- ఆరోగ్యవంతమైన నారు పెంచటం:
- నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో ౩ దఫాలు దమ్ముచేసి చదును చేయాలి. నీరు పెట్టటానికి తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటుచేయాలి.
- 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (1 కిలో విత్తనం చల్లేముందు, మరో కిలో విత్తిన 12-14 రోజులకు), 1 కిలో భాస్వరం మరియు 1 కిలో ఫోటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భాస్వరం రెట్టింపు చేయాలి.
- మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి.
- నారు, ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరు తడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిలకట్టాలి.
- జింకు లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాము జింకు సల్ఫట్ ద్రావణాన్ని పిచికారి చేయాలి. చలి ఎక్కువగా ఉండే దాళ్వా వరి సాగులో జింకు లోప లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి.
- విత్తిన 10 రోజులకు కార్బోప్యురాన్ ౩ జి. గుళికలు సెంటు నారుమడికి 16౦ గ్రాముల చొప్పున చేయాలి లేదామొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేక క్లోరిపైరిఫాస్ 2.౦ మి.లీ. లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారి చేయాలి లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 16౦ గ్రాముల కార్బోప్యురాన్ గుళికలు తక్కువ నీటిలో వేయాలి.
- నాట్లకు అనుకూల సమయం
ప్రాంతం ఖరిఫ్ రబీ (దళ్వా)
కృష్ణా-గోదావరి మరియు తెలంగాణా జూలై డిసెంబర్
ఉత్తర కోస్తా ఆగష్టు నవంబర్
దక్షిణ మండలం సెప్టెంబర్ నవంబర్
అత్యల్ప వర్ష మందలం జూలై- ఆగష్టు డిసెంబర్
౩. నాట్లు వేయటానికి పొలాన్ని తయారుచేయటం:
నాట్లు వేయటానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-౩ దఫాలుగా మురుగ దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో గాని, అడ్డతో గాని, చదును చేయాలి రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తీ చేసి, ఆ తర్వాతనే నాట్లు వేస్తే మంచిది.
- నాట్లు వేయడం:
నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకు పచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. నాలుగు నుండి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటుపై పైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరిఫ్ లో చదరపు మీటర్లకు ౩౩ మూనలు, రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లుకు 20 సెంటి మీటర్ల బాటలు తీయడం వలన పైరుకు గాలి, వెలుతురు భాగా సోకి చీడ పీడల ఉదృతి కొంత వరకు అదుపు చేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయటానికి ఇంకా పైరు పరిస్తితిని గమనించడానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ళ బట్టి సంఖ్యను నిర్ధారించాలి.
నీటి యాజమాన్యం:
నాట్లు వేసేటపుడు నీరు పలుచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఊడ్చిన వెంటనే 5 సెంటి మీటర్ల వరకు నీరు నిలగట్టాలి. మూన తిరిగిన రోజునుండి పైరు దుబ్బు చేయటం పూర్తి అయ్యేవరకు పొలంలో పలుచగా అంటే 2-౩ సెంటి మీటర్ల నీరుండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయటం పూర్తి అయ్యేవరకు పొలంలో పలుచగా అంటే 2-౩ సెంటి మీటర్ల నీరుండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. చిరు పొట్ట దశ నుండి గింజ గట్టి పడే వరకు 5 సెంటి మీటర్ల వరకు నీరుండాలి. కోతకు 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గింఛి ఆరబెట్టాలి.
కలుపు యాజమాన్యం:
నారుమడిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి బూటక్లోర్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటితో కలిపి, విత్తన 7 లేక 8 వ రోజున మడిలో నీటిని తీసివేసి పిచికారి చేయాలి, లేదా విత్తన 14,15 రోజులప్పుడు సైహలోఫాప్ బ్యుటైల్ 10 శాతం 40౦ మి.లీ. 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి.
మాగాణి వరిలో ఊద మొదలైన ఏక వార్షిక గడ్డి జాతి మొక్కలు ఉన్నప్పుడు బ్యుటాక్లోర్ 50 శాతం 1 నుండి 1.5 లీటర్ లేదా అనిలోఫాస్ ౩౦ శాతం 50౦ మి.లీ. లేదా ప్రిటిలాక్లోర్ 50 శాతం 50౦ మి.లీ. లలో ఏదో ఒకదానిని ఎకరాకు 25 కిలోల పొడి ఇసుకతో కలిపి, నాటిన ౩ నుండి 5 రోజులలో పలుచగా నీరు పెట్టి సమానంగా వెదజల్లాలి.
