| |
గొర్రెల పెంపకం
Intro
మన రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశం లోనే నాల్గవ స్థానంలో ఉన్నది. గొర్రెల పెంపకం వాణిజ్య పరంగా మంచి లాభదాయకం. గొర్రెల పెంపకం అనేది ఒక ప్రాంతంలో అక్కడి నేల స్వభావం, వాతావరణం, వర్షపాతం, గాలిలో తేమ, మేత లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, అధికతేమ ప్రదేశాల కంటే అధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ ఉన్న ప్రదేశాలల్లో గొర్రెలు బాగా అభివృద్ధి చెందుతాయి. మెట్టవ్యవసాయంపై ఆధారపడిన రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో గొర్రెల పెంపకం ఎక్కువ.
Breeds (Jaatulu)
గొర్రెల జాతులు
గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా ప్రాంతాలల్లో దక్కని జాతిని పెంచుతున్నారు.
 |
నెల్లూరు జాతి :
దీనిని మాంసోత్పతికి మాత్రమే పెంచవచ్చు. మన దేశం లోని జాతులన్నింటికంటే పొడవైనది. నెల్లూరు జాతిలో జోడిపి, పల్లా, బ్రౌన్, అనే మూడురకాలు ఉన్నాయి. మాంసోత్పత్తిలో కాని, శరీర పరిమాణంలో కాని ఈ మూడు రకాల్లో పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో జోడిపి, బ్రౌన్ జాతి గొర్రెలను ఎక్కువగా పెంచుతున్నారు.
వివిధ వయసుల్లోని నెల్లూరు జాతి గొర్రెల బరువు
గొర్రె వయస్సు, బరువు(కిలోల్లో), పొట్టేళ్లు
40-50, ఆడ గొర్రెలు 25-35, ఆరు నెలల వయస్సులో 19-20, మూడు నెల్ల వయస్సులో 14, పుట్టిన పిల్ల 2.50-4.0. |
దక్కని జాతి:
ఈ జాతి గొర్రెలు నల్లగా, పొట్టిగా ఉండి కంబళ్ళు, తాళ్ళునేయడానికి ఉపయోగపడే తక్కువ నాణ్యత గల ఉన్ని మరియు మాంసోత్పత్తికి ప్రసిద్ది. ఈ రకం గొర్రెలు ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఎక్కువ.
వివిధ వయస్సులోని దక్కని జాతి గొర్రెల బరువు
గొర్రె వయస్సు, బరువు(కిలోల్లో), పోటేళ్ళు 25-30, ఆడ గొర్రెలు 20, ఆరు నెలల వయస్సులో 13-15, మూడు నెల్ల వయస్సులో 9-11, పుట్టిన పిల్ల 1.50- 2.0. |
 |
|
మేత / ఆహారం
గొర్రెల పోషణలో మొదలు అతి ముఖ్యమయినది ఆహారం. గొర్రెల పెంపకం లాభసాటిగా ఉండాలంటే వాటికి సరిపడా పచ్చిక బయళ్ళు చాలా అవసరం. ఎందుకంటే ఎలాంటి మిశ్రమ దాణా లేకపోయినప్పటికీ బయళ్ళలో దొరికే పచ్చిక మేసి గొర్రెలను పెంచుకోవచ్చు. చాలా చోట్ల ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు పచ్చిమేత దొరకదు. కనుక గొర్రెలు ఆకలితో చచ్చిపోతాయి. అటువంటప్పుడు కేవలం అవి మేసే గడ్డి మీద ఆదారపడకుండా గొర్రెలు తినే ఆహారంలో కనీసం 8 శాతం వరకు సమీకృత దాణా మనం ఇచ్చినట్లు అయితే గొర్రెల నుంచి అధికోత్పత్తి సాదించవచ్చు.
పెద్ద గొర్రెల దాణా కిలో ఒకటికి 4 రూపాయలు, పిల్లల దాణా 7 రూపాయల వరకు ఆమ్ముడు అవుతున్నాయి. గొర్రెలను ఉదయపు వేళల్లో కాని, సాయంత్రం గాని ఎండవేడి నుంచి తప్పించుకునేలా, పొలాల్లో మేయడానికి వదలడం మంచిది. ఆప్పుడు అవి నింపాదిగా, ఇష్టంగా గడ్డిమేస్తాయి. గొర్రెలు ఎన్ని గంటలు మేసాయి అన్నది ముఖ్యం కాదు. ఎంతగడ్డి ఎంత తక్కువ కాలంలో అందుబాటులో ఉందో ముఖ్యం. కనుక గొర్రెల్ల మంద బరువు పెరుగుతున్నదో లేక క్షీణిస్తున్నాయా అని తెలుసుకోవడం అవసరం. నెలనేలా మొదటి వారం లో గొర్రెల బరువులను తీయాలి. గత నేలకన్నా ఇప్పటి నెలలో గొర్రెల బరువులు తగ్గాయి అంటే వాటికి తిండి చాలటం లేక, తగ్గ్గిపోతున్నయాన్న మాట. అప్పుడు గొర్రెలకు అదనంగా షెడ్లలో ఆహారం అమర్చాలి.
గడ్డి రకాలు:
ఆరు బయట, పొలాల్లో దొరికే పచ్చిక రకాలు కాకుండా, ప్రతి రైతు తన పొలంలో కనీసం 10 శాతం ఏకవార్షిక, బహువార్షిక పచ్చికలను పెంచుకోవాలి. పచ్చిమేతలు అనేక రకాలు, భూసారం, నీటి వసతులను బట్టి చిక్కుడు జాతులైన బర్సిము, లూసర్ను, స్టయులో, అలసందలు, పిల్లిపెసర, వేరుశనగ కట్టే మొదలైన వాటిని పెంచుకోవచ్చు. వీటిలో మాంసకృతులు ఎక్కువ, కనుక శ్రేష్టమైనవి. ఇవికాక జొన్న, నోక్కజోన్న, రాగి, సజ్జలను పచ్చిగా ఉన్నప్పుడు గొర్రెల ఆహారంగా ఇవ్వవచ్చు. వీటిని చిన్న ముక్కలుగా కత్తిరించి ఇస్తే వృదా వుండదు. గొర్రెలు ఇష్టంగా తింటాయి.
పూసాజైంట్ నేపైయారు, గినీగడ్డి, పారాగడ్డి, సుడాను గడ్డి రకాలను తగినంత నిఇతి సదుపాయమున్న చోట్ల పెంచవచ్చును. ఇవి ఒక్కసారి నాటితే చాలా సంవత్సరాలు దిగుబడినిస్తాయి.
వేప, చింత, రావి, మర్రి, సుభాబులు, అవిశే, మునగ చెట్ల ఆకులు కుడా గొర్రెల ఆహారంలో విరివిగా ఇవ్వవచ్చు.
ఎండు వరిగడ్డి మీద 4 కిలోల యూరియా, 1కిలో ఉప్పు, 1 కిలో ఖనిజ లవణ మిశ్రమాలను 60లీటర్ల నీళ్లలో కరిగించి స్ప్రే చేసి 2వారాలు గాలి చొరకుండా చేయాలి. ఆ తరువాత ఆ మాగుడు గడ్డిని క్రమక్రమంగా గొర్రెలకు అందజేస్తే గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక పచ్చిమేతలు విస్తారంగా ఉన్నప్పుడు, వాటిని ఎండబెట్టి, దాచుకోవాలి. పొలాలల్లోమేత లేనప్పుడు ఈ ఎండుగడ్డిని గొర్రెలకు షేడ్లల్లో ఇవ్వాలి.
గొర్రెలకు సమీకృత దాణా తినిపిస్తే మంచి ఫలితాలను ఇస్తాయి. స్థానికంగా ఏవస్తువు చౌకగా దొరికితే అదే వాడుకొని దాణాతయారు చేసుకోవచ్చు. లేదా కంపెనీలు తయారుచేసే మిశ్రమ దాణాలను కొనుకోవచ్చు.
