పత్తి

పత్తి ఉత్పత్తి, నూలు ఎగుమతుల్లో భారత దేశం ప్రపంచంలోనే ప్రధాన పాత్ర పోషిస్తున్నది. భారత దేశంలోని పత్తి సాగు విస్తీర్ణంలో మన రాష్ట్ర వాటా 9.6 శాతం.  దేశీయంగా మొత్తం పత్తి ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ వాటా 8.4  శాతం వరకు ఉంది.  ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ౩౩. 25 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. స్థూలంగా 5 లక్షల బేళ్ళ ఉత్పత్తి జరుగుతోంది. సరాసరిన ఎకరాకు 670 కిలోల దిగుబడి అందుతోంది.

నేలలు

 

పత్తి రకాలు  
దేశవాళి రకాలు :

  1. పండరీపురం ముంగారి :

ఆదిలాబాద్ కొండ ప్రాంతాలకు అనువైనది.  పంట కాలం 160 నుంచి 170 రోజులు.  దిగుబడి హెక్టారుకు 9-10 క్వింటాళ్ళు ఇస్తుంది.  దూది శాతం ౩4- ౩5% వరకు ఉంటుంది. పొట్టి పింజగా పరిగణించదగిన దీని పింజ పొడవు 21 – 22 మిళి మీటర్లు. ౩౦ వ నెంబర్ నూలు వడక వస్తుంది. ఇది నీటి ఎద్దడిని తట్టుకునే రకం.   

  1. గౌరాని-6:

ఆదిలాబాద్ కొండ ప్రాంతాలకు అనువైనది. పంట కాల పరిమితి 185 రోజులు.  హెక్టారుకు దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి నిస్తుంది. పింజ పొడవు 25 మిల్లి మీటర్లు ఉండి పత్తి లో ౩౩ శాతం వరకు దూది ఉంటుంది. 40వ నెంబర్ నూలు వడకటానికి  వీలుగా ఉంటుంది.  

  1. సరస్వతి: 

రాయలసీమలోని పశ్చిమ ప్రాంతానికి  అనువైనది. ఈ రకం పంట కాల పరిమితి 180రోజులు. హెక్టారుకు దాదాపు 10 క్వింటాళ్లు దిగుబడి నిస్తుంది.  26 మిల్లి మీటర్ల పింజ పొడవు కలిగి ఉండి, ౩౩ శాతం వరకు దూది ఉంటుంది. 40వ నెంబర్ నూలు వడకటానికి వీలుగా ఉంటుంది.

  1. శ్రీశైలం :

రాయలసీమ ముంగారి ప్రాంత ఎర్రనేలలకు అనువైనది. ఇది స్వల్పకాలిక రకం.  కాల పరిమితి 170 రోజులు.  హెక్టారుకు 10- 12 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. నల్ల మచ్చ తెగులును తట్టుకునే రకం ఇది. 24 మిల్లి మీటర్ల పింజ పొడవు కలిగి, పత్తిలో 35 శాతం వరకు దూది ఉంటుంది. ౩౦వ నెంబర్ నూలు వడక టానికి అనువుగా ఉంటుంది.

  1. మహానంది: 

రాయలసీమ ముంగారీ ప్రాంత ఎర్ర నేలలకు అనువైనది.  పంట కాలం 180 నుంచి 200 రోజులు. పింజ పొడవు 22 – 24 మిల్లి మీటర్లు. దూది శాతం ౩౦-౩2%.  హెక్టారుకు 9-15 క్వింటాళ్ళ దిగుబడి నిస్తుంది. పచ్చ దోమను కొంత వరకు తట్టుకుంటుంది.

  1. అరవింద:

రాయలసీమ ముంగారీ, హింగారీ ప్రాంతాల్లోని ఎర్ర నెలలు, నల్ల నేలలకు అనువైనది. ఇది స్వల్ప కాలిక రకం.  పంట కాల పరిమితి 160 రోజులు.  హెక్టారుకు 15 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. 22 మిల్లి మీటర్ల పింజ పొడవు కలిగి ఉంటుంది.

  1. జయధర్:

రాయలసీమలోని పశ్చిమ ప్రాంతం కు అనువైనది. బెట్టను బాగా తట్టుకొంటుంది. చౌడు భూముల్లో పండించటానికి అనువైనది. 220 నుంచి 2౩0 రోజులలో పంట వస్తుంది. హెక్టారుకు 6-8 క్వింటాళ్ళ వరకు దిగుబడి నిస్తుంది. 22 మిల్లి మీటర్ల పింజ పొడవు కలిగి ఉండి, పత్తి లో 31 శాతం వరకు దూది ఉంటుంది. 26వ నెంబర్ వరకు నూలు వడకటానికి అనువుగా ఉంటుంది.

