టమాట

 ఆంధ్రప్రదేశ్ లో టమాట సుమారుగా 75000 హెక్టార్ల లో సాగవుతోంది. 14, 08, 052 టన్నుల దిగుబడి నిస్తుంది. టమాట  పంటను సంవత్సరం పొడువునా అన్ని ఋతువుల్లోనూ సాగుచేయవచ్చు.అధిక దిగుబడికి శీతాకాలం అనుకూలం. ఈ పంట అధిక ఉష్ణోగ్రత,ఎక్కువ వర్ష పాతానికి తట్టుకోలేదు.

నేలలు
బాగా నీరు ఇంకే బరువైన గరప నేలలు ఈ పంటకు అనుకూలం.వర్షాకాలం లో తేలికపాటి నెలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేయవచ్చు.శీతాకాలంలో దినిని ఇసుకతో కూడిన గారప నేలల నుండి బరువైన బంక నేలల్లాంటి వివిధ రకాల నెలల్లో సాగు చేయవచ్చు.మురుగు నీటి వసతి లేని భూములు,చౌడు భూములు ఈ పంటకు అనుకూలం కాదు.

రకాలు 


రకం

పంట కాలం(రోజుల్లో)

గుణగణాలు

దిగుబడి(/)

పూసా రూబి

130-135

పండ్ల పరిమాణం మద్యస్థంగా వుండి లోతైన గాళ్ళు కల్గిఉంటాయి 

12

పూసా ఏర్టిద్వార్ఫ్

120-130

పండ్ల పరిమాణం పూసారూబి కన్నా పెద్దగ వుండి తేలిక పాటి ఎరుపు రంగు కల్గి వుంటుంది.వర్షా కాలం మరియు వేసవిలో ముందుగ నాటుకోనేందుకు అనుకూలం.   

12

మారుతం

135-140 

పండ్లు గుండ్రంగా,మద్యస్థంగా వుంటాయీ.వేసవి కాలానికి అనుకూలం.  

12-14

అర్క మేఘాలి

130

వర్షాధార పంటగా వేయటానికి అనుకూలం

7-8

అర్క సోరబ్

105-110

పండ్లపరిమాణంపెద్దగ,గుండ్రంగా(70గ్రా.)ఉంటుంది.ప్రాసెసింగ్ కు మరియు కాయగూరగాఅనుకూలం. 

14

అర్క వికాస్

105-110 

పండ్ల పరిమాణం పెద్దగా(80-85 గ్రా.),గుండ్రంగా చదునుగా ఉంటుంది.తాజా కాయగూరగా వాడుటకు అనుకూలం.వేసవి పంటకు అనుకూలం.   

14.5-16

                   

 

విత్తడం / నాటడం
విత్తన మోతాదు:
ఎకరాకు సూటి రకాలకు 200 గ్రాములు, సంకరజాతి రకాలకు 60-80 గ్రాముల విత్తనం కావాలి.విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా 3 గ్రాముల మేటలక్సితో కలిపి, 2 గంటల తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మ కల్చర్ తోను విత్తన శుద్ధి చెయ్యాలి.వేసవిలో రసం పిల్చు పురుగుల బెడద తట్టుకునే విధంగా కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పట్టించి ఆ తరువాత శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చెయ్యాలి.
నేల తయారి:
నేలను 3-4సార్లు దున్ని చదును చేయాలి. వర్షాకాలం పంటకు 60 సెంటి మీటర్ల దూరం లో బోదెలు చేసుకోవాలి.ఇతర ఋతువుల్లో 4*5 చదరపు మదులను తయారు చేసుకోవాలి.
నారు పోయటం:
ఎకరం పొలం లో నాటడానికి 1*4చ.మీ.విస్తీర్ణం గల 6” ఎత్తైన 8 నుండి 10 నారుమళ్ళు తాయారు చేయాలి.నారు కుళ్ళు తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 0.5%బోర్దో మిశ్రమం తో నారు మళ్ళను శుద్ధి చేయాలి(1౦౦ లీటర్ల మందు ద్రావణం 40 చదరపు మీటర్ల నారుమడికి)విత్తే ముందు విత్తనాలను 60 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5-10 నిమిషాల సేపు ఉంచి తీయాలి. నారు మడిలో 10 సెంటి మీటర్ల ఎడంతో వరుసలలో 1-1.5 సెంటి మీటర్ల లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్ క్యాన్ తో నీటిని చల్లి పాలితిన్ షీట్ లద వరి గడ్డితో నారు మళ్ళను కప్పాలి.విత్తనాలు మొలకెత్తిన వెంటనే (7-10 రోజులకు) మల్చింగ్ గా వేసిన వరి గడ్డి లేదా పాలితిన్ షీట్ తీసివేయాలి.
2-3 వారాల  వయసులో నారు కుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సి క్లోరైడ్(2.5 గ్రాములు /లీటరుకు)తో పిచికారి చేయాలి. 3 వారాల వయసు గల నారు మడికి రసం పిల్చే పురుగుల నుండి నివారణకు కార్బో ప్యురాన్ 3 జీ గుళికలు 40 చ.మీ.నారుమడికి 100 గ్రాముల  చొప్పున వేసి నీటి తడి ఇవ్వాలి. నారు మడిని పీకడానికి 2-3 రోజులకు ముందుగ లీటరు నీటికి 2 మీ.లి.రోగార్ + 1 గ్రాము బవిస్టిన్ మందును కలిపి నారు మడిపై పిచికారి చేయాలి. నారుమడిలో మొక్కలు బలపడడానికి గింజ విత్తిన 20-30 రోజుల మద్య రోజు విడిచి రోజు నీరు కట్టాలి. 25-30 రోజుల వయసు వుండి 3-4ఆకులు గల మొక్కల్ని నాటుకోవాలి. సాద్యమైనంతవరకు 30 రోజులు మించిన ముదురు నారును నాటరాదు.
నాటే సమయం:
వర్షాకాలంలో జూన్-జూలైలో,శీతాకాలం లో అక్టోబర్-నవంబెర్ లో, వేసవిలో జనవరి-ఫెబ్రవరిలో నాటుకోవచ్చు
నాటటం: వర్షా కాలం లో 60*45 సెంటి మీటర్లు,   శీతాకాలం లో 60* సెంటి మీటర్లు, వేసవిలో 45*30 సెంటి మీటర్ల దూరం లో నాటుకోవాలి. 

