండాలి.
- చనుల్లో మరియు పొదుగులో ఎలాంటి గడ్డలు ఉండరాదు.
- చన్నులు బలపంకట్టి ఉన్నవానిని ఎన్నుకోరాదు. అలా ఉంటె ఆ గేదెకు ముందు ఈతలో పొదుగు వాపు వ్యాధి వచ్చి ఉంటుంది.
- పోదుగు మరియు ఉదరం కింద ఉండే పాలనరం పొడవుగా వంకరలు తిరిగి శాకలుగా విభజించబడి ప్రస్ఫుటంగా కనిపించాలి.
- గేదెలు కొనేటపుడు అది ఎప్పుడు ఈనింది, ఎన్నవ ఈతలో ఉంది, ఈనిన తరువాత ఎన్ని నెలలు పాడిలో ఉంది, కట్టినట్లయితే ఎన్నిన్ నెలలు గర్భంలో ఉంది, వట్ట పోయి ఎంతకాలం అయింది మరియు ఈనాదానికి ఇంకా ఎంతకాలం పడుతుంది మొ||గు నవి గమనించాలి.
- మేయ్యవచ్చే వాటిని, తల్లులకు అలర్జిక్ పొదుగు జబ్బు వచ్చిన వాటిని కొనరాదు.
- ముందు ఈతలో ఈసుకుపోయిన గేదెలను కూడా కొనకపోవడం మంచిది.
|
|
మేత / ఆహారం :
గేదెల పోషక అవసరాలు వాటి శరీర బరువు, పెరుగుదల, పాల ఉత్పత్తి, పాలలోని వెన్నశాతం మరియు చూడి మీద అదారపడి ఉంటుంది. గేదెకు తన శరీర బరువులో ౩% ఘనపదార్థం అవసరం. గడ్డిరకం పచ్చిమేతలో 25%, కాయజాతి పచ్చిమేతలో 20%, ఎండుమేత మరియు దానాలో 90% ఘన పదార్తముంటుంది. దీనిని బట్టి ఇవ్వవలసిన మేతను లెక్కించాలి. గేదేలకిచ్చే మేత ముఖ్యంగా పీచు మరియు దాణా పదార్థాలు, గేదేకిచ్చే మొత్తం ఘనపదార్దంలో 60-65 శాతం పీచుపదార్థం, 35-40 శాతం దాణా పదార్థం ఉండాలి. పచ్చి మరియు ఎండు మేతల ద్వారా పీచుపదార్థం గేదెకు ఇవ్వాలి. అలాగే పచ్చిమేతలో రెండు పాళ్ళు ధాన్యపు గింజలు, నూనెగింజల చెక్కలు, తవుడు, లవణ మిశ్రమం మరియు ఉప్పు ఉంటాయి. పప్పుల మిల్లుల నుండి లభ్యమయ్యే వ్యర్ధ పదార్థాన్ని (పొట్టు) కూడా దాణాలో ఉపయోగించవచ్చు. గేదేకిచ్చే పచ్చ్మేత రెండు రకాలు – ఇవి గడ్డి మరియు కాయజాతి రకాలు. గడ్డి రకాలలో గినిగడ్డి, హైబ్రిడ్ నేపియర్ రకాలైన ఎపిబిన్-1, కో-1, కో-౩ మొదలైన బహువార్షికాలు, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు, కొర్ర వంటి ఎకవార్శికాలను మేపవచ్చు. అలాగే కాయజాతి పశుగ్రాసాల్లో స్టైలో, లుసెర్ను, వెల్వెట్ బీన్, ఫీల్డ్ బీన్ వంటి బహువార్షికాలు, జనుము, అలసంద, పిల్లిపెసర, బెర్మీము, ఉలవలు వంటి ఏకవార్షికాలు మేపుకోవచ్చు. ఎండు మేతలో ముఖ్యంగా వరిగడ్డి, జోన్నచోప్ప, మొక్కజొన్న చొప్ప, వేరుశనగ కట్టే మొదలైనవి ఇవ్వవచ్చు.
