మిరప
ఆంధ్రప్రదేశేలో మిరప 4.41 లక్షల హెక్టార్లల్లో సాగవుతోంది.  5.14 లక్షలమెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. భారతదేశంలోనే అత్యధిక ఉత్పాదకత మన రాష్ట్రం లోనే ఉంది. హెక్టారుకు 3468 కిలోల దిగుబడితో ప్రథమ స్థానంలో ఉన్నది.

నేలలు
వర్షాధారపు పంటకు నల్లనేలలు, నీటి ఆధారపు పైర్లకు నల్లనేలలు, చెలక నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం.

రకాలు
జి - ౩ : పొడవు కాయలు, వర్షాధారపు పంటలకు అనుకూలం. దిగుబడి వర్షాధారంగా అయితే ఎకరాకు  6-7 క్వింటాళ్ళు. నీటి వసతి కింద అయితే 15-18 క్వింటాళ్ళు
జి-4: (బాగ్యలక్ష్మి) : కాయలు సన్నగా పొడవుగా వుంటాయి. పచ్చికాయకు, ఎండుకాయకు అనుకూలం. వైరస్ ను తట్టుకొంటుంది. దిగుబడి 40-45 క్వింటాళ్ళు /ఎకరాకు.
జి-5 : (ఆంధ్రజ్యోతి) : కాయలు పొట్టిగా, లావుగా వుంటాయి, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో నీటివసతి కింద సాగుకి అనుకూలం. దిగుబడి 40 – 50 క్వింటాళ్ళు / ఎకరాకి.
సి. . 960 (సింధూరు) : కాయలు పొడవుగా, లావుగా ఉంటాయి. పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి అనుకూలం. నీటి వసతి కింద వేయదగిన రకం. త్వరగా కాపు కొస్తుంది. కారం తక్కువ. వేసవి పైరుకు అనుకూలమైన రకం. దిగుబడి 50- 55 క్వింటాళ్ళు /ఎకరాకి.
యల్.సి.ఎ. 200 (కిరణ్) : పొడవైన కాయలు, తెలంగాణ ప్రాంతంలో నీటి ఆధారపు పైరుకి అనుకూలం. దిగుబడి 40-45 క్వింటాళ్ళు /ఎకరాకి.
సి.. 1068 ( అపర్ణ ) : లావైన పొడవైన కాయలు. తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నీటి వసతి కింద పచ్చిమిర్చిలకు అనుకూలం. దిగిబడి 35-40 క్వింటాళ్ళు /హెక్తారుకి. 
యల్.సి.. 235 ( భాస్కర్ ) : కాయలు పొదవి తక్కువ. కారం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ లో వర్షాధారంగానూ మరియు నిఇతి వసతి కింద సాగుకు అనుకూలం.  వైరస్ ను బాగా తట్టుకొంటుంది. అన్ని జిల్లాలకు అనుకూలం. దేగుబడి 50 – 60 క్వింటాళ్ళు / హెక్టారుకు
యల్. సి.. 206 ( ప్రకాష్ ) : పొడవైన కాయలు గల రకం. పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి అనుకూలం, వర్షాధారం కిందా, నీటి వసతి కిందా సాగుకు అనుకూలమైన జాతియరకం. దిగుబడి 45-50 క్వింటాళ్ళు / హెక్టారుకు
యల్.సి.. ౩౦5 : (లాం. ౩౦5) : పొడచైన, లావైన కాయలు కలిగిన రకం. పచ్చి మిర్చికి, ఎండు మిర్చికి, నీటి ఆధారపు పైరుకు అనుకూలం. దిగుబడి 50- 60 క్వింటాళ్ళు / హెక్టారుకు
