సస్యరక్షణలో వ్రుక్షసంబంద కాషాయాల తయారి మరియు వినియోగంలో కొన్ని సూచనలు
పంటల సమగ్ర సస్యరక్షణలో వ్రుక్షసంబంధ రసాయనాల ద్వారా, తక్కువ ఖర్చుతో, సహజ వనరులను వినియోగించి, వాతావరణ కాలుష్యం లేకుండా, చీదపీడలను అదుపుచేయవచ్చును. అందుబాటులో ఉన్న వివిధ ఆచరణ సాధ్యమైన ఎన్ పిఎం పద్ధతులను ఉపయోగించి, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే సహజ సస్య రక్షణ పద్ధతులను అవలంభించి, అవసరమైనపుడు వివిధ సస్యరక్షణ కశాయాలనుపయోగించి ఇప్పటికే రైతులు అనేక పంటలలో సత్ఫలితాలు పొందుతున్నారు. ఆచరణ యోగ్యమైన ఎన్ పి ఎం పద్ధతులను ప్రతి యేటా ఉపయోగిస్తూ, క్రమేణా “కషాయాల” వినియోగాన్ని కూడా క్రమబద్దం చేసిన ‘రైతు అనుభవాలు’ ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలం, పునుకుల గ్రామంలో కానవస్తున్నాయి. వివిధ పంటలలో ఉపయోగించే సస్యరక్షణ కాషాయాల తయారీ మరియు వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలను ఈ క్రింది పేరాలలో వివరించటం జరిగింది.