అధికపాలనిచ్చే గేదెల మేత : అధికపాల దిగిబదినిచ్చే గేదెల నుండి ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు వాటి శరీరం నుండి పాల ద్వారా బయటకు వస్తాయి. వీటిని సరిగా మేపకపోయినట్లయితే పాలదిగుబడి తగ్గిపోవడమే కాకుండా గేదెల ఆరోగ్యం కూడా దెయ్యాతినే ప్రమాదముంది. కనుక గేదెల యొక్క పాలదిగుయడికి దీటుగా గేదెలను మేపవలసి ఉంటుంది. ఈ పద్ధతిని ‘ఛాలెంజ్ ఫీడింగ్’ అంటారు. ఛాలెంజ్ ఫీడింగ్ గేదె ఈనడానికి రెండు వారాల ముందు నుండి ప్రారభించాలి. చూడి గేదెకు మాములుగా ఇచ్చే దాణాకంటే అదనంగా మొదటిరోజు 500 గ్రా. దాణా పెంచి, తరువాత ప్రతిరోజు ౩౦౦-400 దాణా పెంచుతూ వెళ్ళాలి. ఈ విధంగా గేదె ఈనిన గేదె 500 గ్రా. నుండి ఒక కిలో దాణా ప్రతి 100 కిలోల శరీర బరువుకు తీసికోనేటట్లు చెయ్యాలి. గేదె ఈనిన తరువాత మాములుగా ఇస్తున్న దానాకంటే అదనంగా 500 గ్రా. దానాతో ప్రారంభించి 2 వారాలలో అది తినగలిగినంత దాణా ఇవ్వాలి. ఇలా గేదె ఆ ఈతలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే రోజు వరకు ఇవ్వాలి. ఇది సాదరంనంగా గేదె ఈనిన తరువాత రెండవ నెలలో ఉంటుంది. తరువాత గేదెకు దాని పాల ఉత్పత్తిని బట్టి 1 కిలో దాణా ప్రతి 2.0 కిలోల పాల ఉత్పత్తికి ఇవ్వాలి.
మేత సక్రమంగా తినాలంటే ఏం చేయాలి?:
పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చులో దాదాపు 60-70 శాతం మేతకు అవుతుంది. కనుక పశువుకిచ్చే మేత వ్యర్థం కాకుండా సక్రమంగా సాధ్వినియోగానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పచ్చి మరియు ఎండు మేతను చాఫ్ కట్టర్ ద్వారా అంగుళం సైజు ముక్కలుగా కత్తిరించి ఇవ్వాలి. దీని వలన దాదాపు 20-౩౦ శాతం మేత వృధా కాకుండా కాపాడుకోవచ్చు. కాండం బాగా లావుగా ఉండే మొక్కజొన్న, జొన్న, హైబ్రిడ్ నేపియర్, గిని మొదలైన వాటిని ఛాప్ చెయ్యకుండా ఇచ్చినట్లయితే గేదెలు ఆకుల చివర్లు తిని కాండాలు వదలివేస్తాయి. దీనివలన కాండంలోని పోషక విలువలు గేదెకు చేరవు. పచ్చి మరియు ఎండుమేతను కలిపి ఛాప్ చెయ్యడం వలన గేదె ఎండు మేతను వదిలివెయ్యకుండా నివారించవచ్చు. గేదెలకు మేతతొట్లు లేనట్లయితే గేదేకిచ్చే మేత మట్టిలో కలిసి కొంత వ్యర్ధమవుతుంది. కత్తిరించిన గడ్డిని పశువుకిచ్చేటప్పుడు మేతతొట్లలో వేసి మాత్రమే గేదెలకు మేపాలి. చాఫ్ చెయ్యడం వలన ముదిరిన గడ్డిని కూడా వినియోగించుకోవచ్చు. |
|
గృహ వసతి:
లూజ్ హౌసింగ్ పద్ధతిలో గేదెలను అసలు కట్టివేయకుండా, వాటి ఇష్టమొచ్చినట్లు కొంత ప్రదేశంలో తిరిగేందుకు వీలు కలిపిస్తారు. ఈ పద్ధతి గృహవసతిలో కవర్లు ఏరియా (కప్పు ఉన్న ప్రదేశం), ఓపెన్ ఏరియా (కప్పులేని ప్రాంతం) అనే రెండు భాగాలుంటాయి. కప్పు ఉన్న ప్రదేశంలో మేత తొట్టి ఉంటుంది. గేదెలు వాటికిష్టమైనప్పుడు మేత తింటాయి. ఎండ, వర్షం, చలి మొదలైన వానినుండి ఈ ప్రదేశంలో రక్షణ ఉంటుంది. కప్పులేని ప్రదేశం అంటే బహిర్గత ప్రదేశం చుట్టూ ఇనుప పైపుల్ని లేదా వాసాల్ని మూడు నలుగు వరుసలలో అమర్చి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రదేశం చుట్టూ చెట్లను పెంచివ్ట్లయితే చల్లగా ఉంది గేదెలకు సౌకర్యవంతంగా ఉంటుంది. నీటి తోట్లని ఈ ప్రదేశంలో అమర్చుతారు. ఈ స్థలానికి ఒక వైపున గేటు ఏర్పాటు చేసికోవాలి. ముళ్ళ తీగతో బహిర్గత దేశం చుట్టూ ఫెన్సింగ్ చేయరాదు. ఇలా చేసినట్లయితే ఫెన్సింగ్ తీగ గీసుకుపోయి పశువులకు మనుషులకు గాయాలయ్యే ప్రమాదముంది.