గడ్డి, తుంగ, వేడల్పాటి ఆకు మొక్కలు సమపాళ్ళలో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యుటాక్లోర్ 5 శాతం గుళికలు మరియు 4 కిలోలు 2, 4-డి ఇథైల్ ఎస్టర్ 4 శాతం గుళికలు, 20 కిలోల పొడి ఇసుకతో కలిపి నాటిన ౩ నుండి 5 రోజుల్లో పలుచగా నీరు ఉంచి సమానంగా వెదజల్లాలి.
వరి నాట్లు వేసిన 8-10 రోజుల తర్వాత కూడా పైరజోసల్ఫురాన్ 5 శాతం wwడబ్ల్యు.పీ. ఎకరాకు ౮౦ గ్రాముల లేదా 15 రోజుల తర్వాత కూడా ఇథాక్షి సల్ఫురాన్ 15 శాతం డబ్ల్యు.డి.జి. ఎకరాకు 50 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి, పొలంలో నీటిని తీసివేసి సమానంగా పిచికారి చేసి కలుపు నివారణ చేయవచ్చును.
నాటిన 25-౩౦ రోజులప్పుడు పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 40౦ గ్రాముల, 2-4 సోడియం సాల్ట్ 80 శాతం పొడి మందును 200 లీటర్ల నీటితో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపుపై పడేటట్లు పిచికారి చేయాలి.
- Pests & Diseases (purugulu & Tegullu)
- (see separate files)
ఎరువులు / పోషక యాజమాన్యం
- భూసార పరిరక్షణకు, ఉత్పత్తి సబ్ధత ను అధిగమించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి, పైరుకు సమతుల్యంగా పోషక పదార్ధలను అందచేయాలి.
- పశువుల ఎరువు, కంపోస్ట్, కోళ్ళ ఎరువువంటి సేంద్రియ ఎరువులను, రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25 శాతం వరకు నత్రజనిని ఆదాచేయవచ్చు.
- వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుమ, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్ట పైరును పెంచి కలియ దున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక సుమారు 20-25 శాతం నత్రజని, బాస్వరం, పోటాష్లను కూడా అదా చేయవచ్చు.
- సజీవ ఎరువులైన నీలి పచ్చ నాచు, అజోల్ల్ల, అజోస్పైరిల్లం, ఫోస్పోబాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వర మోతదులను 10-20 శాతం తగ్గించవచ్చు.
- నీలి ఆకుపచ్చ శైవలాలు-నాచు-వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకు 10 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. నాచు నేలలో కలిసి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడిచేసి వరి నాట్లు వేసిన 7-10 రోజుల మద్య మడిలో పలచగా నీరు నిలువ గట్టి ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చల్లాలి.
- అజోల్లా: వరి పొలంలో దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ను వేసి పలుచగా నీరు నిలువ గట్టి 100-15౦ కిలోల అజోలా వేసి 2 నుంచి ౩ వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. ఎకరాకు ౩ టన్నుల పచ్చి రొట్ట మరియు 12 కిలోల నత్రజనిని నేలకు చేరవేస్తుంది.
- అజటో బాక్టర్; ఎకరాకు సరిపడే విత్తనానికి 200- 40౦ గ్రాముల కల్చర్ను పట్టించాలి లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి. దీని వలన ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది.
- అజోస్పైరిల్లం: దీన్ని కూడా అజోటో బాక్టర్ వలె వాడాలి.
- ఫాస్పో బాక్టీరియా: ఇది భాస్వరపు జీవన ఎరువు. భూమిలో అభ్యం కాని స్తితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనంతో 200-40౦ గ్రాముల కల్చర్ ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వేయాలి.
పంట కోత
వెన్నులోని 80 శాతం గింజలు పక్వానికి వచ్చిన తర్వాత, కాండం పచ్చగా ఉన్నప్పుడే కొత కోయటం మంచిది. కోతకు పూత దశ నుండి సుమారు 28-32 రోజుల వ్యవధి తీసుకొంటుంది. ఈ దశలో గింజల్లో సుమారు 18-24 శాతం తేమ ఉంటుంది.