పెద్దగోర్రెల దాణా ఈవిధంగా ఉంటే మంచిది. నలుగ కొట్టిన మొక్కజొన్నలు 25 పాళ్ళు, వేరుశనగ పిండి 32పాళ్ళు, గోధుమ/బియ్యం తవుడు 40 పాళ్ళు, ఖనిజ లవణ మిశ్రమం 02 పాళ్ళు, ఉప్పు 01 పాళ్ళు
దాణా
పుట్టిన గొర్రె పిల్లలకు 3 నెలల వయసు వరకు ఎదగడానికి దాణా ఈ విధంగా చేసుకోవచ్చు.
మొక్కజొన్నలు 60 పాళ్ళు, వేరుశనగ పిండి 20 పాళ్ళు, చేప పొట్టు 10 పాళ్ళు, గోధుమ తవుడు 07 పాళ్ళు, ఖనిజ లవణ మిశ్రమం 02 పాళ్ళు, ఉప్పు 01 పాళ్ళు.
ఇక గొర్రెలకు ఇవ్వవలసిన దాణా మోతాదులు.
విత్తనపు పోటేళ్ళకు ప్రతి పొట్టేలుకు జతకలుసే సిఇజనులో రోజుకు 400-500 గ్రాముల దాణా ఇవ్వాలి.
ఆడగోర్రెలకు దాణా
ఎ) చూడి కట్టించడానికి కనీసం 3-6 వారాల ముందు నుంచి ప్రతి గొర్రెకు సగటున రోజుకు 150 నుంచి 250 గ్రాముల దాణా ఇవ్వాలి.
బి) చూలుతో ఊన్నప్పుడు 200-300 గ్రాముల దాణా ప్రతి గొర్రెకు ఇవ్వాలి.
సి) ఈనిన తరువాత 60-90 రోజుల వరకు 200-300 గ్రా||. దాణా ఇవ్వాలి.
ఎదిగే పిల్లలకు దాణా
సగటున రోజుకు 20 గ్రా|| దాణా అవసరం. 3 వారల వయస్సు వచ్చిన తరువాత 50 గ్రాముల దాణా ఇవ్వాలి. ఇట్లాఇవ్వడం బయటదోరికే పచ్చిక మీద ఆదారపడుతుంది. ఒక వేళ పచ్చికదొరికితే దాణా ఇవ్వక్కరలేదు.
ఖనిజ లవణ మిశ్రమపుఇటుకలను గొర్రెల షేడ్లల్లో వ్రేలాడకడితే వాటికి అవసరం వచ్చినప్పుడు నాకటం వాల్ల లవణ లోపము రాకుండా నివారింపబడి గొర్రెల ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలల్లో పెరుగు దళ బాగావుంటుంది.
మన దేశ వాలి గొర్రె పిల్లలు పుట్టినప్పుడు 2.0-3.0 కిలోల బరువుంటాయి. గొర్రెపిల్లను సామాన్యంగా 3-4 నెలల వయసు వచ్చేటప్పటికి తల్లిపాలు మరిపించాలి. ఆప్పుడు పిల్లలు 11.0-13.00 కిలోల బరువుండాలి. సంవత్సరానికి కనీసం 20-23కిలోల బరువుండాలి. కనుక గోర్రేపిల్లలను 10-15 నెలల వయస్సులో లేదా 23.0-25.0 కిలోల బరువున్నప్పుడు మార్కెట్టుకు కోతకు పంపితే లాభదాయకం. |
|
గొర్రెల వసతి
వర్షాకాలంలోమరియు రాత్రులందు గాలి వెలుతురు లేని చీకటి కొట్టాలల్లోఎక్కువ సంఖ్యలో గొర్రెలను వుంచటం వల్ల కొట్టంలో చిత్తడి ఏర్పడి రోగకారక క్రిములు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇలాంటి పరిస్తుతులను అధిగమించడానికి, ఎండ, వాన నుండి పశువులను కాపాడుకోవడానికి స్థానికంగా దొరకే ముడిసరుకు నుపయోగించి నివాసానికి ఉపయోగపడే కొట్టాలను నిర్మించుకొనవచ్చు.
పశు పాక నిర్మాణం:
స్థానికంగా దొరికే ముడి సరుకులతో నిర్మించుకోవాలి. ఎతైన ప్రదేశాల్లో కొట్టం నిర్మించాలి. గాలి వెలుతురు పుష్కలంగా ప్రసరించే విధంగా ఉండాలి. కొట్టం లోపల చిత్తడిగా ఉండరాదు. కొట్టం చుట్టుప్రక్కల నీడని మరయు గ్రాసాన్ని ఇచ్చే సుబాబుల్, అవిస మరియు తుమ్మచేట్లను పెంచాలి. కొట్టంలో ప్రతి పశువుకు 1 చ,,మీ. విస్తీర్ణం అవసరముంటుంది. పిల్లలకు 0.4 చ. మీ. స్థలం అవసరం. ప్రతి కొట్టంలో 4-6అం. లోతు, 0.4 మీ,, వెడల్పుతో కావలసినంత పొడుగుతో దాణా తొట్టి కట్టాలి. ఒక మూలగా 6 అం. లోతు, 0.4 మీ. వెడల్పుతో 2 మీ. పొడుగుగా నీటి తొట్టి కూడా నిర్మించాలి. నేల సిమెంట్ ప్లోర్ కాకుండా మొరంతో ఏర్పాటు చేసుకోవాలి.
|
|
గొర్రెల వ్యాధులు – వాటి చికిత్స, నివారణ :
వివిధ రకాల వ్యాధి కారక క్రిములు గొర్రెలను ఆశ్రయించి నష్టం కలిగిస్తాయి.
సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు : చిటుకు వ్యాధి, (ఇ.టి).,ఆంత్రాక్స్ లేదా నెరుడు వాపు లేదా నల్ల జాడ్యం, ఊపిరితిత్తుల్లో నేమ్ము లేద నిమోమియో, పోగాళ్ళు లేదా బురద పుండ్లు లేదా మితువ కాళ్ళు (ఫుట్ రాట్), గొంతు వాపు వ్యాది (హచ్. ఎస్. వ్యాది)
వైరస్ వల్ల కలిగే వ్యాధులు : గాలి కుంటు వ్యాధి (పుట్ అండ్ మౌత్ వ్యాధి)నీలి నాలుక (బ్లూటంగ్), బొబ్బ రోగం/ అమ్మతల్లి (షిప్ ఫాక్స్), పి,పి,ర్(మేకల ప్లేగు),అస్య పుండ్లు, నోటి పుండ్లు.
ఏకకాణ జీవుల వల్ల కలిగే వ్యాధులు : రక్త పారుడు లేదా కాక్సిడియోసిస్
అంతరపరాన్న జీవులు : జలగలు, ఏలిక పాములు, బద్దె పురుగులు
చిటుకు వ్యాధి : తొలక రి వర్షాలు మొదలైన వంటనే గొర్రెలకు సోకే వ్యాధుల్లో ఇది చాలా ముఖ్యమైనది. మన రాష్ట్రం లోని జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలి వుంది. ఈ వ్యాధి క్లాస్ట్రీడియం జాతి సుక్ష్మ జీవుల వల్ల వర్షాకాలం, తొలకరి వర్షాలు పడిన వెంటనే సంక్రమించే అవకాశం ఉంది. ముఖ్యంగా బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్న గొర్రె పిల్లలకు మరియు లేత వయస్సు జీవాలకు ఎక్కువగా వస్తుంది. బాగా మేస్తున్న జీవం ఒకేసారి ఎగిరిపడి కొట్టుకొని మరణించడం. ఒకే సారి ఎక్కువ తిన్న లేదా పాలు త్రాగిన జీవాల్లోకడుపులో ఎక్కువ శాతం పిండి పదార్థాలు వుండటం వల్లన క్రిమికారకాలు వృద్ది చెంది విష పదార్ధం ఉత్పత్తి అవుతుంది. కడుపును కాళ్ళతో తన్నడం, కడుపు నొప్పి, కడుపుబ్బటం,నల్లగా దుర్వాసన వచ్చే పారుడు, నోటినుండి నురగ రావటం, కొన్ని జీవాల్లో ఫిట్స్ లాంటి లక్షణాలు కనబడటం, గుండ్రంగా తిరగటం, కుప్పకూలి పోవటం జరుగుతుంది.
