మొక్కజొన్న
మన రాష్ట్రంలో మొక్కజొన్న వర్షాధారంగానూ, సాగునీటి క్రింద కూడా సాగు చేస్తారు. ఖరిఫ్, రబీ కాలాల్లో పండించబడుతుంది. మొక్కజొన్న ఆహార పంటగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లోను ముడి సరకుగాను, పేలాల పంటగాను, తీపి కండె రకంగాను, కాయగూర రకంగాను సాగు చేయబడుతుంది. 2008-౦9 సంవత్సరం మొత్తంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 8.56ల హెకటార్లు కాగా మొత్తం ఉత్పతి 42.2౦ లక్షల టన్నులు. హెక్టారుకు సగటు దిగుబడి 49౩౦ కిలోలు.
.మొక్కజొన్న పంటను మన రాష్ట్రంలో వర్షాధారం క్రింద సుమారు 5.౩ లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నీటి పారుదల క్రింద సుమారుగా ౩.౩ లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వర్షాధారం క్రింద ముఖ్యంగా మెదక్, మహబూబ్ నగర్ , వరంగల్, కరీంనగర్ జిల్లాలలో అధిక సాగులో ఉన్నది . నీటి పారుడు క్రింద గుంటూరు, పశ్చిమ గోదావరి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువ సాగులో ఉన్నది.
మొక్కజొన్నలో కాల పరిమితిని బట్టి దీర్ఘకాలిక (1౦5 – 12౦ రోజులు), మధ్య కాలిక (9౦-1౦౦ రోజులు), స్వల్పకాలిక (<9౦ రోజులు) రకాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాల కంటే దీర్ఘకాలిక, మధ్య కాలిక రకాలు అధిక దిగుబడినిస్తాయి.
నేలలు
సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు భూములు, నీరు నిలువ వున్న భూములు మొక్కజొన్న సాగుకు పనికిరావు. నేలలో ఉదజని సూచిక విలువ (పి.హెచ్.) 6.5 నుండి 7.5వరకు ఉన్నచో ఈ పంటకు అనుకూలం.[
రకాలు
డి.హెచ్.యం -1 – పంట కాలం 85-9౦ రోజులు, 18-20 క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది. ఆకు మాడు తెగులును సమర్ధవంతంగా నిరోధించగలదు.
డి.హెచ్.యం -1౦౩ - పంట కాలం 1౦5-12౦ రోజులు, 22-25 క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది, కమ్మ రోగం, కాండం కుళ్ళు తెగుల్లును నిరోధించగలదు.
డి.హెచ్.యం -1౦5 - పంట కాలం 1౦5-12౦ రోజులు, 25 -౩౦ క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది, ఆకు ఎండు, మొక్క కుళ్ళు తెగుల్లును నిరోధించగలదు. స్థిరమైన అధిక దిగుబడినిస్తుంది.
డి.హెచ్.యం -1౦7 - పంట కాలం 88-95 రోజులు, 22-25 క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది. నీటి ఎద్దడిని కొంత వరకు తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా వుండి మేలైన పశుగ్రాసంగా పనికొస్తుంది.
డి.హెచ్.యం -1౦9 - పంట కాలం 85-9౦ రోజులు, 22-25 క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది, స్వల్పకాలిక హైబ్రిడ్, ఖరిఫ్ లో అనుకూలం. నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకుంటుంది.
డి.హెచ్.యం -111 (బి.హెచ్.1576) - పంట కాలం 9౦-95 రోజులు, 25-౩౦ క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది. అధిక దిగుబడినిచ్చు మధ్యకాలిక రకం ఇది ఆకు ఎండు, కాండం కుళ్ళు, కంకి ఎండు తెగులును తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా వుండి మేలైన పశుగ్రాసంగా పనికొస్తుంది.
డి.హెచ్.యం -11౩ - పంట కాలం 1౦5-12౦ రోజులు, 28-౩౦ క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది, అధిక దిగుబడినిచ్చు, దీర్ఘకాలిక రకం. ఖరిఫ్ కు అనువైనది. ఇది కొంత వరకు కాండం తొలుచు పురుగు. పూత తరువాత వచ్చే ఎండుతెగుల్లును తట్టుకుంటుంది.
