కంది
కంది మన రాష్ట్రంలో దాదాపు 11.25 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, 20.2 లక్షల టన్నుల ఉత్పతి నిస్తుంది. ఎకరాకు 180 కిలోల సరాసరి దిగుబడి నిస్తుంది. పత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుచిక్కుడు లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరిఫ్ లో పండించవచ్చు. కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగు చేస్తున్నారు. ఈ పంటను రబీలో కూడా పండించవచ్చు.
రబీ కంది సాగుకి అవకాశాలు
-
కారణంతరాల వల్ల తొలకరి ఏ ఫైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాలు
-
ఆధిక వర్షాలకు, బెట్ట మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలు
-
తొలకరిలో స్వల్పకాలిక పంటలు (పెసర, మినుము లాంటివి) వేసుకుని రెండవ పంటగా కంది వేసుకోవచ్చు.
-
స్వల్పకాలిక వరి రకాల తరువాత కూడా కందికి అవకాశం వుంది. అయితే అక్టోబర్ తర్వాత కంది విత్తకూడదు.
-
తొలకరి కంది ఎక్కువ ఎత్తు పెరగటం వల్ల ఈ పంటను ఆశించే కాయ తొలుచు పురుగు, మరుకా మచ్చల పురుగుల నివారణ కష్టమౌతుంది. రబీ కంది, అనువైన ఎత్తులో వుండటం వలన సస్యరక్షణ చర్యలు చేపట్టడం తేలిక. రబీ కంది జనవరిలో పూత కొస్తుంది. ఈ సమయంలో సనగపచ్చ పురుగు ఉధృతి తక్కువుగా వుంటుంది. కాబట్టి పురుగును తట్టుకుంటుంది.
రబీ కందికి అనువైన ప్రాంతాలు;
దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, మరియు గుంటూరు జిల్లాల్లో ఈశాన్య ఋతు పవనాలు వల్ల కురిసే వర్షాలనుపయోగించి రబీ కందిని వర్షాధార పంటగా సాగు చేయవచ్చు. ఈ జిల్లాలే కాకుండా గోదావరి నది వరద తాకిడికి గురయి వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో వరద పోయిన తర్వాత రబీ కంది సాగుకు అనుకూలం. శ్రీరాంసాగర్ , నిజాంసాగర్ మరియు నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో కూడా కంది ఆరుతడి పంటగా పండించవచ్చు. నీటి వసతి ఉంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సాగు చేయవచ్చు.
తొలకరిలో 170- 180 రోజుల్లో కోతకు వచ్చేమధ్యకాలిక రకాలైన ఐసి పి యల్- 8506౩, పల్నాడు , యల్.ఆర్. జి. ౩8, డబ్లు.ఆర్.జి. – 27, యల్.ఆర్.జి. 41, సి-11, అభయ, ఐ సిపి.యల్- 87119, ఐసిపి.యల్- 886౩, యం.ఆర్.జి 66 వంటి రకాలను రబీ కాలంలో కూడా వేసుకోవచ్చు.
ఖరిఫ్ , రబీ కంది పైరుల తేడా;
|
ఖరిఫ్ |
రబీ |
విత్తే కాలం |
జూన్, జూలై |
సెప్టెంబర్ 15 - అక్టోబర్ 15 |
పంటలు |
సహపంటగా |
ఏక పంటగా / సహ పంటగా |
విత్తనం (ఎకరానికి) |
2 – ౩ కిలోలు |
6 – 8 కిలోలు |
విత్తే దూరం |
150 – 20 లేక
180 – 20 సెం.మీ |
90 - 10 సెం. మీ. |
కాల పరిమితి |
160 – 180 రోజులు |
120 – 150 రోజులు |
మొక్కల ఎత్తు |
2 మీటర్ల వరకు |
1.2 మీటర్లు |
కొమ్మలు |
బాగా వస్తాయి |
తగ్గుతాయి |
కాయగింజల పరిమాణం |
బాగుంటుంది |
తగ్గుతుంది |
చీడపీడలు |
ఎక్కువ |
తక్కువ |
దిగుబడి (ఎకరానికి) |
6 - 8 క్వింటాళ్లు |
5 – 6 క్వింటాళ్లు |
విత్తే సమయం ;
ఖరిఫ్ లో ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జునేలోను , కృష్ణ, గోదావరి, దక్షిణ మండలం మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ – ఆగష్టు నేల్లలోను, రబీలో ఉత్తర, దక్షిణ తెలంగాణాల్లో సెప్టెంబర్ లోను, కృష్ణ –గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో సెప్టెంబర్ – అక్టోబర్ నేల్లలోను విత్తుకోవచ్చు.