  1. రాఘవేంద్ర:

రాయలసీమ లోని పశ్చిమ ప్రాంతానికి (ఆదోని) అనువైనది. పచ్చ దోమను, నల్ల మచ్చ తెగులును తట్టుకుంటుంది. 180 రోజుల పంట కాల పరిమితి కలిగి ఉంటుంది. 22 మిల్లి మీటర్ల పింజ పొడవు కలిగి ఉండి 20వ నెంబరు నూలు వడకటానికి అనువుగా ఉంటుంది. హెక్టారుకు దాదాపుగా 8-10 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. జయధర్ కన్నా మేలైన రకం.

 

అమెరికన్ రకాలు:

  1. యం.సి. యు 5 :

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైనది.   పచ్చ దోమను కొంత వరకు తట్టు కుంటుంది.  కాల పరిమితి 180  రోజులు.  హెక్టారుకు 25 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. ౩౦-౩2 మిల్లి మీటర్ల  పింజ పొడవు కలిగి, ౩4 శాతం దూదిని ఇస్తుంది. 60వ నెంబర్ నూలు వడకటానికి అనువైనది. ఇది వర్షాధారముగాను, సేద్యపు నీటితో పండించ వచ్చును.

  1. ఎల్.ఆర్.ఎ. 5166:        

అన్ని ప్రాంతాలకు అనువైనది. పచ్చ దోమను తట్టుకుంటుంది. దీని కాలపరిమితి 160 రోజులు.  హెక్టారుకు 26 క్వింటాళ్ళ దిగుబడి నిస్తుంది. ఈ రకము 24 మిల్లి మీటర్ల పింజ పొడవు కలిగి ౩5 శాతం దూది నిస్తుంది. 40వ నెంబర్ వరకు నూలు వడుకుటకు వీలుగా ఉంటుంది. బాక్టీరియల్ ఎండు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. మాగాణి భూములలో వరి తరువాత సాగు చేయడానికి పనికి వస్తుంది.

  1. ఎల్. పీ. యస్ . 141 (కాంచన ):

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైనది. పంట కాలం దాదాపు 170 రోజులు. హెక్టారుకు 24-25 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది.  దీని  పింజ పొడవు 26 మిల్లి మీటర్లు. దూది 34 శాతం ఉంటుంది.  ఇది తెల్ల దోమను, మైరోతీషియామ్, అల్ట్ర్నేరియా వల్ల కలిగే తెగుళ్ళను, పండాకు తెగులును తట్టుకోగలదు.  కాని పచ్చ దోమను తట్టుకొనలేదు.

  1. ఎల్.కె. 861 :

అన్ని ప్రాంతాలకు అనువైనది. తెల్ల దోమను, నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. 170 రోజులు పంట కాలం కలిగి,  .  హెక్టారుకు సుమారు 25- 26 క్వింటాళ్ళ దిగుబడినివ్వగలదు. ఈ రకము 29 మిల్లి మీటర్ల పింజ పొడవు కలిగి ౩4 శాతం దూదినిస్తుంది. 50వ నెంబర్ వరకు నూలు వడకటానికి వీలుగా ఉంటుంది. పచ్చ దోమను తట్టుకొనలేదు. దీని పింజ గట్టి దనం బాగా ఉంటుంది.

  1. యల్. ౩89:

అన్ని ప్రాంతాలకు అనువైనది. 160 – 170 రోజుల పంట కాలం. హెక్టారుకు 25 నుండి ౩౦ క్వింటాళ్ళ పత్తి దిగుబడి నిస్తుంది. పత్తిలో దూది శాతం ౩5%.  పింజ పొడవు  29 మిల్లి మీటర్లు.  50వ నెంబర్ వరకు నూలు  వడకవచ్చును. బ్లాక్ ఆర్మ్ (నల్ల మచ్చ) తెగులును పూర్తిగా తట్టుకొనగలదు. తెల్ల దోమ ఉండే పరిస్థితుల్లో        యం. సి. యు. 5 కన్నా ఎక్కువ దిగుబడినిస్తుంది.