డి.హెచ్.యం -115, పంట కాలం 85-9౦ రోజులు, 26-28 క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది. స్వల్పకాలిక హైబ్రిడ్ ఆకర్షనీయమైన నారింజ రంగు, గుండ్రని గింజలు కలిగి, అకు మాడు, తుప్పు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు ను తట్టుకుంటుంది. |
డి.హెచ్.యం -117 (బి.హెచ్.4౦625), పంట కాలం 95-1౦౦ రోజులు, ౩౦-౩5 క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది, అధిక మధ్యకాలిక రకం. ఖరిఫ్, రబికి అనువైనది. మంచి యాజమాన్య పదతుల్లో4౦ క్వింటాళ్ల వరకు దిగుబడి నిస్తుంది. ఇది కొంతవరకు ఖరిఫ్, రబీలో వచ్చే కాండం తొలిచే పురుగును, ఆకు ఎండు తెగుళ్లను , పూత తరువాత వచ్చే ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా వుండి మేలైన పశుగ్రాసంగా పనికొస్తుంది.
త్రిశులత - పంట కాలం 1౦5-12౦ రోజులు. 25-౩౦ క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది, మొవ్వ కుళ్ళు తెగులును తట్టుకుంటుంది.
సింథటిక్స్/ కంపోజిట్స్; అశ్విని / హర్ష / వరుణ్ ; పంట కాలం 9౦-1౦౦ రోజులు. 18-2౦ క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది. వర్షాధార పరిస్తితులకు అనుకూలం. మేలైన అధిక దిగుబడి నిచ్చు రకాలు. ఒకసారి కొన్న విత్తనం ౩-4 సం. వరకు వాడుకొనవచ్చు. |
 |
ప్రత్యేక రకాలు ;
అంబర్ శక్తి -1; పంట కాలం 9౦-1౦౦ రోజులు. 2౦-26 క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది. మధ్యకాలిక , అధిక ప్రోటీన్స్ (1౦.7%) గల సంకర జాతి రకం. గింజలు మధ్యస్త నొక్కులు కలిగి, పసుపు పచ్చ నారింజ రంగులో వుంటాయి. అకు మాడు, కాండం కుళ్ళు తెగుళ్లను తట్టుకుంటుంది.
అంబర్ పాప్ కార్న్; పంట కాలం 9౦-95 రోజులు. 1౦-14 క్వింటాళ్ళ దిగుబడిని అందిస్తుంది, మంచి పేలాలు చేయుటకు అనువైనది.
మధురి (తీపి రకం); పంట కాలం 75-8౦ రోజులు. ౩౦-౩2 వేల పచ్చి కండెలు, తీపి గల కండె రకం. 24% చక్కెర కలిగి ఉడికించి తినుటకు అనువైనది. ఎకరాకు 6-8టన్నుల పచ్చి చొప్పను ఇస్తుంది.
ప్రియ (తీపి రకం); పంట కాలం 78-85 రోజులు. తీపి కండె రకం. 2౦ - 22% చక్కెర కలిగి పొడవైన కండెలు గల రకం. ఉడికించి తినుటకు అనువైనది. ఎకరాకు 6-8 టన్నుల పచ్చి చొప్పను ఇస్తుంది.
నేల తయారీ:
విత్తడానికి ముందు మూడు, నాలుగుసార్లు నాగలితో దుక్కి దున్నాలి. దాదాపుగా ఎకరాకు 1౦ టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. తరువాత బోదె నాగలితో బోదెలు, కాలువలు చేసుకోవాలి.
విత్తడం – నాటడం
విత్తే కాలం;
సాధారణ పరిస్థితులలో వర్షాధారపు పంటను జూన్ రెండవ వారం నుండి జూలై రెండవ వారం వరకు విత్తుకోవచ్చును. మొక్కజొన్న పంటను రబీలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 లోగా విత్తితే ఎక్కువ దిగిబడులు పొందడానికి అవకాశముంది. ఉత్తర కోస్తా జిలాల్లో జనవరి వరకు విత్తనోత్పతి కోసం విత్తుకోవచ్చు.