నేలలు
నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్ర రేగడి, చల్క నేలలో మరియు మురుగు నీరు పోయేవసతి గల నల్లరేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపుకు గురైయ్యనేలలు పనికి రావు. భూమిని రెండు సార్లు నాగళ్ళతో దున్ని నేలను మెత్తగా తయారు చేయాలి.
రకాలు
పల్నాడు (యల్.ఆర్.జి. ౩0); ఖరిఫ్ లో పంట కాలం 170 – 180 రోజులు, రబీ పంట కాలం 120 – 1౩0 రోజులు. మొక్క గుబురుగా పెరిగి కాపు మిద పక్కలకు వాలి పోతుంది. పువ్వులుపసుపు పచ్చగా వుంటాయి. గింజలు మధ్యస్తం లావుగా గోధుమ రంగులో వుంటాయి. మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైన రకం. రబీ కి కూడా అనుకూలం. ఎండు తెగులు, వెర్రితెగులును తట్టుకోలేదు.
యల్.ఆర్.జి- ౩8 - ఖరిఫ్ లో పంట కాలం 170 రోజులు. రబీ లో పంట కాలం 120 – 1౩0 రోజులు. మొక్కలు ఎత్తుగా, గుబురుగా పెరుగుతాయి. పువ్వులు పసుపు పచ్చగా వుంటాయి. గింజలు లావుగా, గోధుమ వర్ణంలో వుంటాయి. తొలకరికి, రాబికి కూడా అనుకూలం.
యల్.ఆర్.జి. 41 - ఖరిఫ్ లో పంట కాలం 170 రోజులు, రబీ లో పంట కాలం 120 – 1౩0 రోజులు. పైరు ఒకేసారి పూతకు రావటం వలన కొమ్మలు వంగుతాయి. శనగపచ్చ పురుగును బాగా తట్టుకుంటుంది. నల్లరేగడి భూములకు అనుకూలం. నీటి వసతితో తేలికపాటి బూముల్లో కూడా పండించవచ్చు]
లక్ష్మి (ఐసి.ఫై.యల్. 8506౩) – ఖరిఫ్, రబీ లో పంట కాలం 160 – 170 రోజులు. చెట్లు గుబురుగా వుండి ఎక్కువ కొమ్మలు కలిగి వుంటాయి. ఎండుతెగులును కొంతవరకు తట్టుకుంటుంది. రబీలో విత్తినప్పుడు, ప్రధానమైన కొమ్మలు ఎక్కువుగా వుంటాయి. గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో వుంటాయి.]
యం.ఆర్.జి. 66 – ఖరిఫ్ లో పంట కాలం 180 రోజులు. నల్లరేగడి భూములకు అనువైనది. గింజలు మధ్యస్తంగా వుంటాయి. మక్రోఫోమినా ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.
అభయ (ఐ.సి.పియల్. ౩౩2) – ఖరిఫ్ లో పంట కాలం 160 – 165 రోజులు. మొక్కలు నిటారుగా పెరిగి కాయలు గుత్తులుగా కాస్తాయి. గింజలు మధ్యస్తం లావుగా గోధుమ రంగులో వుంటాయి. కాయ తొలుచు పురుగును కొంతవరకు తట్టుకుంటుంది.
ఆశ (ఐ.సి.పియల్.- 87119) – ఖరిఫ్ లో పంట కాలం 170- 180 రోజులు. మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. ఎండు మరియు వెర్రి తెగుల్లను తట్టుకుంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో వుంటాయి.
మారుతీ (ఐ. సి.పి. 8863) -ఖరిఫ్ లో పంట కాలం 155-160 రోజులు. మొక్క నిటారుగా పెరుగుతుంది. ఎండు తెగులును తట్టు కొంటుంది. గింజలు మద్యస్తంగా, లావుగా ఉంటాయి. వరి మాగాణి గట్ల మిద పెంచుకోటానికి అనువైంది.
ఆర్.జి. 27- ఖరిఫ్ లో పంట కాలం 180 రోజులు, రబీ లో పంట కాలం 120-130 రోజులు. మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. పువ్వులు ఎరుపుగా ఉంటాయి. కాయలు ఆకుపచ్చ ముదురు గోదుమరంగు చారలు కలిగి ఉంటాయి. గింజలు గోదుమ వర్ణం లో ఉంటాయి.