రోగానిర్దారణకు పరిక్షలు: చనిపోయిన గొర్రెలను కోసి చూసిన మూత్రపిండాలు మెత్తబడి ఉంటాయి. గుండె పొరలపై, పొట్టమీద, చిన్నప్రేగు మొదటి భాగంలో మరియు ఊపిరితుత్తులపై రక్తస్రావాలు వుంటాయి. పొట్టలో మరియు ప్రేగుల్లో ఆకుపచ్చ ద్రవం ఉంటుంది.
చికిత్స : పశువైద్యుని సలహా మేరకు ఆక్సి టెట్రా సైక్లిన్ మందును 5-10 మిల్లిగ్రాములు ఒక కిలో బరువుకు లెక్కకట్టి ఇవ్వాలి.(షుమారు 3-5 మి.లీ.) 50 మిల్లి గ్రాముల ఫోటాషియంపర్మాంగానేట్ ను 100 మి.లీ. నీటిలో కలిపి త్రాగించాలి.
నివారణ: ఈ వ్యాదికి టీకా మందు కలదు. వి.బి.ఆర్.ఐ. సంస్థ తారు చేసిన టీకా మందును ప్రభుత్వ పశువుల ఆస్పత్రిలో ఉచితంగా ఇస్తారు. 2.5 మి.లీ. చర్మం క్రింద ఇవ్వాలి. మొదటి సారి టీకామందును 3 మాసాల నిండిన గొర్రె పిల్లలకు నట్టల మందు తాపిన తరువాత ఇవ్వాలి. మొదటి టీకా ఇచ్చిన 15 రోజులకు బస్తర్ డోస్ మళ్ళీ ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి సంవత్సరం మే లేదా జూన్ మొదటి వారం లో క్రమం తప్పక ఇస్తుండాలి.
అంత్ర్రాక్స్ లేదా నేరుడు వాపు లేదా నల్ల జాడ్యం : అంత్రాక్స్ సుక్ష్మ జీవుల కలిగే వ్యాధి. ఈ జబ్భు పాడి పశువులు, గొర్రెలు మరియు మేకల్లో వస్తుంది. వ్యాధి గ్రస్తమైన పశువుల మామ్సంతింనడం వల్ల లేదా చర్మం వలచడం లాంటి పనులు చేసిన మనుషులకు కుడా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కలుగాజేసీ బాసిల్లస్ జాతి సుక్ష్మ క్రిములు భూమి లోపల స్పోరాల రూపంలో కొన్ని సంవత్సరాలవరాకు ఉండి అనువైన పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షాకాలం మొదలైన వెంటనే పశువులను ఆశ్రయించి వ్యాధి కలుగజేస్తాయి.
లక్షణాలు: అకస్మాతుగా మరణించడం, తీవ్రమైన జ్వరం, శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది, తూలి పడటం, కాళ్ళు పడిపోవటం మరియు ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోవడం, చనిపోయిన జీవుల్లో నోరు, చెవులు, ముక్కులు, మలద్వారం, యోని నుండి నల్లని రక్తం గడ్డకట్టకుండా కారుతుంది. చనిపోయిన జీవాల శరీరం త్వరగా ఉబ్బిపోయి కుళ్ళి పోతుంది.
ముఖ్య గమనిక: ఈ వ్యాధితో చనిపోయిన జీవాలును శవపరీక్ష (పోష్టు మార్టమ్) చెయకూడదు. చనిపోయిన పశువుల లేదా చివరిదశలో ఉన్న పశువును కోసినట్లైతే, సూక్శ్మ క్రిములు స్పోరులు ఆ ప్రాంతమంతా వ్యాపిస్థాయి. కావున శవపరీక్ష చేయకూడదు.
ఒక వేళ పొరపాటున కోసిన ఎడల స్ప్లిన్స్ చాలా పెరిగి వుంటుంది. కాలేయం మరియు మూత్రపిండాలు బాగా యర్రబారి వుంటాయి. శరీరములోపల ఎర్రని ద్రవం చేరి ఉంటుంది. పొరపాటున జీవాలను చనిపోయిన తరువాత లేదా చివరి దశలో కోసిన ఎడల వెంటనే గొయ్యి త్రవ్వి పూడ్చి సున్నం చల్లాలి. అదే విధంగా ఆప్రాంతమంతటా సున్నం చల్లాలి.
చికిత్స : వ్యాధి నిర్దారించిన యెడల వ్యాధిగ్రస్తమైన జీవాలకు క్రిందివానిలో ఏదైనా ఒక అంటిబయాటిక్ 5 రోజులు ఇవ్వాలి. ఆక్సిటేట్రసైక్లిన్ 5-10 యమ్.జి./ ఒక కిలో బరువు చొప్పున లేదా పెన్సిలిన్ 10,000 -20,000 ఐ.యు./ కిలో బరువు చొప్పున లేదా అంఫిసిలిన్ 5-10 యం.జి./కిలో బరువు చొప్పున ఇవ్వాలి.
నివారణ : వ్యాధి ప్రభలిన ప్రాంతంలో ప్రతి సంవత్సరం టీకా మందు ఇవ్వాలి. ఏదైనా ప్రాంతంలో ఆత్రాక్స్ వ్యాప్తి చెంది నట్లు వార్త వచ్చిన వెంటనే మిగిలిన ఆన్ని పశువుల్లో టీకాలు ఇవ్వాలి. టీకా మందు 1 మీ. లీ. చర్మం క్రింద ఇవ్వాలి. ఈ టీకా మందును ప్రభుత్వం ఉచితంగా సరపరా చేస్తుంది.
చనిపోయిన లేక వ్యాధి గ్రస్తమైన పశువుల మాంసం తినడం వల్ల మరియు చర్మం ద్వారా ఈ రోగం మనుషుల్లో కూడా వస్తుంది. వ్యాధి సోకిన మనుషుల్లో నిమోనియాతో కూడిన జ్వరం లేదా చేతులపై చర్మం మీద పుండ్లు ఏర్పడవచ్చు.
ఊపిరితిత్తుల్లో నెమ్ము/ గుండె నెమ్ము (నిమోనియో) : గోర్రెల్లో ఊపిరితిత్తులకు నెమ్ము లేదా గుండె నెమ్ము లేదా నిమోనియో వ్యాధి తరుచూ వస్తుంది. వర్షాకాలం మరియు చలికాలంలో ఈ వ్యాది తీవ్రత ఎక్కువ. వైరస్ లేదా ఇతర సుక్ష్మక్రిముల ద్వారా వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు : జ్వరం, దగ్గు, ముక్కు నుంచి చీమిడి/ నీరు కారడం, ఎగ శ్వాస, రాత్రులందు మంద దగ్గరకు పోయిన ఎక్కువ సంఖ్యలో జీవాలు కంగున దగ్గుతుంటాయి.
రోగ నిర్దారణ : చనిపోయిన పశువులను కోసి చూసిన దొబ్బ గట్టిబడి ఉంటుంది. ఊపిరితుత్తుల ముక్కకోసి నీటిలో వేసిన మునుగుతుంది.