విత్తన మోతాదు, విత్తే దూరం ;
|
విత్తన మోతాదు (కిలోలు/ హేక్టరుకు ) |
విత్తే దూరం ; |
సాళ్ళ మధ్య |
మొక్కల మధ్య |
సాధారణ రకాలు |
2౦ |
75 (లేదా) 6౦ సెం.మీ |
20 - 25 సెం.మీ. |
తీపి మొక్కజొన్న . |
1౦ |
6౦ సెం.మీ |
2౦ సెం.మీ |
పేలాల మొక్కజొన్న |
12 |
6౦ సెం.మీ |
2౦ సెం.మీ |
బేబీ కార్న్ |
25 – ౩0 |
45 సెం.మీ |
2౦ సెం.మీ |
పశుగ్రాస మొక్కజొన్న |
40 |
45 సెం.మీ |
౦ సెం.మీ |
విత్తే పద్ధతి;
మొదట నేలను వరుసల మధ్య 75 లేదా 6౦ సెం.మీ. ఎడం వుండేటట్లు బోదెలు చేసుకోవాలి. తరువాత సాళ్ళల్లో మొక్కకు, మొక్కకు మధ్య 2౦-25 సెం.మి. ఎడం వుండేట ట్లు విత్తనాన్ని బోదేకు కుడి వైపున విత్తితే నీటిపారుదల సులభంగా వుండడమే కాకుండా, వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి కూడా విలువుంటుంది. విత్తిన పది రోజుల తరువాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే వుంచి అదనంగా వున్న మొక్కలు తీసివేయాలి.
విత్తన శుద్ధి;
కిలో విత్తనానికి ౩ గ్రా. మంకోజేబ్ లేదా ధైరం లేదా కాప్టన్ అనే మందుతో విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చును. |
 |
ఎరువుల యాజమాన్యం;
|
ఎరువుల మోతాదు (కిలోలు / హేక్టరుకు) |
ఖరిఫ్ |
రబీ |
నత్రజని |
భాస్వరం |
పోటాష్ |
నత్రజని |
భాస్వరం |
పోటాష్ |
సాధారణ రకాలు |
18౦-2౦౦ |
6౦ |
5౦ |
2౦౦-24౦ |
6౦ |
5౦ |
తీపి మొక్కజొన్న |
12౦ |
6౦ |
5౦ |
180 |
6౦ |
5౦ |
పేలాల మొక్కజొన్న |
80 |
6౦ |
5౦ |
100 |
6౦ |
5౦ |
బేబీ కార్న్ |
100 |
5౦ |
4౦ |
120 |
5+౦ |
4౦ |
పైన తెలిపిన ఎరువులను నిర్ధారిత వ్యవధిలో ఈ కింద సూచించిన రీతిలో వెయ్యాలి.
- వర్షాధారపు పంటకు నత్రజనిని 1/౩ వంతు విత్తే సమయంలోను, 1/౩ వంతు ౩౦-౩5 రోజుల మధ్య, మిగిలిన 1/౩ వంతును 5౦-55 రోజుల మధ్య వేయాలి.
- నీటి పారుదల పంటకు విత్తే టప్పుడు ¼ వంతు, 25-౩౦ రోజుల మధ్య 1/4 వ వంతు, 45-5౦ రోజుల మధ్య 1/4వ వంతు, మిగిలిన 1/4 వ వంతు 6౦-65 రోజుల మధ్య వేయాలి.
- మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో వేయాలి.
సగం పోటాష్ ఎరువును విత్తే సమయంలోను, మిగతా సగం పోటాష్ ఎరువును 6౦-65 రోజుల మధ్య వేసుకోవాలి.
- ఎకరాకు 2౦ కిలోల జింకు సల్ఫేట్ ని మూడు పంటల కొకసారి దుక్కిలో వేయాలి. మొక్కలలో జింకు లోపం (ఆకుల పసుపు పచ్చ రంగులోకి మారడం లేదా లేత పిరు తెల్ల మొగ్గగా మారడం ) కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేట్ కలిపి పైరుపై పిచికారి చేయాలి.