  1. ఎన్ .ఎ. 920:

రాయల సీమ ప్రాంతానికి అనువైనది. కాల పరిమితి 160 రోజులు. హెక్టారుకు 20- 25 క్వింటాళ్ళ వరకు దిగుబడి నిస్తుంది. పత్తిలో దూది ౩8% ఉంటుంది. పింజ పొడవు 25 మిల్లి మీటర్లు ఉంటుంది. 40వ నెంబర్ నూలు వడకవచ్చు.

  1. ఎన్.ఎ. 1325 (నరసింహ)

అన్ని ప్రాంతాలకు అనువైనది. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. పచ్చ దోమను కొంత వరకు తట్టుకొంటుంది. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల పరిశోధనా కేంద్రం నుండి ఇది విడుదల చేయబడింది. పంట కాలం 160 రోజులు.  హెక్టారుకు 25 – 28 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. పింజ పొడవు 26 మిల్లి మీటర్లు. పత్తి లో 36 శాతం దూది ఉంటుంది. 4౦వ నెంబరు నూలు వడక వచ్చు.

  1. లాం 604 :

అన్ని ప్రాంతాలకు అనువైనది. పంట కాలం 150 – 160 రోజులు.  హెక్టారుకు 25 నుండి ౩౦ క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. పత్తి లో దూది ౩6%.  పింజ పొడవు 27 మిల్లి మీటర్లు వుంటుంది. 40వ నెంబర్ నూలు వడక వచ్చు. పచ్చ దోమను, నల్ల మచ్చ తెగులును తట్టుకుంటుంది.

  1. లాం 6౦౩:  

అన్ని ప్రాంతాలకు అనువైనది.  పంట కాలం 150 – 160 రోజులు.  హెక్టారుకు 25-౩౦ క్వింటాళ్ళ దిగుబడి ఉంటుంది. పత్తిలో దూది శాతం 35%.  పింజ పొడవు 28 మిల్లిమీటర్లు వుంటుంది.  40వ నెంబర్ వరకు నూలు వడక వచ్చు. నల్ల మచ్చ తెగులును పూర్తి గానూ, పచ్చ దోమను కొంత వరకు తట్టుకుంటుంది.

  1.  కృష్ణ:

మాగాణి భూముల్లో వరి తర్వాత వేసవి పంటగా సాగుకు అనుకూలమైనది. పంట కాల పరిమితి 140 – 145 రోజులు.  దిగుబడి హెక్టారుకు 25 క్వింటాళ్ళు.   పింజ పొడవు 26 మిల్లి మీటర్లు ఉండి, ౩౩ శాతం వరకు దూది ఇస్తుంది. 40వ నెంబర్ నూలు వడకవచ్చును.  

సంకర రకాలు :

  1. లాం హైబ్రిడ్ :

అన్ని ప్రాంతాలకు అనువైనది. ఈ సంకర రకము ఎల్. యం. యస్. ఏ. 2 ఏ మరియు యల్. యం. యస్. యస్  85లను సంకరం చేసి రూపొందించినారు. ఇది స్వల్ప కాలిక రకం. దిగుబడి హెక్టారుకు సుమారు ౩౦-౩5 క్వింటాళ్ళు ఇస్తుంది.  ౩5 శాతం దూది దిగుబడి ఉంటుంది. పింజ  పొడవు 27 మిల్లి మీటర్లు ఉంటుంది.   40 వ నెంబర్ నూలు వడక వచ్చును. వరి మాగాణిలో సాగుకు అనువైన రకం ఇది.  

  1. ఎన్.యస్. పి. హెచ్. యస్. 5:

అన్ని ప్రాంతాలకు అనువైనది. ౩5 క్వింటాళ్ళ దిగుబడి సామర్ధ్యం కలిగిఉంది. ౩5 శాతం దూది నిస్తుంది        పింజ పొడవు 29 మిల్లి మీటర్లు. నల్ల మచ్చ తెగులును తట్టుకుంటుంది.

  1. యన్. యస్, పి.యస్.యస్. 7: 

అన్ని ప్రాంతాలకు అనువైనది.  పంట కాలం 160 – 180 రోజులు. ౩౦-౩5 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. పింజ పొడవు ౩౦- ౩2 మిల్లి మీటర్లు ఉంటుంది. పచ్చ దోమ, నల్ల మచ్చ తెగులును తట్టుకుంటుంది.

విత్తనం – విత్తే పద్ధతి


ప్రాంతం / రకం

విత్తే సమయం

విత్తన మోతాదు (క్వి ఎకరాకు

విత్తే దూరం (సెం.మి.