చికిత్స : స్ట్రెప్టోపెన్సిలిన్ 4-5 మి.గ్రా.లేదా జంటామైసిన్ 2-4 మి.గ్రా./కిలో బరువు చొప్పున లేదా సిప్రాప్లాక్సిన్ 5-10 మి.గ్రా./ కిలో బరువు చొప్పున ఇవ్వాలి.
నివారణ : జివాలుండే పాకను పొడిగా గాలి వెలుతురు సమృద్దిగా సోకేట్టు నిర్మించాలి. దగ్గుతున్న జివాలును గుర్తించి వీలైనంత త్వరగా చికిత్స చేయించాలి.
పాగాళ్ళు లేదా ముతువ కాళ్ళు లేదా ఫుట్ రాట్ : వర్షాకాలం లో గొర్రెలు పాగాళ్ళు దాదాపు అన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. జివాలు ఉంచేపాకలో,ఆరుబయటమరియుదడిలోరొచ్చుమరియు
చిత్తడిగా ఉండటం వల్ల మరియు పచ్చిక బయళ్ళలో కుడా బురద లేదా నీరు ఉండటం వల్ల గిట్టలు మధ్య సుక్ష్మ క్రిములు చేరి అభివృద్ధి చెంది ఈ వ్యాదిని కలిగిస్తాయి.
లక్షణాలు : జీవాలు కుంటడం, గిట్టలు మెత్తబడటం , గిట్టల సందుల్లో పుళ్లు, దుర్వాసన, జ్వరం తీవ్రంగా వచ్చినప్పుడు గిట్టలు ఊడిపోవడం, రెండు కాళ్ళకు వ్యాధి సోకినప్పుడు మోకాళ్ళ మీద నిలబడడం జరుగుతుంది.
చికిత్స : జీవాలు పాకనుండి బయటకు వచ్చే గేటు దగ్గర లోతు తక్కువ ఉండి, వెడల్పు మరియు పొడవుగా ఉండే గుంత సిమెంటుతో నిర్మించి అందులో 8% పొటాషియం ఫర్మంగానేట్ ను లేదా 5% ఫార్మలిన్ ద్రావణాన్ని నింపాలి. ఇట్టి గుంతలల్లో అన్ని జీవాలను 3 నుంచి 5 నిమిషాలు నిలబెట్టిన ఎడల పాగాళ్ళు పూర్తిగా నివారించవచ్చు. వ్యాధి సోకిన జీవాలకు ప్రోకేయిన్ ఫేనిసిలిన్ 70,000 ఐ.యు., స్రేప్టో పెన్సిలిన్ 70 మి,గ్రా./కిలో బరువు చొప్పున ఒకసారి ఇచ్చిన సరిపోతుంది. చికిత్స చేసినా కుడా తగ్గని జీవాలను కోతకు ఆమ్మివేయాలి.
నివారణ : పాకలో లేదా మంద కట్టే ప్రాంతంలో చిత్తడి/రొచ్చు లేకుండా చూడాలి. బురద/నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మేపరాదు. పాక లేదా దడి గేటు దగ్గర వెడల్పాటి సిమెంటు గుంత నిర్మించి 8% పొటాషియం పర్మాంగనేటును లేదా 5% ఫార్మాలిన్ ద్రావణం ఉంచి, ప్రతి రోజు జీవాలను దీని గుండా నడపాలి. పుండ్లకు హిమాలై వంటి మందును పూయాలి.
గొంతువాపు వ్యాధి (హెచ్.ఎస్.) : ఇది పాశ్చురెల్లా జాతికి చెందిన సుక్ష్మ జీవుల వలన వచ్చే వ్యాధి. రక్తం లో వ్యాధి జనక సుక్ష్మ జీవులు మరియు వాటి విషపదార్థాలు చేరే అంటువ్యాధి. వ్యాధి గ్రస్త పశువుల లాలాజలంతో కలుషితమైన మేత, నీరు ద్వారా ఆరోగ్యంగా ఉన్న పశువులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జూన్-అక్టోబర్ నెలల్లో వ్యాధి సంక్రమిస్తుంది.
లక్షణాలు :తల, గొంతు, ఛాతి భాగాల్లో చర్మం క్రింద నీరు చేరటం వలన పూర్తిగా వాచిపోయి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. (102-106 డిగ్రీల ఫారన్ హీట్) నోటి నుండి ఎక్కువగా లాలాజలం కారుతుంది. కళ్ళు ముక్కు నుండి కూడా ఎక్కువుగా నీరు కారుతుంది.వ్యాధి సోకిన 24-36గంటలలోపు చికిత్స చేయక పోతే శ్వాస అందక చనిపోతుంది. చనిపోయిన పశువును శవపరీక్ష చేసి గొంతు వాచిన భాగంలో కోసి చూసినట్లయితే రక్తంతో కలిసిన నీరు ఉంటుంది. శరీరంలోని వివిధ అవయవాలు (గుండె, కాలేయం, మూత్రపిండం, ఊపిరితిత్తులు) గుండెను అంటిపెట్టుకొని ఉన్నపోర,రక్తకేశ నాళికల నుండి రక్తస్రావం జరుగుతుంది.
చికిత్స : సల్ఫాడిమిడిన్/సోడియం సల్ఫాడిమిడిన్ కిలోబరువుకు 150మి. గ్రా.చొప్పున సిరలోనికి ఇచ్చినట్లయితే 24 గం.. లలోపు దాదాపు లక్షణాలన్నీ తగ్గిపోతాయి. అలాకాని పక్షంలో 24 గంటల తరువాత ఇదే మందును తిరిగి ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి సోకిన పశువును కాపాడవచ్చు. టెట్రాసైక్లిన్ కిలో బరువుకు 5-10 మి.గ్రా.చొప్పున సిరలోనికి మొదటి మూడురోజులు యిచ్చి తరువాత కండరంలోనికి 3 రోజులు ఇవ్వాలి.
నివారణ : గొంతు వాపు వ్యాధి టీకా 2.5 మి.లీ. చొప్పున చర్మం క్రింద ఆరునెలలు పైబడిన పశువుల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలి. గొంతువాపు మరియు జబ్బవాపు మిశ్రమ టీకా 5 మీ.లీ. చొప్పున 6 నెలలు పైబడిన పశువుల్లో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఇవ్వడం ద్వారా పశువుల్లో ఈ రెండు వ్యాధులను నివారించవచ్చు.
నీలి నాలుక (బ్లూటంగ్) :వర్షా కాలంలో గొర్రెలకు సూక్ష్మాతిసూక్ష్మజీవుల వల్ల (వైరస్ వల్ల)వచ్చే ముఖ్యమైన వ్యాధి నీలి నాలుక. ఈ వ్యాధి మన రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో వ్యాపించింది. ఈ వ్యాధి కారక వైరస్ క్యూలికాయిడస్ అను దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. టీకా మందు లేనందున ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి మరియు ఉద్రుతిని నివారించాలి. సెప్టెంబర్ నుండి డిసెంబరు వరకు వ్యాధి వచ్చే ఆవకాశం ఉంటుంది.
లక్షణాలు : తీవ్రమైన జ్వరం, చిగుళ్ళ వాపు, నోటి లోపల, నాలుక మీద కురుపులు, నాలుక నీలిరంగులోకి మారడం, నోటిలో పుండ్లు ఏర్పడి నోటి నుండి దుర్వాసన రావటం మరియు పశువులు కుంటుతాయి. మడమచుట్టు వాపు వుంటుంది.వ్యాధి సోకే కాలంలో చూడి గొర్రెలు ఎక్కువుగా ఉండటం వల్ల ఈడుసుకు పోవడం కూడా గమనించవచ్చు.