పై పాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ వుండాలి. ఎరువులు వేసిన తరువాత సాళ్ళలో మట్టి ఎగదోయాలి. |
 |
నీటి యాజమాన్యం
మొక్కజొన్నకు పూతకు ముందు, పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం. ౩౦-4౦ రోజుల లోపు వున్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తరువాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకేత్తదు. సాధారనంగా పంట కాలంలో 6-8నీటి తడులు అవసరం. విత్తేటప్పుడు, 15 రోజులకు, ౩౦-౩5 రోజులకు, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకొనే దశలో నీటి తడులను ఇవ్వాలి. వర్షాలను బట్టి, పంట పరిస్తితిని బట్టి నీటి తడులను మార్చుకోవచ్చు. దీర్ఘకాలిక వంగాడాలకు 1-2 తడులు అధికంగా అవసరమౌతాయి. ముఖ్యంగా ఆకులు చుట్ట చుట్టుకునేటప్పుడునీటి ఆవశ్యకత వున్నట్లుగా గమనించి నీటి తడి ఇచ్చుకోవ్వాలి.
కలుపుయాజమాన్యం
పంట విత్తిన తరువాత రెండు రోజుల్లో అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నెలలలో ఎకరాకు 8౦౦ గ్రా. బరువు నేలలో అయితేఎకరాకు 12౦౦ గ్రాములను 2౦౦ లీటర్లను నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ వున్నపుడు పిచికారి చేయడం వలన వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు ఒక నెల వరకు మొలవకుండా అదుపు చేస్తుంది.
అంతర కృషి
విత్తిన ౩౦-45 రోజులకు కల్టివేటరుతో అంతర కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. కల్టివేటరు నడిపిన తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే రిడ్జ్రును నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు నత్రజని మొక్కజొన్న పెరుగుదలకు సక్రమంగా వినియోగింప బడుతుంది. ఈ విధంగా బోదె నాగలి నడిపినచో మొక్కల కుదుల్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా చేస్తుంది.
అంతర పంటలు, వరుస క్రమ పంటలు;
ఒకే పంటను వేయడానికి బదులు రెండు పంటలు వేయడం వలన తీవ్ర వర్షాభావ పరిస్తితులు ఎదురైనప్పుడు కనీసం ఒక పంట నష్టపోయిన ఇంకొక పంట నుండి ఆదాయం పొంద టానికి అవకాశం వుంటుంది. రెండు మొక్కజొన్న చాళ్ళ మధ్య ఒక చాలు కంది పంటను, 6 చల్లా వేరు శనగను, 6 చాళ్ళ అపరాలను వేసుకున్న రైతుకు లాభదాయకంగా వుంటుంది. వరుస క్రమ పంటగా ఎక్కువ పప్పు జాతికి చెందిన పంటలు ముఖ్యంగా వేరుశనగ రబీలో విత్తుకోవడం వలన తదుపరి వచ్చే ఖరిఫ్ మొక్కజొన్నకు పప్పుజాతి పంటలు భూమిలో స్థిరీకరించిన నత్రజని లభ్యమైన ఎరువుల వాడకం తగ్గిపెట్టుబడి తగ్గుట వలన రాబడి పెరుగుతుంది. |
 |
పంట కోత
పంట కోతకు వచ్చినప్పుడు కంకులు లేదా బుట్టలపై పొరలు ఎండినట్లు కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కలపై క్రిందికి వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా వుండి నొక్కులు ఏర్పడవు. అంతేకాకుండా బుట్టలోని గింజలను తీసి అడుగు భాగం పరిక్షిస్తే (కొన్ని రకాలను) ఒక నల్లని చార వుండడం గమనించవచ్చు.