పి. ఆర్. జి 100- ఖరిఫ్ పంట కాలం 145-150 రోజులు. ఎండు తెగలును కొంత వరకు తట్టుకుంటుంది. తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలలో తేలిక పాటి ఎర్ర చెల్క నేలలో వర్షాధారంగా సాగుచేయటానికి అనువైంది.
పాలెం కంది (పి. ఆర్. జి 158 ) – ఖరిఫ్/రబీ పంట కాలం 150-155 రోజులు. దక్షిణ తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలకు అనువైంది. పూజేరియమ్ ఎండు తెగులును తటుకుంటుంది.
దుర్గ (ఐ. సి. పి.ఎల్ .84031) -ఖరిఫ్ పంట కాలం 115-125 రోజులు. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకం. కాయతొలుచు పురుగు బారి నుండి తప్పించు కుంటుంది. ఉత్తర తెలంగాణా జిల్లాలకు ఖరిఫ్ పంటగా అనువైనది.
సూర్య (యం. ఆర్. జి. 1004) –ఖరిఫ్ పంట కాలం 165-180 రోజులు. మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. పూవులు పసుపు పచ్చగా ఉంటాయి. గింజలు లావుగా గోదుమ రంగులో ఉంటాయి. ఎండు తెగలు (మైక్రోఫోమినా)ను కొంత వరకు తట్టుకుంటుంది.
వరంగల్ కంది 53 (డబ్లు. ఆర్. జి 53) - ఖరిఫ్/ రబీ లో పంట కాలం 160 రోజులు. కాయతొలుచు పురుగును కొంతవరకు తట్టుకుంటుంది.
విత్తడం – నాటుడు
విత్తన శుద్ధి:
రైజోబియంను విత్తనంతో కలిపి విత్తితే పంట తెగుల్లను తట్టుకుంటుంది. ఆశించిన దిగుబడి పొందవచ్చు.
విత్తే పద్దతి:
నాగలి వెంబడి గానీ, సాల్లలో గోర్రుతో గానీ విత్తుకోవాలి.
విత్తేదూరం:
ఖరిఫ్ లో నల్లరేగడి నెలల్లో 150X 20 లేదా 180X20 సెం. మి (వరుస మద్య, మొక్కల మద్య), ఎర్ర నేలలో 90X20 సెం. మి, రబీలో వర్షాధారంగా 45-60X10, ఆరుతడి పంటగా 75-90X10 సెం. మి.
ఎరువుల యాజమాన్యం:
చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువులు ఎరువు వేయాలి. ఖరిఫ్ లో 8 కిలోలు, రబీ లో 16 కిలోలు నత్రజనితొ పాటు ఈ రెండు కాలాలలోనూ 20కిలోలు భాస్వరం వేసుకోవాలి. అంతరపంట వేసేటప్పుడు ఫైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకు, అంతర పంటకు వేరువేరుగా ఎరువు వేయాలి.
నీటి యాజమాన్యం:
ఈశాన్య రుతుపవనాల ప్రభావం లేని ప్రాంతాలలో రబీ కిందికి 2 తేలిక పాటి తడులు ఇవ్వాలి. ఈ తుడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కయదశలో మరోసారి ఈవాలి.
కలుపు నివారణ – అంతర కృషి
పెండిమిధలిన్ 30% ఎకరాకు 1.0-1.5 లీటరు లెక్కన లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు లెక్కన విత్తిన వెంటనే గానీ, మరుసటి రోజున గానీ పిచికారి చేయాలి. విత్తిన 30,60 రోజులప్పుడు గుంటకతో గాని, గొర్రు తో గాని అంతర కృషి చేయాలి.
అంతర పంటలు: తక్కువ కాలపరిమితి గల మినుము, పెసర, తృణ ధాన్యాలు, వేరుశనగ అంతర పంటలుగా వేసుకోవచ్చు.
అంతర పంటల నిష్పత్తి : కంది + జొన్న/సజ్జ/ మొక్కజొన్న = 1:2, కంది+పెసర/మినుము/సోయాచిక్కుడు/వేరుశనగ=1:7
పంట కోత – నిల్వ
అన్ని కాయలు ఎండిన తరువాతనే కంది పంటను కోయాలి. ఎండిన తరువాత కట్టెలతో కొట్టి కాయల నుంచి గింజలను వేరు చేయాలి.
వేప ఆకులను, బూడిదని కందులతో కలిపి నిల్వ చేస్తారు. నిల్వ చేసే ముందు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా కందులను బాగా ఎండబెట్టాలి.
|