చికిత్స : జబ్బు పడ్డ జీవాలను వేరు పరచాలి. జబ్బు పడ్డ జీవాల్లొ ఇతర వ్యాధులు సంక్రమించకుండా ఉండెందుకుఆక్సిటేట్రా సైక్లిన్ 5-10 యమ్.జి./కిలో బరువుకు ఇవ్వాలి. నోటి పండ్లను శుభ్రపరచి బోరోగ్లిసరిన్ పూత మందు వాడాలి. నోటి పుండ్ల కారణంగా జీవాలు తినలేవు.కావున రాగి లేదా జొన్న జావ చేసి త్రాగించాలి.
నివారణ : టీకా మందు లేదు కావున క్రింది చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. జబ్బు పడిన పశువులను ఏరివేయాలి. క్యులికాయిడాస్దోమ నివారణకు చర్యలు చేపట్టాలి.చుట్టుప్రక్కల
ప్రదేశాల్లో మురుగు నీరు లేకుండా చూడాలి. సంధ్య వేళలో వీపాకు పొగ పెట్టడం ద్వారా దోమల నివారణ చేపట్టవచ్చు. జీవాల పాకను/మందను కట్టే ప్రదేశాన్ని ఎతైన చోట నిర్మించాలి.
గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ వ్యాధి): గాలి కుంట వ్యాధి వైరస్ వలన గోర్రెల్లో అతి తక్కువ సమయంలో అకస్మాతుగా కలిగే భయంకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధి కాలిగిట్టలు చీలి వున్న పశువుల్లో మాత్రమే కలుగుతుంది. స్పర్శ, గాలి, పశువుల కాపరులు, పాళీ పిండే వాళ్ళు మరియు వ్యాధి గ్రస్త పశువు లాలాజలం ద్వారా వ్యాధి సోకిన పశువు నుండి మందలోని ఇతర పశువులకు వ్యాపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వ్యాధి గాలి ద్వారా చల్లని వాతావరణ పరిస్తితుల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది.
లక్షణాలు : నాలుక, డెంటల్ పాడ్,ముక్కుపైన, కాలి గిట్టల మధ్య, పొక్కులు లేదా బొబ్బలు ఏర్పడ తాయి. కొన్నిసార్లు పొక్కులు పొడుగు మీద కూడా ఉండి పొదుగు వాపు వ్యాధి కలుగుతుంది. క్రమంగా గిట్టలు మద్య వన్న పొక్కులు వాచి పుండ్లు పుడుతాయి. పశువు నడవలేకుండా అవుతుంది. నోటిలో పొక్కులు చితికిపోయి పుండ్లు ఏర్పడ తాయి. దీనితొ పశువు మేత తీసుకోలేక నిరసించి పోతుంది. నోటి నుండి లాలాజలం ఎక్కువుగా కారుతుంటుంది. పాలిచ్చే పశువుల్లో పాలదిగుబడి అధికంగా తగ్గుతుంది. చులు పశువుల్లో గర్భస్రావం సంభవించవచ్చు.
వ్యాధి తదనంతర లక్షణాలు : ఈ వ్యాధి నుంచి కోలుకున్న పశువులు ఎక్కువకాలం వాతావరణం లోని తట్టుకోలేక అధిక వేగంతో శ్వాసతీసుకుంటాయి. పశువు శరీరం పైన వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ వ్యాధితో చనిపోయిన పశువుకు శవపరీక్ష చేసినప్పుడు గుండెపైన పచ్చటి చారలు గమనించవచ్చు.
చికిత్స : నోట్లోని, గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మంగానేట్ ద్రావణం లేదా బోరిక్ ఆసిడ్ ద్రావణం లేదా ఆక్రిప్లైచిన్ వంటి యాంటిసెప్టిక్ ద్రావణాలతో శుభ్రపరచాలి. నోట్లోని పండ్లకు గ్లిజరిన్ను పూయాలి. అదే విధంగా గిట్టల మద్య పండ్లకు సల్ఫర్ ఆయింట్ మెంట్ ను పూయాలి. గంజిని త్రాగించాలి.
నివారణ : ప్రభుత్వం వారు సరఫరా చేసే గాలి కుంటువ్యాధి టీకా 5 మి.లీ. లేదా రక్షా ఎఫ్.ఎమ్.డి. టీకా 1మి.లీ. ను 6 నెలల వయసులో మొదటి డోసు ఇచ్చి తిరిగి ప్రతి 6 మాసాలకొకసారి చర్మం క్రింద ఇప్పించాలి.
అమ్మతల్లి/బొబ్బరోగం : ఇది సుక్ష్మాతి సూక్ష్మజీవుల వలను గొర్రెల్లో చలికాలంలో సంక్రమించే అంటువ్యాధి. దీనివలని శరీరంలోని అన్ని ప్రదేశాల్లో పొక్కులు వస్తాయి. ఈ వ్యాధి సోకినందు వలన పెద్ద వాటిలో 50%వరకు పిల్లల్లో 90%వరకు మరణాలు సంభవిస్తాయి. వ్యాధి వున్న గొర్రెలతో కలసి వున్నప్పుడు ఇతర వాటికి నేరుగా స్పర్శ ద్వారా, ఈగలు, దోమలు ఇతర కీటకాల ద్వారా కుడా వ్యాధి వ్యాపిస్తుంది.
లక్షణాలు : అధిక జ్వరం, చర్మంపైన వెంట్రుకలు తక్కువుగా వున్న ప్రదేశాల్లో, ముఖ్యంగా ముఖం, చెవులు, తొడలు, పొదుగు మొదలుగు చోట్ల బొబ్బలు వచ్చి శరీరమంతా వ్యాపిస్తుంది. నోటిలోని చిగుళ్ళపై పూత వచ్చి పుండ్లు పడతాయి. ముక్కు రంద్రాలు, పెదవులు మరియు శ్వాశకోసంలో పుండ్లు వచ్చి నిమోనియో కలిగి చిన్న పిల్లలు అతిగా పారుతూ శ్వాశ క్రియ ఇబ్బందివలన చనిపోతాయి. చూడు గొర్రెల్లో గర్బస్రావం జరుగుతుంది.
చికిత్స : వ్యాధి సోకిన గోర్రెలకు సౌకర్యంగా ఉండేటట్లు చూసి గంజి వంటి ఆహారాన్ని ఇవాలి. పండ్లకు వేపనూనె రాయాలి లేదా హిమాక్స్ వంటి పూత మందులు పూయాలి.
నివారణ : వ్యాధి సోకిన వాటిని మందనుండి వేరుచేసి చికిత్స చేయాలి. ఆమ్మతల్లి టీకా 1మి.లీ. చొప్పున మందతో మిగిలిన పశువులకు చర్మం క్రింద ఇవ్వాలి.
పి.పి.ఆర్. లేదా గోర్రెల్లో పారుడు లేదా మేకల ప్లేగు : గోర్రెల్లో, మేకల్లో వచ్చే ఈ వ్యాధిని మేకల ప్లేగు(గాట్ ప్లేగు)అని కుడా పిలుస్తారు. ఈ మధ్యనే ఎక్కువ వస్తున్న ఈ వ్యాధి పారామిక్సోవిరిడే జాతికి చెందిన మార్టిల్లి వైరస్ వలన వస్తుంది. పి.పి.ఆర్.వ్యాధిని కలుగచేసే వైరస్ కు, ముసరవ్యాధి (ఆర్.పి)ని కలుగ చేసే వైరస్ కు దగ్గరి పోలిక ఉంది. కావున ముసుర వ్యాధి నిర్మూలన పథకం క్రింద టీకాలు ఇచ్చినంత కాలం పి.పి.ఆర్. వ్యాధి అదపులో ఉంటూవచ్చింది. కాని భారతదేశాన్ని ముసర వ్యాధి నిర్మూలిత దేశంగా ప్రకటించి వ్యాధినిరోదకాలు ఇవ్వడం నిలిపి వేసినప్పటి నుండి పి.పి.ఆర్. ఉదృతి ఎక్కువైంది.
