మన రాష్ట్రంలో బెండ సుమారుగా 29,౩15 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. మొత్తం 4,౩9,725 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఈ పంటకు వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందువల్ల ఈ పంట వర్షాకాలంతో పాటు వేసవి కాలంలో పండించటానికి అనుకూలమైనది. |
|
విత్తే సమయం
వర్షాకాలపు పంటను జూన్ నుండి జూలై వరకు, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు.
విత్తన మోతాదు
ఎకరాకు వర్షాకాలపు పంటకు 4 -6 కిలోలు, వేసవి పంటకు 7 -8 కిలోలు, సంకరజాతి రకాలకు 2 -2 .5 కిలోల విత్తనం కావాలి.
రకాలు
పర్భని క్రాంతి, అర్క అనామిక, అర్క అభయ వంటి రకాలు 85-9౦ రోజుల పంటకాలాన్ని కలిగి వుంటాయి.
సంకర జాతి కోవకు చెందిన వర్ష, విజయ, విశాల్, నాథ్ శోభ, మహికో హైబ్రిడ్ నెం. 6, 7, 8, 1౦, ప్రియ, సుప్రియ, ఐశ్వర్య, మిస్టిక్, ఎస్ 71౦9 , తులసి రకాలను మరియు ఎగుమతికి అనువైన పంజాబ్ పద్మని, వర్ష, విశాల్, నాథ్ శోభ రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ప్రధానమైన పంట రకాలి, వాటి గుణ గణాల వివరాలు దిగువన ఉన్నాయి. |
|
ఎరువుల యాజమాన్యం
చివరి దుక్కిలో ఎకరాకు 6 – 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలిపి దున్నాలి. 24 కిలోల భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 48 కిలోల నిచ్చే నత్రజని ఎరువును ౩ సమ భాగాలుగా చేసి 1/౩ వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/౩ వంతును 2 భాగాలుగా విత్తిన ౩౦వ మరియు 45 వ రోజున వేయాలి. సంకరజాతి రకాలను ఎరువుల మోతాదు సుమారు 5౦ శాతం పెంచి వేయాలి. |
|
పంట మార్పిడి
బెండ – ఆలుగడ్డ – టమోటా – బెండ – పాలకూర – పుచ్చ కాయ, బెండ – ముల్లంగి-కాలిప్లవార్- కీర దోస, బెండ – టమాటో- తోటకూర, బెండ-ఆలుగడ్డ – సజ్జ క్రమంలో పంట మార్పిడిని పాటించాలి. |
|
కలుపు నివారణ, అంతర కృషి
పెండి మిథాలిన్ ౩౦ శాతం ఎకరాకు 1.2లీ. చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి. విత్తిన 25, ౩౦ రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేయాలి. వర్షా కాలంలో మట్టిని ఎగదోసే బోదెలు సరి చేయాలి.
పంట పూత దశలో లీటరు నీటికి 10 గ్రా. యూరియా కలిపి పిచికారి చేయడం ద్వారా 20-25 శాతం నత్రజని ఆధాతోపాటు అధిక దిగుబడి పొందవచ్చు. అలాగే లీటరు నీటికి 5 మి.గ్రా. సూక్ష్మ పోషక పదార్దల మిశ్రమాన్ని కలిపి పిచికారి చేయడం ద్వారా కూడా అధిక దిగుబడిని పొందవచ్చు. |
|