Dabolkar method of green manuring / దబోల్కర్ పద్దతి పచ్చి రొట్ట్ట ఎరువులు

దబోల్కర్ పధ్ధతి

దబోల్కర్ పధ్ధతి :  భూసారం పెంచుకోవటానికి మన ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రకి చెందిన దబోల్కర్ అనే శాస్త్రవేత్త కొన్ని సూచనలు చేసారు.

దాన్యపు గింజలు :  5 కేజీలు (మొక్కజొన్న, జొన్న, సజ్జ, తైదులు, రాగులు మొ...)

పప్పు గింజలు    :  5 కేజీలు (మినుములు, పెసలు, శనగలు, కంది, అలసంద మొ...)

నూనెగింజలు     :  5 కేజీలు (నువ్వులు, వేరుశెనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, మొ...)

సుగంధ ద్రవ్యములు : 5 కేజీలు (ఆవాలు, మెంతులు, ధనియాలు, కరివేపాకు, పుదీనా మొ...)

పచ్చిరొట్ట పంట విత్తనాలు : 5 కేజీలు (జనుము, జీలుగ, అవిశ, గ్లైరిసీదియం  మొ...)

దుక్కి దున్ని మండలాగిన తరువాత ఈ పై విత్తనాలన్నీ కలగలిపి ఎకరానికి 20-25 కేజీలను చల్లుకోవాలి. ౩౦-40 రోజుల వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నాలి.

ఇలా చేయడం వలన పంట కాలం నష్టపోతామని భావించినట్లయితే రైతులు తమ పొలాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని, ఏటా ఒక భాగంలో ఈ పధ్ధతి పాటిస్తూ కొద్ది సంవత్సరాలలో మొత్తం పొలాన్ని సారవంతంగా చేసుకోవచ్చు.