గొర్రె పిల్లల్లో రక్తపారుడు లేదా కాక్సిడియోసిస్ : గొర్రె పిల్లల్లో ముఖ్యంగా వర్షాకాలంలో రక్తపారుడు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. మందకంటే ప్రదేశం/పాక అపరిశుభ్రంగా ఉండటం, గాలి వెలుతురు అంతగా సోకకుండా ఉండటం లాంటి కారణాలవల్ల ఈ వ్యాధి కారక కాక్సీడియో అను ఏకకణ జీవులు అధికంగా అభివృద్ధి చెందుతాయి. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గొర్రె పిల్లలను తల్లి నుండి వేరుచేసి గంప క్రింద కమ్మటం అలవాటు. అలా చేసిన ఎడల అక్కడి ప్రదేశం చిత్తడిగా, చీకటిగా మరియు గాలి ప్రసరించకుండా ఉండటం వల్ల కుడా వ్యాధి కారక క్రిములు అధిక సంఖ్యలో వృద్ధి చెందుతాయి.
లక్షణాలు : రక్తంతో కూడిన పారుడు ఆకలి లేక ఆహారం తీసుకోనకపోవడం, గొర్రె పిల్లలు నీరసించి 2-4 వారాల్లో చనిపోవటం, కాక్సిడియా గుడ్లు పేడలో వుండటం జరుగుతుంది.
చికిత్స : కిలో బరువు అంప్రాలియిమ్ 50 మి.గ్రా. లేదా నైట్రోపురజోన్ 15 మి.గ్రా. లేదా సల్ఫమిడన్ ౧౪౦ మి,గ్రా. ఇవ్వాలి.
నివారణ : పాకను చిత్తడి/రొచ్చు లేకుండా పొడిగా ఉంచాలి. గాలి, వెలుతురు ధారాలంగా ప్రసరించేలా చూడాలి. జబ్బు పడ్డ జీవాలను ఏరివేయాలి. గొర్రె పిల్లలకు దాణా ఇస్తున్నట్లయిన కిలో దాణాకు 25 మి.గ్రా. చొప్పున సల్ఫమిడన్ దాణాలో కలపాలి లేదా నైట్రో పురజోన్ 0.04% త్రాగే నీటిలో కలపాలి.
అంతర పరాన్న జీవుల వల్ల పారుడు : గొర్రెల పెంపకంలో అధిక నష్టం కలుగచేసే వాటిలో అంతర పరాన్న జీవులు ముఖ్యమైనవి. గొర్రెలను ఆశ్రయించే పరాన్న జీవుల్లో జలగలు, ఏలిక పాములు మరియు బద్దె పురుగులు ముఖ్యమైనవి. అంతర పరాన్న జీవులు ఆశ్రయించిన జీవాలు నీరసించి, రక్తహీనత ఏర్పడి మరీ నీరసించిపోతాయి. రక్త హీనత వల్ల గొంతు కింద వాపు వస్తుంది. అదే విదంగా పారుడు ఉంటుంది. అశ్రద్ద చేసిన మరణాలు సంభవించవచ్చు. అన్ని కాలాల్లో వస్తుంది. వర్షాకాలంలో ఉదృతి ఎక్కువ వుంటుంది. జలగలు, గుండ్రని పురుగులు(ఏలిక పాములు) బద్దెపురుగుల ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది.
లక్షణాలు : జీవాలు బలహీనంగా ఉండి రక్తహినతతో కళ తప్పి ఉంటాయి. పారుడు, గొంతు కింద వాపు, పేడలో పరాన్న జీవుల గ్రుడ్లు ఉండటం గమనించవచ్చు.
చికిత్స : సమయానుసారం డాక్టరు సలహామేరకు నట్టల మందు తాపడం, పేడ పరిక్ష చేసి తదనుగుణంగా సిపారసు చేసిన మందు వాడటం లేదా ఈ క్రింది పేర్కొన్న మందుల్లో ఏదైనా వాడవచ్చు.
కిలో బరువుకు ఆల్బెండజోల్ 5-10 మి.గ్రా. లేదా లెవామిసోల్ 7.5 మి.గ్రా. కిలో బరువుకు లేదా ఫెన్ బెండజోల్ 5-10 మి.గ్రా.లేదా నిక్లోసమైడ్ 100 మి.గ్రా. లేదా ఐవర్నేక్టిన్ 200 మి.గ్రా. వాడాలి.
నివారణ : క్రమంతప్పక నట్టల మందు తాపాలి, పేడ పరిక్ష చేసి మందులు వాడాలి. పచ్చిక ప్రదేశాలను మారుస్తూ వుండాలి. నత్తలను నివారించాలి. పరాన్న జీవుల గుడ్లతో కలుషితమైన మడుగుల్లో లేదా కుంటల్లో నీరు తాపకుండా ఉండాలి. ఖనిజ లవణాలు, విటమిన్లు వున్న సమతులమైన మేతను పశువుకివ్వాలి.
గొర్రెలకు మరియు వాటి పిల్లలకు కావలసిన దాణా ఇంటి దగ్గర చేయదలచిన ఎడల ఈ క్రింది విధంగా తయారు చేయాలి.
ఎదిగిన గొర్రెలకు, గొర్రె పిల్లలకు, మొక్కజొన్నలు/జొన్నలు 25 పాళ్ళు, 50 పాళ్ళు, వేరుశనగ పిండి 32 పాళ్ళు, 20 పాళ్ళు, వరితవుడు 40 పాళ్ళు, 17 పాళ్ళు, మినరల్ మిక్చర్ 2 పాళ్ళు, 2 పాళ్ళు, ఉప్పు 1పాళ్ళు, చేప పొట్టు --,10 పాళ్ళు, 100 పాళ్ళు, 100 పాళ్ళు
టీకా మందు/నట్ట మందు త్రాపుటకు సమయసూచిక
జనవరి అంతర పరాన్న జీవుల నిర్మూలన మరియు పి.పి.ఆర్. వ్యాధి. ఫిబ్రవరి బొబ్బ వ్యాధి టీకాలు ఏప్రిల్ అంతర పరాన్న జీవుల నిర్మూలన మే చిటుకు వ్యాధి టీకాలు ఆగస్ట్ అంతరాపరాన్న జీవుల నిర్మూలన అక్టోబర్ బాహ్యపరాన్న జీవుల నిర్మూలన నవంబర్ గాలికుంటు వ్యాధి టీకాలు(అవసరాన్ని బట్టి)
|
|
ఆరోగ్య పరిరక్షణ :
గొర్రెల ఆరోగ్య పరిరక్షణ విషయంలో పరిసరాల పారిశుద్యం ముఖ్యమయింది.
- గొర్రెలను గాలి వెలుతురు బాగా వచ్చే షెడ్లలో తిరగడానికి వీలుగా ఉంచాలి.
- దాణా వేసే తొట్టి, నీటి తొట్టి లను అప్పుడప్పుడు శుభ్రంగా కడిగి సున్నము వేయాలి.
- గొర్రెలను రొజూ ఒకే పొలంలో మెపకూడదు. మార్పిడి పద్దతిలో పచ్చిక బయళల్లో మేపాలి.
- గొర్రెలకు క్రమం తప్పకుండా ఏలిక పాములు, జలగలు మొదలైన పురుగులు పడకుండా మందులు వేయించాలి. అట్లాగే చిటుకు రోగం, జబ్బవాపు, గురక రోగం, గాలికుంటు, పారుడు రోగాల్లాంటి అంటూ వ్యాదులు రాకుండా సకాలంలో టీకాలు వేయించాలి.