వివిధ తరగతుల గేదెలకు కావలసిన స్థలం
వ. నం |
తరగతి |
ప్రతి పశువుకు అవసరమయ్యే స్థలం (చ.మీ) |
ఒక షెడ్డులో ఉండగల అత్యధిక గేదెల సంఖ్య |
కప్పు ఉన్న ప్రాంతం |
కప్పులేని ప్రాంతం |
1. |
దున్నపోతు |
12 |
12 |
1 |
2. |
గేదేలు |
4 |
8 |
50 |
౩. |
ఈనబోయే గేదెలు |
12 |
12 |
1 |
4. |
చిన్నదూడలు (౩ నెలలు దాటినవి) |
2 |
4 |
౩౦ |
5. |
చిన్న దూడలు (౩ నెలలు లోపు) |
1 |
1 |
౩౦ |
లూజ్ హౌసింగ్ గృహ వసతి పద్ధతి వలన ప్రయోజనాలు :
గేదెలను చాలా సౌకర్యవంతంగా, ముఖ్యంగా వేసవికాలంలో గేదెల మీద వేడి వత్తిడి తక్కువగా ఉంటుంది. పశువులు తినగలిగినంత మేత, నీరు తీసికొనే వీలుంటుంది. తక్కువ మంది కూలీలు సరిపోతారు. దీనివలన ఖర్చు తగ్గుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అదనపు గేదెలను షెడ్డులో ఉంచవచ్చు. నీటి తొట్టిలో ‘ఫ్లోట్ వాల్వ్’ ఏర్పాటు వలన నీరు తొట్టిలో తగ్గినప్పుడు ఆటోమాటిక్ గా నీరు వచ్చి, ఎల్లప్పుడు నీరు పెట్టె అవసరముండదు. యాజమాన్యం సులభమౌతుంది.
పాలు పితికే షెడ్డు:
ఈ షెడ్డు పుఉర్తిగా కవర్ చెయ్యబడి ఉంటుంది. దీనిలో పాడిగేదెల నుండి పాలు తీస్తారు. ఈ షెడ్డు సాధారణంగా మధ్యలో ఉంది మిగిలిన షెడ్లు ఉంటాయి. ఈ షెడ్డు లోపల ఒక్కొక్క గేదెకు విడివిడిగా పార్టిశన్లు చెయ్యబడి ఉంటుంది. ఇవి ఒక వరుస లేదా రెండు వరుసలలో ఉంటాయి. రెండు వరుసల్లో ఉన్నట్లయితే తోకలు-తోకలు అభిముఖంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. గేదెలు నిలబడే స్థలం పొడువు 1.5-1.7 మీటర్లు, వెడల్పు 1.0-1.20 మీటర్లు ఉండాలి. సాధారణంగా వెడల్పు, పొడవులో 80 శాతం ఉండాలి. రెండు వరుసల మధ్య నడిచే స్థలం 1.5 నుండి 1.8 మీటర్లు ఉండాలి. ఈ స్థలం రెండు వైపులా “uUUuUUUUU” ఆకారంలో ౩౦ సె.మీ. వెడల్పుతో డ్రయినేజిలు నిర్మించాలి. గచ్చు వైపు డ్రయినేజి వైపు పల్లంగా ఉండేటట్లు చూడాలి. దానా తొట్టి వెలుపల 0.75 మీటర్ల స్థలం దాణా వెయ్యడానికి వదలాలి. షెడ్డు లోపలి నేల సిమెంటు కాంక్రీటు చేయించి గాడులు పెట్టాలి. దీని వలన గేదె జారాదు. డ్రైనేజ్ వైపు గల నేలను పల్లంగా ఉండేటట్లు ఏర్పాటు చెయ్యాలి.