ఈ దశలో గింజలో సుమారుగా 25-౩౦ శాతం తేమ వుంటుంది. కండేలకు మొక్కల నుండి వేరుచేసి గింజలలో తేమ శాతం 12-15 వచ్చే వరకు ౩-4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. పేలాల రకం వేసినప్పుడు గింజలో ౩౦-౩5% తేమ ఉన్నప్పుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే సరైన పేలాలుగా మారక గింజ పగిలి నాణ్యత తగ్గుతుంది. తీపి రకం వేసినప్పుడు గింజ పాలుపోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీ కార్న్ కొరకు పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యతతగ్గుతుంది. మొక్కజొన్నను పశువుల మెత కొరకు వేసినప్పుడు 50% పూత దశలో పైరును కోయాలి. ఈ దశలో కంకులను నూర్పిడి చేయుటకు (గింజలను బుట్ట నుండి వేరు చేయుట) ట్రాక్టర్ తో నడుచు నూర్పిడి యంత్రం లేదా కరెంటుతో నడుచు నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత 2-౩ రోజులు ఎండలో ఆరబెట్టి, శుద్ధి చేసి గోనె సంచులలో గాని లేదా పాలిథిన్ సంచులలో గాని భద్రపరచి చల్లని తక్కువ తేమ గల ప్రాంతాలలో నిలువ చేయాలి. దీనితోబాటు నీరుగాని, ఎలుకలు, పురుగులు లేదా శిలీంధ్రాలు మొదలైనవిరాకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇతర అంశాలు
వరిమాగాణుల్లో మొక్కజొన్న
ఇటివల కాలంలో దున్నకుండానే పంటల సాగు (జీరో టిల్లెజి) పద్దతి రైతుల్లో చాలా ప్రాచుర్యం పొందుతున్నది. ఈ పద్దతిలో తొలకరి వరిచేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్య కాళ్ళు పైనే దున్నకుండానే పదును అదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధనంలో రైతులకు ఎకరాకు రు. 12౦౦ వరకు దున్నడం ఖర్చులు అదా అవుతాయి. నెల రోజుల పంట కాలం కలసి వస్తుంది. ఈ పద్దతిలో ఒక ఎకరా వరి పండించే నీటితో 2 ½ ఎకరాల మొక్కజోన్నాను పండించవచ్చు.
వరి మాగాణుల్లో మొక్కజొన్నను సాగు చేసుకునేటప్పుడు ఈ క్రింది పేర్కోనబడిన అంశాలను పాటించాలి.
తెలంగాణలో అయితే నవంబర్, డిసెంబర్ మధ్య వరి కోతల అనంతరం విత్తు కోవాలి. అదే కోస్తా జిలాల్లో అయితే నవంబర్ – జనువరి మధ్య వేసుకోవచ్చు. ఆ తరువాత విత్తితే దిగుబడి తగ్గుతుంది.
వరి కోసిన తరువాత నేలలో తగినంత తేమ లేనట్లయితే ఒక తేలిక పాటి తడి ఇచ్చి మొక్కజొన్నను విత్తుకోవాలి.
తాడును ఉపయోగించి కానీ లేదా విత్తనం వేసే యంత్రంలో గాని వరుసకు మధ్య 75 లేదా 6౦ సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య 2౦ లేదా 25 సెం.మీ. వుండునట్లు విత్తుకోవాలి.
వరి మాగాణులలో భూమిని దున్నడం వుండదు. కనుక కలుపు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు ఎకరాకు 1.౦. కిలో ఆట్రజిన్ 5౦% పొడి మందును 2౦౦ లీటర్లనీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపు నేలంతా బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా పారాక్వాట్ 1.౦. లీటరు 2౦౦ లీటర్ల నీటిలో కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారి చేయాలి. సగం మోతాదు ఆట్రజిన్ + సగం మోతాదు పారా క్వాట్ (1/2 కిలో ఆట్రజిన్ + ½ లీటరు ;పారా క్వాట్/2౦౦ లీటర్ల నీటిలో) కూడా పిచికారి చేసినచో మంచి ఫలితం వుంటుంది.
మిగతా యాజమాన్య పద్దతులు ముఖ్యంగా ఎరువులు, సస్య రక్షణ సాధారణ రబీ మొక్కజొన్న పంటకు ఆచరించినట్లుగానే వరి మాగా ణుల్లో సాగు చేసిన మొక్కజొన్నకు కూడా పాటించాలి. |