యల్.సి.. ౩౩4 : (లాం. ౩౩4) : ఈ రకం 2006 సంవత్సరంలో లాం ౩౩4 పేరిట విడుదల చేయబడింది. మొక్కలు గుబురుగా, ఎత్తుగా పెరుగుతాయి. వైరాసను తట్టుకుంటుంది. కాయలు 7-8  సెం. మీ. పొడవుతో మంచి ఎరుపు రంగు కలిగి వుంటాయి. వర్షాధారం కింద, నీటి వసతి కింద సాగు చేయవచ్చు.  అన్ని జిల్లాలలో సాగుకు అనుకూలము. ఎగుమతికి అనుకూలమైన రకం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు కుడా తట్టుకొని సుస్థిర దిగిబడినివ్వగల రకము, జాతీయ స్థాయిలో ప్రశాంత్ అనే పేరుతో విడుదల చేయబడింది.
యల్.సి.. ౩5౩: (లాం. ౩5౩) : మొక్కలు గుబురుగా మధ్యస్తంగా వుంటాయి. కాయలు లేత ఆకుపచ్చ రంగులో 7 నుండి 9 సెం. మీ. పొడవుతో సన్నంగా వుంటాయి. పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైన రకము. యల్.సి.ఎ. ౩౩4 రకము కన్నా 20 - 25 రోజుల ముందుగా కాపుకు వస్తుంది. కాయలు పండిన తరువాత మంచి నిగారింపుతో ఆకర్షనీయమైన ఎరుపు రంగు కలిగి వుంటాయి. జాతీయ స్థాయిలో లాం 35౩ అనే పేరుతో విడుదల చేయబడింది. దిగుబడి 60 – 65 క్వింటాళ్ళు / హెక్టారుకు. 
పాప్రికా రకాలు :   పాప్రికా రకాల  కాయలు లావుగా, పొడవుగా వుండి కారం తక్కువ, రంగు ఎక్కువగా వుంటాయి. ఈ రకాలను ఊరగాయ పచ్చళ్ళకు, సలాడ్స్ తయారికి, ఒలియోరేసిన్ కు  ఎక్కువ వాడుతారు. ఈ రకమునకు యురోపియన్  మార్కెట్లో మంచి గిరాకి వుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రకాల ప్రాముఖ్యం దృష్టిలో పెట్టుకొని లాంఫారంలో  1985 వ సంవత్సరం నుండి ఎగుమతికి అనువైన రకాల రూపకల్పనకు చర్యలు చేపట్టడం జరిగింది. మన రాష్ట్రంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, జిల్లాలల్లో  పండించే లంక మిరప రకాలు, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పండించే లావుకాయరకాలను అమెరికా, జపాన్, పాప్రికా రకాలతో సంకరం చేసి మన రాష్ట్ర పరిస్థితులకు అనువైన రకాలను రూపొందించటం జరుగుతుంది. దీని ఫలితంగా ఎల్. సి,ఎ. 424, ఎల్. సి,ఎ. 4౩6, ఎల్. సి.ఎ. 444, 4౩5 వంటి రకాలు గుర్తించారు.
విడుదలకు సిద్ధంగా వున్నరకాలు:   ఎల్. సి,ఎ. 424 : ఇది పాప్రికా రకము. మొక్కలు గుబురుగా పెరుగును. కాయలు 10-12 సెం.మీ. పొడవుతో లావుగాను, నిగారింపైన ఎరుపు రంగు కలిగి ఉండును. వరంగల్లు లోకల్ కన్నా ముందుగా కోతకు వచ్చును. ఎగుమతికి అనుకూలమైన రకము.
చిరుసంచుల పథకములో ఉన్న రకము :   యల్. సి.ఎ. 424: ఇది పాప్రికా రకపు మిరప. కార్మ లేకుండా ఎక్కువ రంగు కల్గి ఉంటుంది. నోక్కలు మధ్యస్త పొడవుత్జో కొద్దిగా ప్రక్కలకు పెరుగుతుంది. కాయలు 8-9  సెం. మీ. పొడవు కలిగి లేత ఆకుపచ్చ రంగులో వుంటాయి. పండిన కాయలు ఆకర్శనీయమైన ఎరుపు రంగు కల్గి వుంటాయి. కాయ దిగుబడి హెక్టారుకు 45-46 క్వింటాళ్ళు  వస్తుంది.