షెడ్డు నిర్మాణానికి కావలసిన వస్తువులు, నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
షెడ్డు నిర్మాణానికి రాతి/ కాంక్రీటు / ఇటుకలతో నిర్మించిన స్తంభాలు, తాటి .సరివి కర్రలు వాడవచ్చు. షెడ్డు పై కప్పుకు ఆసబెస్టాస్/ గాల్వనైజ్వ్డ్ / ఇనుప షీట్లు, తాటాకు/ కొబ్బరి ఆకులు, రెళ్ళు గడ్డి, జోన్నచోప్ప, వరిగడ్డి మొదలైనవి వాడవచ్చు ఫెన్సింgggగుకు 2 అంగుళాల జిఐ ఇనుప పైపులు, వాసాలు మొదలగునవి వడవచ్చు. షెడ్డు పై కప్పు మద్యలో 4 మీటర్ల ఎత్తు ఉండాలి. చూరు 2 మీ. ఉండాలి. కవర్డ్ మరియు ఓపెన్ ఏరియాల మధ్య పేడ కాలువ 30 సెం. మీ. వాలు ఉండాలి. షెడ్డు మధ్యలో 1.5 – 1.8 మీ. వెడల్పుగల దారిని ఏర్పర్చిన ఎడల ట్రాక్టర్ / బండి సహాయంతో కత్తిరించిన పచ్చిమేతను సులభంగా మేత తొట్లలో వేయవచ్చు. |
|
ఈ జీవాలలో మామూలుగా వచ్చే రోగాలు:
- గొంతు వాపు
- జబ్బ వాపు
- గాలికుంటు వ్యాధి
- ఆంత్రాక్స్ లేదా దొమ్మ రోగం
- కురము లేదా డెంగూ రోగం
గొంతు వాపు
లక్షణాలు:
శరీరం బాగా వేడిగా ఉంటుంది. 105 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. జీవం చొంగ కారుస్తుంది. గొంతు లేదా కంటం దగ్గర వాపు కనపడుతుంది.
నివారణ
తొలకరి వానల ముందు అంటే జూన్ నెలలో రక్షా హెచ్.ఎస్. గానీ, లేదా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే టీకా గానీ వేయించాలి.
చికిత్స
15 నుంచి 20 సి.సి. ల డోసులో, ఆక్సి స్టెక్లిన్ లేదా మొక్సిన్ లేదా సిస్రోఫ్లాక్సిన్ మందు వేయాలి
జబ్బ వాపు
లక్షణాలు:
శరీరం బాగా వేడిగా ఉంటుంది. 106 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ముందరి కాళ్ళు లేదా వెనుక కాళ్ళు ఎక్కుతూ ఉంటుంది. వెనుక లేదా ముందరి భాగంలో వాపు వస్తుంది. అక్కడ వేడిగా ఉంది, లోపలి కండరం కుళ్ళినట్టు అవుతుంది.. ఆ స్థలంలో నీరు ఉన్నట్టుగా శబ్దం వచ్చినట్లు ఉంటుంది. వెంటనే చికిత్స చేయకపోతే, జీవం చనిపోతుంది.
నివారణ
తొలకరి వానల ముందు అంటే జూన్ నెలలో రక్షా హెచ్.ఎస్. గానీ, లేదా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే జబ్బ వాపు టీకా గానీ వేయించాలి.
చికిత్స
15 నుంచి 20 సి.సి. ల డోసులో, ఆక్సి స్టెక్లిన్ లేదా మొక్సిన్ లేదా సిస్రోఫ్లాక్సిన్ మందు వేయాలి. వాటితో పాటు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. వాపు ఉన్న చోట కూడా అవసరమైన ఇంజెక్షన్ వేయించాలి
గాలి కుంటు వ్యాధి
లక్షణాలు:
శరీరం బాగా వేడిగా ఉంటుంది. నోటిలో నుంచి చొంగ కారుతూ ఉంటుంది. నోటిలోనూ, కాళ్ళు, గిట్టల లోను పుండ్లు కూడా కనపడతాయి. నోటిలోను, నాలుక, ఇగుళ్ళలోనూ చర్మం ఊడిపోతుంది. మేత సరిగా తినలేదు. గంజి తాగడానికి కూడా ఇబ్బంది పడుతుంది. దాంతో జీవం నీరసించి పోతుంది.