 

నీటి యాజమాన్యం
భూమిలో తేమను బట్టి 7-10 రోజుల వ్యవదిలో నీరు కట్టాలి. వేసవిలో ప్రతి 5-6 రోజులకు ఒకేసారి తడి అవసరం ఉంటుంది. 

ఎరువుల యాజమాన్యం
చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలోల భాస్వరం(150 కిలోల సూపర్ఫాస్పేట్ ), 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను (40 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్)వెయ్యాలి. 48-60 కిలోల నత్రజనిని 3 సమ పాళ్ళుగా చేసి, నాటిన 30, 45, తిరిగి 60వ రోజున పై పాటుగా వేసి బోదెలు ఎగదోయాలి.
పూత దశలో లీటరు నీటికి 20 గ్రాముల యురియాను కలిపి పిచికారి చేస్తే మంచిది.  నాటేముందు ఎకరాకు 8-12 కిలోల చొప్పున బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగలకుండా ఉంటాయి. ఎకరానికి 10 కిలోల చొప్పున జింకు సల్ఫేట్ వేసినట్లయితే జింకు లోపం రాకుండా ఉంటుంది.నాటిన తర్వాత 30,45 రోజులకు లీటరు నీటికి 5 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి పిచికారి చేసినట్లు అయితే దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరాకు 400 మిల్లి గ్రాముల 2,4-డి మందును 200 లీటర్ల నీటికి కలిపి గానీ లేదా లీటరు నీటికి 1 మిల్లి లీటరు నోఫిక్స్ మందును కలిపి గానీ పిచికారి చేస్తే పూత, పిందే నిలిచి ఎండాకాలం లో మంచి దిగుబడి వస్తుంది.

కలుపు యాజమాన్యం


కలుపు నివారణకు ఎకరాకు 1.25 లీటర్ల పెందిమితలిన్ లేదా అల్లా క్లోర్ (తేలిక నేలలయితే 1 లీటరు, బరువు నేలలయితే 1.25 లీటర్లు) లేదా మేత్రి బుజిన్ ౩౦౦ గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారి చేయాలి. నాటిన 30,35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చెయ్యాలి. పొలం లో కలుపు లేకుండా, మొదటి నాలుగు వారాల్లో అంతర కృషి చెయ్యాలి.మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు.
పొడువుగా పెరిగే హైబ్రిడే  మొక్కలకు, మాములు రకాలకు కూడా ఊతం కర్రలను పాతాలి.  ఇలా ఊతం ఇవ్వడం వల్ల మంచి పరిమాణం గల కాయలు ఏర్పడతాయి.  అంతే కాక కాయలు నేలకు తగిలి చెడిపోకుండా కాపాడవచ్చు. వేసవి టమాట పంటకు ప్రతి 2-3 వరుసల టమాటకు రెండు వరుసల మొక్కజొన్న పంటను ఉత్తర దక్షిణ దిశలో విత్తుకోవాలి.