- Other info (Itara Vivaralu)
రైతు స్థాయిలో విత్తనోత్పత్తి
మంచి విత్తనోత్పత్తి కొరకు నాట్లను దూర దూరముగా వేసుకోవడకోవడం, సమ తుల్యమయిన నేల, ముందు సంవత్సరం వరి వేయని లేదా అదే రకం వరి వేసిన భూములు ఎంచుకోవడం కీలకమైన అంశాలు. పరపరాగ సంపర్కం ద్వారా కల్తిలు లేకుండ ఉండటానికి వివిధ వరి రకాలను, దూర దూరంగా పండించాలి.
పైరు దుబ్బ చేసే సమయం, పూత , గింజ గట్టి పడే దశల్లో కల్తీ మొక్కలను ఏరి తీసివేయాలి. పొలంలో గట్టు ప్రక్కల చుట్టూ ఐదు మీటర్ల విస్తీర్ణం మేరకు వదలి, లోపలి పొలం నుండి విత్తనాన్ని సేకరించాలి. ఒక కల్తి మొక్కను వదిలి వేస్తె సుమారు వెయ్యి గింజలు రాబోయే పైరులో కేళిలుగా తయారవుతాయి.
సమతుల్యంగా ఎరువులు వాడటం వలన పోషక విలువలతో పాటు గింజ నాణ్యతను పెంపొందించవచ్చును. నత్రజని ఎరువులను పూత దశ నుండి ముందే వాడాలి. తర్వాత వాడితే ధాన్యంలో విరుగుళ్ళ శాతం పెరుగుతుంది. వరి పంట అంకురం దశ నుండి పక్వ దశ వరకు నిటి ఎద్దడి ఉండరాదు . లేకుంటే తాలు గింజలు, విరుగుళ్ళు ఏర్పడాతాయి. గింజ గట్టిపడే సమయంలో అంటే కోతకు 7-10 రోజులు ముందుగానే నీటిని తీసివేయాలి.
పైరు కోసినప్పటి నుంచి ఇతర విత్తనాలతో కలవకుండా తగు జాగ్రత్త వహించాలి. వెన్నులో 75 శాతం గింజలు పండినపుడు కోయాలి. పక్వానికి రాకముందు కోస్తే విత్తనం మొలకెత్తే స్వభావం దెబ్బతింటుంది. పనులను 2-౩ రోజులు ఆరబెట్టాలి. ఒదేలను త్రిప్పికూడా అరబెట్టవచ్చు. నూర్పిడి చేసిన తరువాత మరియు ఎగరబోత సమయంలో వేరే వరి విత్తనాలతో కలియకుండా జాగ్రత్త పాటించ వలెను.
శుభ్రపరచిన విత్తనాన్ని ఎండలో ఆరబెట్టాలి. ఆరుబయట 9-11 గంటల మధ్య 5-6 రోజులు ఆరబెట్టాలి. 11 గంటల తర్వాత ఎండ త్రీవంగా ఉండి గింజ పై పగుళ్ళు వచ్చే అవకాశముంది. గింజలో తేమ శాతం 13 కన్నా తక్కువ వచ్చేంత వరకు ఆరబెట్టాలి. ఎక్కువగా ఉన్నట్లయితే బూజు పెరిగి, విత్తనం చెడి, మొలక శాతం తగ్గుతుంది. గింజల్లో అధిక శాతం తేమ ఉన్న లేక అధికంగా ఆరబెట్టిన గింజల్లో విరుగుళ్ళు అదికమవుతాయి. విత్తనాన్ని ఎప్పటికప్పుడు కొత్త సంచుల్లో నిల్వ చేసుకోవడం ఎంతో శేయస్కరం
“శ్రీ” వరి సాగు పద్ధతి
( Note to Vishnu: Need to display this with distinct identity, with proper and prminently looking place in the Paddy page)
తక్కువ ఖర్చు, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందదానికి అవకాశమున్న పద్ధతి “శ్రీ” వరి సాగు పద్ధతి. ఈ పద్ధతి 1980 దశకంలో ‘మడగాస్కర్’ దేశంలో రూపొందించబడింది. చైనా, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలతో పాటు మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో చాల మంది రైతులు ఈ పద్దతిని అవలంబిస్తున్నారు. ఈ పద్ధతిలో:
- విత్తనాలు తక్కువ
- నీటి వినియోగం తక్కువ
- పురుగు మందులు, ఇతర వనరులపై ఖర్చు తక్కువ
- దిగుబడి ఎక్కువ
విత్తనాలు తక్కువ:
సాధారణ పద్దతిలో ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరమయితే ‘శ్రీ’ పద్దతిలో 2 కిలోల విత్తనం సరిపోతుంది. రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల ఖర్చు కూడా చాలా తక్కువ.