నివారణ
4 నెలల దూడలుగా ఉన్నప్పటి నుంచే ఎఫ్ అండ్ ఎం టీకాలు ఏడాదికి రెండు సార్లు వేయించాలి.
చికిత్స
నాలుక, ఇగుళ్ళ మధ్య తేనే, పసుపు, వెన్న కలిపి రాయాలి.
ఆంత్రాక్స్ లేదా దొమ్మ రోగం
లక్షణాలు:
శరీరం బాగా వేడిగా ఉంటుంది. అకస్మాత్తుగా జీవం చనిపోతుంది. జీవం నవ రంధ్రాల నుంచి రక్తం కారుతుంది. కారిన చోట రక్తం వెంటనే గడ్డ కట్టకుండా ఉంటుంది.
నివారణ
ఈ లక్షణాలతో జీవం చనిపోయినప్పుడు, మిగతా వాటికి టీకాలు వేయించాలి.
చికిత్స
ఏమీ లేదు. దీనికి నివారణే మార్గం
కురము లేదా డెంగూ రోగం
లక్షణాలు:
వానా కాలంలో అకస్మాత్తుగా ఈ రోగం వస్తుంది. శరీరం వేడిగా ఉంటుంది. కాళ్ళకు పట్టు వాతం వస్తుంది. చర్మం బిగుసుకు పోతుంది. మూత్రం పసుపు రంగులో పోస్తుంది. కడుపు ఉబ్బుతుంది.
నివారణ
బాహ్య పరాన్న జీవులను నిర్మూలించాలి
చికిత్స
యాంటి బయోటిక్స్, పారా సిటమాల్, మెలొనెక్స్ ఇంజెక్షన్ లతో పాటు, జీవం నీరసం తగ్గించడానికి బి- కాంప్లెక్స్ మందులు వాడాలి. |
|
చూడిగేదెల సంరక్షణ:
చూడి గేదెను ఈనడానికి రెండు వారాల ముందు పాలు తీయకుండా ఎండకట్టాలి. ఇలా పాలు తీయకుండా ఆపడం ఒక్కసారి చెయ్యరాదు. మొదట రెండు పూటల నుండి ఒక్కపూటకూ, తరువాత ఒక రోజు నుండి రెండు మూడు రోజులకు ఒకసారి తరువాత వారానికొకసారి పాలు తీస్తూ ఎండ కట్టాలి. ఇలా ఎండకట్టడం వలన గేదె ముందు ఈతలో పాల ద్వారా కోల్పోయిన పోషక పదార్దాలను తిరిగి పొంది మరుసటి ఈతలో పాలు బాగా ఇస్తుంది. చూడి చివరి మూడు మాసాలు గేదెల పోషణలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఎందుకంటే దూడ పెరుగుదల మూడింట రెండు వంతులు చివరి మూడు మాసాలలోనే ఉంటుంది. కనుక చూడి గేదెను తిన్నంత పచ్చి మేతకు అదనంగా 2 కిలోల దానాను ఇవ్వాలి.
ఈనడానికి రెండు వారాల ముందు గాలి, వెలుతురు బాగా పరిశుభ్రమైన పాకలోకి మార్చాలి. నేల ఎగుడుదిగుడులు లేకుండా చదునుగా చేసి పోడిగడ్డితో కప్పి ఉంచాలి. చూడి గేదెకు మేయ్యకనిపించడం జరిగితే నేల వెనుక భాగం ముందు భాగం కంటే ఎత్తుగా ఉండేటట్లు జాగ్రత్త తీసికోవాలి. ఇలాంటి గేదెలకు సులభంగా జీర్ణమయ్యే మేత, దానా ఇవ్వాలి. గేదె ఈనిన తరువాత 8 గంటలలోపు మాయ పడనట్లయితే పశువైద్యుని సంప్రదించాలి. |
| |
|
 |