వరుసల     మొక్కల
మధ్య         మధ్య

విత్తే పద్ధతి

1

2

4              

5

6

దేశవాళీ రకాలు

 

 

 

 

 

ముంగారి
(రాయలసీమ)

మే ఆఖరి వారం నుండి జూన్ మెదటి వారం

4 – 5

60

22

గొర్రుతో విత్తాలి

హింగారి
(రాయలసీమ)

ఆగష్టు మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు

4 – 5

60

22

గొర్రుతో విత్తాలి

రాయలసీమ పశ్చిమ ప్రాంతం

సెప్టెంబర్ మధ్య

4 – 5

60

22

గొర్రుతో విత్తాలి

ఆదిలాబాద్
గౌరాని ప్రాంతం

జూన్- జూలై

4 – 5

60

౩౦

గొర్రుతో విత్తాలి

అమెరికన్ రకాలు

 

 

 

 

 

కోస్తా ప్రాంతం
ఎర్ర నేలలు

జూన్ మధ్యలో

3 – 4

90 – 150

45 - 60

అచ్చుతోలి వెయ్యాలి

కోస్తా ప్రాంతం
నల్ల నేలలు

జూలై- ఆగష్టు

3 – 4

90 – 150

45 - 60

అచ్చుతొలి వెయ్యాలి

రాయల సీమ
హింగారి ప్రాంతం

ఆగష్టు- సెప్టెంబర్

4 – 5

60

౩౦

గొర్రుతో  విత్తాలి

తెలంగాణా
పర్వత శ్రేణి ప్రాంతం

జూన్- జూలై

4 – 5

75

౩౦

గొర్రుతో విత్తాలి.

తెలంగాణా
శ్రీ రామ్ సాగర్ ఆయకట్టు ప్రాంతం

జూన్- జూలై

3 – 4

90 – 105

45 - 60

అచ్చు తోలి విత్తాలి.

నెల్లూరు, ప్రకాశం, జిల్లాలు

ఫిబ్రవరి

3 – 4

60 -  75
 

45 - 60

బోదెల అంచుల మీద విత్తాలి.

సంకర జాతి రకాలు

 

 

 

 

 

కోస్తా ప్రాంతం
ఎర్ర నేలలు

జూన్ మధ్య వరకు

0. 75 – 1

120

60

అచ్చు తోలి విత్తాలి.

కోస్తా ప్రాంతం
నల్ల రేగడి నేలలు

జూలై- ఆగష్టు

0. 75 – 1

120

60

అచ్చు తోలి విత్తాలి.

రాయల సీమ
నల్ల నేలలు

జూలై- ఆగష్టు

0. 75 – 1

120 –  15

45 - 60

అచ్చు తోలి విత్తాలి.

తెలంగాణా ప్రాంతం

జూన్- జూలై

0. 75 – 1

90 – 120

60 - 90

అచ్చు తోలి విత్తాలి.

గమనిక :
దేశ వాళి, అమెరికన్ రకాలకు పాదుకు 2 మొక్కలు, సంకర జాతి రకాలకు పాదుకు ఒక మొక్క చొప్పున ఉంచాలి. విత్తిన 10 రోజుల్లో ఖాళీలు ఉన్నచోట మళ్ళీ విత్తాలి. విత్తిన ౩ వారాలకు ఒత్తు మొక్కలను పీకి వేయాలి
.

ఎరువుల యాజమాన్యం  (ఎకరాకు కి లోలలో)

ప్రాంతం

నత్రజని

భాస్వరం

పోటాష్

కోస్తా ప్రాంతం

అమెరికన్ రకాలు

36

18

18

సంకర జాతి

48

24

24

రాయల సీమ

 

 

 

దేశవాళీ రకాలు

8

8

 

అమెరికన్ రకాలు (వర్షాధారం)

16

8

8

అమెరికన్ రకాలు
(నీటి వసతి)