నేలతయారి
మిరపకు మెత్తటి దుక్కికావాలి. ౩-4 సార్లు గుంటక తోలాలి.

విత్తడం / నాటడం
విత్తన మోతాదు:
నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రాములు ( ఒక ఎకరానికి సరిపడునారు). విత్తనం ఎండబెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం కావాలి.
విత్తనశుద్ధి :
కిలో మిరప విత్తనానికి మొదటగా వైరస్ తెగుళ్ళ నివారణకు గాను 15౦ గ్రాముల  ట్రై సోడియం ఆర్తోఫాస్పెట్ ను, తర్వాత రసం పిల్చే పురుగుల నివారణకుగాను 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ను, చివరగా ఇతర తెగుళ్ళ నివారణకుగాను ౩ గ్రాముల కాప్టాన్ లేదా ౩ గ్రాముల మాంకోజేబ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

నారుమడి యాజమాన్యం ;
ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. ఒక మీటరు వెడల్పు, 15  సెంటి మీటర్ల ఎత్తు ఉండేటట్లు ఎతైన నారుమడులు చేసి మధ్యలో 30 సెంటి మీటర్లు కాలవలు తీయాలి. సెంటు  నారుమడిలో 650 గ్రాముల విత్తనం చల్లుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రాముల  ఫిప్రోనిల్ గుళికలను వాడినచో రసం పీల్చు పురుగులను ( నల్లి తప్ప) నివారించవచ్చు.
సెంటుకు కిలో వేపపిండి వేయాలి. ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లీటరు నీటిలో కలిపి ఆ  నీళ్ళతో నారుమడిని 9వ రోజు, 1౩వ రోజు తడపాలి. ఆరు వారాల వయస్సుగల మొక్కలు నాటుకోవాలి.
విత్తటం :
ఖరీప్ : జులై, ఆగష్టు.   రబీ : అక్టోబరు, నవంబరు.
నాటడం:
6 వారాల వయస్సు గల మొక్కలు నాటడానికి అనుకూలం. వర్షాధారపు పైరుకు 60 *15 సెం.మీ. దూరంలో పాదుకు ఓక మొక్క చొప్పున, నీటి వసతి కింద 60 * 60 లేదా 90 * 60 లేదా 90 * 60 సెం. మీ. ల ఎడం చొప్పున పాదుకు 2 మొక్కల చొప్పున నాటుకోవాలి.

ఎరువుల యాజమాన్యం

ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వాడాలి. లేదా పచ్చిరొట్ట పైరును పెంచి భూమిలో కలియదున్నాలి. వర్షాధారపు పైరుకు 60 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను ఒక హెక్టారుకు వాడాలి. ఆరుతడి పైరుకు ౩౦౦ కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 120 కిలోల ppoపొటాష్ నిచ్చు ఎరువులను వేయాలి.

కలుపు యాజమాన్యం
నాటే 1,2 రోజుల ముందు ప్లూ క్లోరాలిన్ 45% ఎకరాకు ఒక లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ ౩౦% ఎకరాకు 1.౩ నుండి 1.6 లీ. లేదా ఆక్సిప్లోరోఫిన్ 23.5% 200 మి. లీ. చొప్పున ఏదో ఒకదానిని 200 లీ, నీటిలో కలిపి నాటే 1, 2 రోజుల ముందు పిచికారి చేయాలి. నాటిన 25, ౩౦ రోజుల తర్వాత 15, 20 రోజుల వ్యవధిలో అవసరాన్నిబట్టి గొర్రు, గుంటకలతో అంతరాకృషి చేయాలి.

పంట కోత
పంట దిగుబడి ఆదికంగా పొందటానికి చేట్లుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు కోసి, పట్టలపై కాని, సిమెంటు కళ్లాలపైన గాని ఆరబెట్టడం శ్రేష్టం. వర్షాధారపు పైరుకు ౩-4 కోతలు, నీటి ఆధారపు పైరుకు 6-8 కోతలు చేయాలి.

మిరప నాణ్యత పెంచడం

    • మొక్కలమీద మిరపకాయలను పండనియరాదు. ఎక్కువగా పండితే మిరప నాణ్యత తగ్గుతుంది. తరుచుగా ఎప్పటికప్పుడు పండిన కాయలు కోయటం వలన దిగుబడులు  పెరుగుతాయి.
    • కాయకోసే ముందు సస్యరక్షణ మందులు పిచికారి చేయరాదు. పిచికారి చేస్తే మిరప కాయాలమీద  అవశేషాలు వుండే ప్రమాదముంటుంది.
    • అప్లోటాక్సిన్  వృద్ది కాకుండా మిరప కాయలను పాలిథిన్ పట్టల మీద లేదా సిమెంట్ గచ్చు మీద ఎండబెట్టాలి.
    • రాత్రిళ్ళు మంచు బారిన పడకుండా కాయలను కప్పిఉంచాలి.
    • మిరపలో 10 శాతానికి మించి ఎక్కువ తేమ ఉండకుండా ఎండబెట్టాలి.
    • ఎండబెట్టేటప్పుడు దుమ్ము, ధూళి, చెత్త,చెదారం చేరకుండా కాయలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి.
    • కాయలు ఎండబెట్టే దరిదాపులల్లో కుక్కలు, పిల్లులు, కోళ్ళు, ఎలుకలు, పందికొక్కులు రానీయకుండా చూసుకోవాలి.
    • తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్ చేసి వేరుచేయాలి.
    • నిల్వచేయడానికి తేమ లేనటువంటి శుభ్రమైన గోనె సంచుల్లో కాయలను నింపాలి.
    • తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్క బల్లలమీద గోడలకు 50-60 సెం, మీ, దూరంలో నిల్వ  ఉంచాలి.
    • అవకాశామున్నచోట శీతల గిడ్డంగుల్లో నిల్వచేస్తే రంగు, నాణ్యత తగ్గిపోకుండా లాభదాయకంగా ఉంటుంది.
    • అకాల వర్షాలకు గురికాకుండా,మంచు బారిన పడకుండా, రంగుకోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో గాని లేదా టొబాకో బారన్ లల్లో గాని ఎండబెట్టి నాణ్యమైన మిరప కాయలను పొందవచ్చు.