ఆరోగ్యకరమైన పంట తీరు:
‘శ్రీ’ పద్ధతి, వరి పైరు సహజంగా పెరగటానికి దోహదపడుతుంది. కాబట్టి వరి చాల ఆరోగ్యంగా ఉంటుంది. వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది, లోతుకు చొచ్చుకు పోయి, భూమి లోపల పొరల నుండి పోషక పదార్ధాలను తీసుకోగలుగుతాయి. సాదారణ సాగు పద్దతిలో మూడు దుబ్బులను కలిపి పికడానికి 28 కిలోల బలం కావలసి వస్తే ‘శ్రీ’ పద్దతిలో సాగు చేసిన ఒక వరి దుబ్బును పికడానికే 53 కిలోల బలం అవసరమవుతుంది
తక్కువ నీరు:
పొలంలో ఎప్పుడు నీరు నిల్వ ఉంటే వరి వ్రేళ్ళతో గాలి సంచులు తయారుచేయాడానికి చాల శక్తిని వినియో గిస్తుంది. అంటే, ధాన్యం తయారుచేయటానికి ఉపయోగపడాల్సిన శక్తి గాలి సంచులు తయారు చేసి తద్వారా బతకడానికి వాడుకుంటుంది. అంతేగాక వరి పూత దశకు వచ్చేటప్పటికి, ౭౦ శాతం వేర్ల కొసలు కృశించి పోషకాలను తీసుకోలేని స్థితిలో ఉంటాయి. అందుకే శ్రీ పద్దతిలో వరి పొలంలో నీరు నిలువ ఉండకుండా చూస్తారు. కాబట్టి ఈ పద్దతిలో వరి సాగుకు సాదారణంగా వరి పండించడానికి అవసరమయ్యే నీటిలో సగం నుండి మూడో వంతు నీరు మాత్రం సరిపోతుంది.
‘శ్రీ” వరి సాగు పద్ధతి ప్రక్రియలు
నారుమడి పెంపకం
‘శ్రీ’ పద్దతిలో వరి నారును 8 నుండి 12 రోజుల దశలో నాటాలి కాబట్టి నారు పెంచడంలో మెళుకువలు పాటించాలి. 2 కిలోల విత్తనాన్ని ఒక సెంటు భూమిలో చల్లి నారు పెంచితే ఎకరాకు సరిపోతుంది. భూమిని మెత్తగా దున్ని, దమ్ము చేసి, ఎత్తుగా తాయారు
చేసి, చుట్టూ కలువ తీయాలి. తడి మట్టి జారిపోకుండా నారుమడి చుట్టూ చెక్కతో గాని, ఊతం ఏర్పాటు చేయాలి.
నారుమడి తయారై ఉన్న తర్వాత చివికిన మెత్తటి పశువుల ఎరువును ఒక పొరలాగా చల్లి, దానిమీద 24 గంటలు మండి కట్టిన మొలకెత్తిన విత్తనాన్ని పలుచగా చల్లాలి. విత్తనాల పైన మరల మరోసారి పశువుల ఎరువు చల్లి గడ్డితో కప్పాలి. మొలక వచ్చిన వెంటనే గడ్డిని తీసివేయాలి. రోజు నీరు చల్లుతూ ఉంటే 8 రోజులలో వరి నారు 2-౩ ఆకులతో దృడంగా పెరుగుతుంది.