36

18

18

సంకర జాతి రకాలు

48

24

24

తెలంగాణా

దేశవాళి రకాలు

16

8

8

అమెరికన్ రకాలు

36

18

18

సంకర జాతి రకాలు

48

24

24

వరి కోసిన తర్వాత వేసే మాగాణి భూముల్లో

సూటి రకాలు

54

18

18

హైబ్రీడ్స్ (సంకర జాతి రకాలు

60

24

24

ఎరువులు వేసే పద్ధతి
అన్ని ప్రాంతాలకు సిఫారసు చేసిన భాస్వరం ఎరువులు ఒకేసారి ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి.
కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో అమెరికన్ రకాలకు, హైబ్రీడ్స్ కు సిఫారసు చేసిన నత్రజని, పొటాష్ లను మూడు సమ భాగాలుగా చేసి విత్తిన ౩౦, 60, 90 రోజులకు మొక్క మొదళ్లకు 7 – 10 సెంటి మీటర్ల దూరంలో పాదులు తీసి వాటిలో వేయాలి. రాయల సీమలోని వర్షధార అమెరికన్ రకాలకు సిఫారసు చేసిన నత్రజనిని రెండు సమ భాగాలుగా చేసి విత్తిన ౩౦, 60 రోజులకు పైన తెల్పిన విధంగా వేయాలి.

 

నీటి యాజమాన్యం: 
పత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు. కనుక నీరు ఎక్కువగా పెట్టరాదు. భూమిలో వున్న తేమను బట్టి 20-25 రోజులకోసారి నీరు పెట్టాలి. ఎరువులు వేసిన వెంటనే పెట్టిన తరువాత పూత సమయంలో, కాయ తయారయ్యే సమయంలో నీరు పెట్టాలి. ఖరిఫ్ లో 2 - ౩  తడులు, రబీలో ఆరు తడుల నీరు అవసరం ఉంటుంది. నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పైరు కాలం పోడిగించరాదు.

కలుపు నివారణ, అంతర కృషి :
విత్తే ముందు ప్లుక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి.  లేదా  పెండిమిథాలిన్ ౩౦ శాతం ఎకరాకు 1.౩ నుండి 1.6 లీటరు  లేదా అలక్లోర్ 50 శాతం 1.5 నుండి 2.5 లీటర్లు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.  విత్తిన 25 – ౩0 రోజులప్పుడు,  50 – 55 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకలతో అంతర కృషి చేయాలి. ఖరిఫ్ లో వర్షాలు ఎక్కువగా ఉండి అంతర కృషి కుదరనప్పుడు ఎకరాకు లీటరు పెరక్వాట్ 24 శాతం 200 లీటర్ల నీటిలో కలిపి పత్తి మీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లు చల్లాలి.

 

పత్తి తీయటం:

ఎండిన ఆకులు, ఇతర చెత్త కలవ కుండ తీయాలి. తీసిన పత్తిన నీడలో ఆరబెట్టి నిల్వ చేయాలి. నిల్వ చేసిన పత్తికి గాలి తగిలేటట్లు తేమ తగలకుండా చూడాలి. పత్తి నాణ్యత ముఖ్యంగా పింజా పొడవు, పింజ గట్టి తనం, పింజ మృదుత్వం పింజ పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. పత్తి నాణ్యత అనేది జన్యు సంబంధమైనది. అయితే దీని మీద ఫోషక పదార్ధాల యాజమాన్యం, వాతావరణ మరియు చీడ పీడల ప్రభావం కొంత మేరుకు వుంటుంది.

పత్తి  పూత దఫా దఫాలుగా రావటం వల్ల పత్తి ని కనీసం నాలుగైదు సార్లు తీయవలసి వస్తుంది.  బాగా ఎండినటువంటి పత్తి మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి. సాధారణంగా పత్తి డిసెంబర్, జనవరి నెలల్లో తీతకు రావడం, అదే కాలంలో మంచు కురియడం వలన పత్తి తడిసి ముద్దగా అవుతుంది.  కాబట్టి పత్తిని ఉదయం ఎనిమిది గంటల తరువాత మధ్యాహ్నం ఒంటి గంట లోపల, మరల సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల లోపల తీసుకోవాలి. వేడి ఎక్కువగా వున్నా సమయంలో పత్తి తీస్తే వాటితో పాటు గుల్లల వద్ద వున్నా తొడిమలు, ఎండిన ఆకులుపెలుసెక్కి ముక్కలై పత్తికి అంటుకుంటాయి.
పత్తి తీయగానే నీడలో మండేలు వేయాలి. ఈ విధంగా చేయటం వలన పత్తి గింజ బాగా గట్టి పడటమే కాకుండా, తేమ తగ్గి శుభ్రంగా ఉంటుంది. అలా చేయనట్లయితే దానిలో వున్నా తేమ వలన వేడి ఎక్కువై గింజలు ముడుచుకు పోయి పత్తి తూకం తగ్గటమే కాకుండా, ముక్కు పురుగు తగిలి నాణ్యత తగ్గుతుంది.