- సమీపంలో ఉన్న పశువైద్యుడి సలహాలను, సహాయాన్ని సకాలంలో పొందితే మంచిది
పునరుత్పత్తి
గొర్రెల పెంపకంలో లాబనస్టాలు ఆ మంద యొక్క పునరుత్పతి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. గొర్రెల పెంపకంలో లాభాలు మంద పరిమాణం, గొర్రెల ఎంపిక, చూడి పశువులు మరియు పాలిచ్చే తల్లి జీవాల యాజమాన్యం పై ఆదారపడి ఉంటుంది. కావున ఆడగోర్రెలు ఎంపిక, పోషణ మరియు పునరుత్పతి శక్తి మీద శ్రద్ద చూపాలి.
సంతానోత్పత్తి: మన దేశవాలి గొర్రెలు 12 నెలలు దాటినా తరువాత గాని యుక్తవయస్సుకురావు.
ఎద: ఆడ గోర్రెలు ఎదకు వచ్చినప్పుడు ఎద చివరిదశలో అంటే ఎదకు వచ్చిన 36 గంటల తర్వాత పోట్టేలుతో దాటించడం లాభదాయకం.
ఋతుక్రమం:
గోర్రేజాతి మాములుగా ఏడాది పొడవునా ఎదకు రాదు. సంవత్సరం లో కొన్ని ఋతువులలోనే ఎదకు వచ్చి కడుతాయి. మనదేశం లో గొర్రెలు ఈవిదంగా ఎదకు వస్తాయి.
- మార్చి, ఏప్రిల్ (15-20 శాతం)
- జూన్, జులై, ఆగస్ట్(50-80శాతం)
- అక్టోబర్, నవంబర్(30-50 శాతం)
చూడి కాలము: గొర్రెలలో సగటు చూడికాలము 148 రోజులు, అంటే 5నెలలు.
జత కలపడం : మన ప్రాంతంలో విత్తనపు పొట్టేళ్లను ఎప్పుడూ గొర్రెల మందతో కలిపి మేపుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. విత్తనపు పొటేళ్ళను విడిగా మేపుతూ, రాత్రి వేళల్లో మాత్రం ఎదకు వాచ్చిన గొర్రెలతో కలపడం మంచిది.
నిర్వీర్యం: మనము విత్తనానికి వాడే పొట్టేళ్ళు తప్ప మిగతా అన్ని మగ గొర్రె పిల్లలు 2 వారాల వయసులో ఉన్నప్పుడు, వాటి వృషణాలను నలిపివేసి నిర్వీర్యం చేయాలి. దీంతో పిల్లలు బాగా పెరుగుతాయి. తొందరగా లావేక్కుతాయి.
పనికి రాని గోర్రేలను ఏరివేయడం : ప్రతి సంవత్సరం కొత్తగా పుట్టే గోర్రేపిల్లలను ముఖ్యంగా ఆడ గొర్రె పిల్లలను అన్నింటిని అట్టేపెట్టి, వయసు మీరిన, రోగిస్టిగా ఉన్న, బక్కచిక్కివున్న ఆడగోర్రేలని మంద నుంచి ఏరివేసి అమ్మేయాలి. అవిటిగా పుట్టిన పిల్లలు, పుట్టినప్పుడే బలహీనంగా ఉన్న గోర్రేపిల్లలను వెంటనే అమ్మేయాలి. మగగొర్రె పిల్లలలో విత్తనపు పొట్టేళ్ళు తప్ప మిగతావాటిని ఆమ్మివేయాలి. నూరు గొర్రెలకు 3 విత్తనపు పొట్టేళ్ళు జతకలపడానికి అవసరం.
సాదారణంగా ప్రతి సంవత్సరం మందలో 5 నుంచి 10 శాతం గొర్రెలను ఏరివేస్తేనే ఆర్థికంగా లాభం. ఆహారం ఖర్చు తగ్గించవచ్చు.
పనికి రాని గోర్రేలను ఏరివేయడం : ప్రతి సంవత్సరం కొత్తగా పుట్టే గోర్రేపిల్లలను ముఖ్యంగా ఆడ గొర్రె పిల్లలను అన్నింటిని అట్టేపెట్టి, వయసు మీరిన, రోగిస్టిగా ఉన్న, బక్కచిక్కివున్న ఆడగోర్రేలని మంద నుంచి ఏరివేసి అమ్మేయాలి. అవిటిగా పుట్టిన పిల్లలు, పుట్టినప్పుడే బలహీనంగా ఉన్న గోర్రేపిల్లలను వెంటనే అమ్మేయాలి. మగగొర్రె పిల్లలలో విత్తనపు పొట్టేళ్ళు తప్ప మిగతావాటిని ఆమ్మివేయాలి. నూరు గొర్రెలకు 3 విత్తనపు పొట్టేళ్ళు జతకలపడానికి అవసరం.
సాదారణంగా ప్రతి సంవత్సరం మందలో 5 నుంచి 10 శాతం గొర్రెలను ఏరివేస్తేనే ఆర్థికంగా లాభం. ఆహారం ఖర్చు తగ్గించవచ్చు. |
|
గొర్రె పిల్లల పోషణ :
గొర్రె పిల్లల్లో పెరుగుదల మొదటి మూడు మాసాల్లో వుంటుంది. ఈ కాలం లో పెరుగుదల రోజుకు దాదాపు 150 గ్రా. చొప్పున ఉంటుంది. ఇలా అధిక పెరుగుదల ఉన్న గొర్రె పిల్లలే ముందు ముందు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ బరువు తూగి లాభాలు చేకూరుస్తాయి. కావున పాలు మరిచే వయస్సు వరకు(దాదాపుగా మూడునెలలు) తల్లి పాలకు అదనంగా పోషణ ఇవ్వాలి. పిల్ల గొర్రెలను తల్లుల నుండి వేరు దడిలోఉంచి పెంచాలి. పిల్లల దడిలో వేపకొమ్మలు వేలాడకట్టిన ఎడల, పిల్లలు నివాసంగా ఆకు తింటూ అవి జీర్ణించుకోవటానికి అలవాటు పడుతాయి. అదే విధంగా సులువుగా జీర్ణమయ్యే పిల్లల దాణా తొట్టిలో ఉంచిన ఎడల పిల్లల దానాకి అలవాటు పడుతాయి. పిల్లలకు ఇచ్చే దాణా సులువుగా జీర్ణమై అధిక శక్తిని మరియు కావలసిన ఇతర పోషక పదార్థాలను పిల్లలకు సమకూరుస్తుంది.
ఆరోగ్య పరిరక్షణ : తల్లి గొర్రెలను మేతకు పంపిన తరువాత వేపాకు, లేత గడ్డి లేదా పిల్లల దాణా వేసి అన్ని పల్లాలు ఆరోగ్యంగా ఉన్నది లేనిది చూడాలి. పిల్లల దడిలో క్రింద వారి గడ్డి పరచిన ఎడల వెచ్చగా ఉండి మట్టి తినడానికి వీలుపడదు. దడి రొచ్చుగా మరియు చీకటిగా ఉంచకూడదు.శుభ్రమైన గాలి ప్రసరిస్తుండాలి. మూడు నెలల వయసు దాటిన తరువాత మొదటి సారి నట్టల మందు తాపాలి. నట్టల మందు తాపేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి మందు పోకుండా జాగ్రత్తగా తాపాలి. నట్టల మందు త్రాపిన 10-15 రోజుల వ్యవధిలో చిటుక వ్యాది టీకా మందు ఇవ్వవలసి ఉంటుంది. తరువాత 15 రోజులకు రెండవ డోసు టీకా ఇవ్వవలసి వుంటుంది. చిటుక వ్యాధి టీకా ఇచ్చిన 15-30 రోజుల తరువాత బొబ్బ రోగానికి టీకా మందు ఇవ్వవలసి ఉంటుంది ఈ శాస్త్రీయ పద్దతులు పాటిస్తూ గొర్రె పిల్లలను పెంచినట్లైతే పెరుగుదల బాగా ఉంటుంది.