ప్రధాన పొలం తయారీ:
సాధారణ పద్దతుల్లో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసినట్లుగానే ‘శ్రీ’ పద్దతిలో వరి నాట టానికి కూడా తయారు చేయాలి. అయితే, ఈ పద్ధతి లో పొలం తడిగా ఉండాలి గాని, నీరు నిలువ ఉండకూడదు కాబట్టి నీరు ఎక్కువైన వెంటనే పోవడానికి ఏర్పాటు చేయాలి మరియు పొలాన్ని బాగా చదును చేయాలి. దమ్ము చేసి చదును చేసిన పొలంలో చేతితో లాగే రోలర్ మార్కర్ తో 25 x 25 సెంటి మీటర్ల దూరంలో నిలువుగా మరియు అడ్డంగా గీతలు గీయాలి. నాలుగు గీతలు కలిసిన చోట వరి నారు మొక్కలను పై పై న గుచ్చాలి. ఏ మాత్రం నీరు నిలువ ఉన్నా బయటకు పోవటానికి వీలుగా ప్రతి 2 మీటర్లకు ఒక కాలువ ఏర్పాటు చేయాలి.
నాట్లు వేయడం:
నారుమడి నుండి నారు పీకకుండా, మట్టితో సహా పొలంలోకి తీసుకువెళ్ళి, బురదతో సహా 25 x 25 సెంటి మీటర్ల ఎడంగా ముందుగా ‘మార్కర్’ సహాయంతో గీసిన గీతలు కలిసే ప్రాంతంలో ఒక్కొక్క మొక్కను పై పైన నాటాలి.
లేత నారు నాటటం: 8 నుంచి 12 రోజుల వయస్సు గల రెండు ఆకుల నారును మాత్రమే నాటాలి. దీనివలన అదికసంఖ్యలో పిలకలు వేస్తాయి. వేర్లు బాగా వ్యాపిస్తాయి. 8 నుంచి 12 రోజుల నారు నాటటంతో వేర్లు బాగా వృద్ది చెంది బలంగా ఉండి ౩౦ నుండి 50 పిలకలు వేస్తుంది.
జాగ్రత్తగా నాటటం: నారుమడి నుండి మొక్కను జాగ్రత్తగా, వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. దినివలన పికేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన వత్తిడికి మొక్క గురికాకుండా బ్రతికి, త్వరగా పెరిగి అదిక సంఖ్యలో పిలకలు చేస్తుంది.
దూర దూరంగా నాటటం: మొక్కకు, మొక్కకు, చాలుకు చాలుకు మధ్య 25 సెంటి మీటర్ల దూరం ఉండేటట్లు నాటాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో ఇంకా ఎడంగా కూడా నాతుకోవచ్చు.
కలుపు యాజమాన్యం :
పొలంలో నీరు నిలువకుండా చూస్తాం కాబట్టి, కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు, రోటరీ/కోనో విడర్ తో, నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో మరో మూడుసార్లు నేలను కదిలిస్తే, కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి.
ఈ విధంగా కలియ బెట్టడం వలన ప్రతిసారి హెక్టారుకు సుమారు ఒక టన్ను పచ్చి రొట్ట భూమికి చేరుతుంది. వీడర్ వాడకం వలన వేరుకు బాగా ఆక్సిజన్ అందుతుంది. దాంతో సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది నత్రజనిని చేరుస్తాయి.
నీటి యాజమాన్యం:
నీటి యాజమాన్యం చాల జాగ్రత్తగా చేపట్టాలి. పొలం తడిగా ఉండాలి గాని నీరు నిలువకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవటానికి వీలుగా ప్రతి 2 మీటర్లకి ఒక కాలువ ఏర్పాటు చేయాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతుండాలి. దాంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.
సేంద్రియ ఎరువులు:
‘శ్రీ’ పద్దతి భూమిలోని సూక్ష్మ జీవులను బాగా వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మ జీవులు సహజంగా పైరుకు కావలసిన పోషక పదార్ధాలను అందజేస్తాయి. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెంచుతూ సుస్థిర దిగుబడులను ఇవ్వగలదు.
పొలం తయారీ దశలోనే సేంద్రియ ఎరువులు బాగా వాడి భూసారం పెంచాలి. ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడి, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి.
‘శ్రీ’ సాగులోని 6 యాజమాన్య పద్దతులను తూచ తప్పకుండా పాటిస్తే ఒక్కో మొక్కకు 50 నుండి 100 కి పైగా బలమైన పిలకలు వచ్చి అన్నీ కూడా ఒకసారి పొట్ట దశకు చేరి పెద్ద పెద్ద కంకులు వేస్తాయి. కంకులలో గింజలు (40౦ వరకు) బాగా పాలు పోసుకుని ధృడంగా ఉంటాయి.
మార్కర్లు వీడర్లు