మూడు నెలల వయస్సు వచ్చిన తరువాత (దాదాపు 12-14 కిలోల బరువు తూగే పిల్లలు) ఘనాహారం తిని జీర్ణించుకునే శక్తి పిల్లలకు వస్తుంది. ఆప్పుడు పిల్లలను తల్లి నుండి వేరుచేసి ఒక మందగా మేపాలి. ఈ వయస్సులో పిల్లలను దాదాపు 8-10 గం. బయట మేతకు పంపుతూ, ఉదయం లేదా సాయంత్రం 150 గ్రాముల దాణా లేదా అవసరం మేరకు వేరుశనగ/ఉలవ/కంది/శనగ/మినుము/పెసర పొట్టు మేపినట్లు అయితే ఆరు నెలల వయస్సు వచ్చేటప్పటికి దాదాపు 18-20 కిలోల బరువు పెరిగి మార్కెట్ లో మంచి ధర పలక గలవు. |
|
గొర్రెల పోషణలో రైతులు పాటించవలసిన మెళకువలు
మన దేశం లో గొర్రెల పెంపకం కులవృత్తి గా సాగుతున్నందువల్ల మనలో చాలా మందికి ఈ వృత్తి చేపట్టడం కష్టమని ఒక అపోహ ఉన్నది. కాని “ మనసుంటే మార్గమునండదా” అనే శూక్తిని నిజం చేస్తూ మన రాష్ట్రం లో అన్ని కులాల, వర్గాల ప్రజలు గొర్రెల పెంపకం పై ఆశక్తిని చూపిస్తున్నారు. కనుక శాస్త్రీయ పద్దతుల ద్వారా గొర్రెల పెంపకం చేపట్టిన యువకులు చాలా మంది లాభాలు పొందుతున్నారు.
ఈ రోజుల్లో గోర్రెమాంసానికి చాలా డిమాండు ఉన్నది. సుమారు సంవత్సరం లోపు గొర్రె 20 కిలోల బరువుంటే అందులో 10 కిలోల మాంసము వస్తుంది. మాంసము, చర్మము, తల, కాళ్ళు, కడుపు, పేగులు, కాలేయాలను అమ్మితే ఆ గొర్రె నుంచి సుమారు వెయ్యి రూపాయల ఆదాయం వస్తుంది. కాని గొర్రెల పెరుగుదలలోను, పోషణ లోను, ఆరోగ్య విషయంలోను శ్రద్ద వహిస్తేనే ఈవిదంగా లాభం. “ కృషితో నాస్తి దుర్బిక్షం” అన్న సామెత గొర్రెల పోషణలో ఎంతయినా నిజం. రైతు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చెప్పలేని ఆర్ధిక బాధలకు గురి అవుతాడు. గొర్రెలు అతి సున్నిత మైన నెమరు వేసే జంతువులు. వీటిలో జబ్బులు ఎక్కువే. ఇవి తేలికగా క్రూర మృగాల వేటకు గురి అవుతాయి. కనుక రైతు సకాలం లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
మొట్టమొదటి మాంసోత్పత్తికి పనికి వచ్చే గొర్రెలను ఎన్నిక చేయాలి. పుట్టుకతోనే పుష్టిగా ఉండాలి. ఉంటే 3 ½ నుంచి 4 కిలోల బరువు గలిగిన పిల్లలు పుట్టాలి. పిల్లలు త్వరగా పెరగాలి. అంటే రోజుకు 100 నుంచి 150 గ్రాముల బరువు పెరగాలి. ఎముక బలం కన్నా కండపుష్టి ఎక్కువగా అంటే నూటికి 45 నుంచి 50 శాతం మాంసం రావాలి. ఉత్తర కోస్తా జిల్లాలోని గొర్రెలు నాసిరకంవి, చిన్నవి. వీటి పెరుగుదల చాల ఆలస్యంగా ఉంటుంది. మన రాష్ట్రంలో అత్యున్నతమయిన గొర్రె జాతి నెల్లూరు. ఇవి మాంసోత్పతికి ప్రసిద్ది. మగ గొర్రెలు 50 కిలోలు, ఆడ గొర్రెలు 40 కిలోల వరకు తూగుతాయి. వీటిలో ముడురకాలు ఎన్నాయి. 1. జోడిపి – దీనికి శరీరమంతా తెల్లగావుండి, తల, కడుపు క్రింద, తొడల లోపల బాగాలు, కాళ్ళు నలుపుగా వుంటాయి. 2. పళ్ళ – ఇవి పూర్తిగా తెల్లగా వుంటాయి. 3. గోధుమ లేక ముదురు గోధుమ రంగులు. శరీరపు రంగును చూసి ఒక రకం గొర్రెలు మంచివి, వీరివి తక్కువ అనడానికి లేదు. ఈ మూడు రకాలు నెల్లూరు, కడప, జిల్లాలలో దొరుకుతాయి. ఇవి ఏ మాత్రం ఉన్నిని ఇవ్వవు. గరివిడిలోని పశు పరిశోధనా కేంద్రంలో సుమారు 200 జోడిపి గొర్రెలను శాస్త్రీయ పద్దతులతో పెంచుతున్నాము. ఔత్సాహిక యువకులు, రైతులు తరుచుగా గరివిడి ఫారాన్ని సందర్శిస్తున్నారు. ప్రప్రథమంగా గొర్రెలు పెంపకం చేపట్టే వాళ్ళు మొదట్లో 35 నుంచి 50 ఆడ గొర్రెలు, 2 విత్తనపు పోటేల్లతో మొదలు పెడితే మంచిది. క్రమేణా అనుభవం వచ్చిన తరువాత లభ్యమయ్యే పచ్చిక బయళ్ళు, పనివాళ్ళు, తిండిగింజలు, మేత మొదలైన వాటిని బట్టి గొర్రెల సంఖ్యను పెంచుకోవాలి. అత్యాసకు పోయి గొర్రెల పెంపకం చేపట్టి చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు.
పొట్టేలు పిల్లల పెంపకం :
గొర్రె పొట్టేలు పిల్లల పెంపకం లో ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే, ఈ పెంపకం లాభసాటిగా వుంటుంది. వీటి పెంపకం లో లాభ నష్టాలు ఎక్కువగా పిల్లలను కొనుగోలు చేసినప్పటి ధర, దాణా ఖర్చు, పచ్చి గడ్డి పెంచుటకయ్యే ఖర్చు మరియు పెరిగిన పొట్టేలు పిల్లలను మాంసోత్పత్తి కి అమ్మేటప్పుడు ఫలికే ధరపై ఆధారపడి వుంటుంది. వీటి పెంపకంతో తక్కువకాలంలోనే లాభాలను పొందవచ్చు. మామిడి, జామా, నిమ్మ, మునగ మొదలగు తోటలు కలిగిన వారు కుడా పొట్టేలు పుల్లల పెంపకం చేపట్టవచ్చు. ఏపుగా పెరిగిన పిల్లలను తొమ్మిది మాసాల వయస్సులోనే కోతకు ఆమ్మివేయవచ్చు. అయితే పచ్చిగడ్డిని (పప్పుజాతి + దాన్యపుజాతి) విరివిగా పెంచి అన్ని కాలాల్లోను మేపాల్సి వుంటుంది. వయస్సును బట్టి రోజుకు 100 గ్రా. నుంచి 250 గ్రా. వరకు సమీకృత దాణాను ఇవ్వాలి. వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు త్రాగించండం, మేలైన యాజమాన్యం చేపట్టడం వలన గొర్రె పొట్టేలు పిల్లల్లో మరణాల శాతం తగ్గించి లాభాలను పొందవచ్చు. |
|
| |
|
| |
|
 |