పురుగును వ్యవసాయ పర్యావరనంలో అంతర్భాగంగా చూడాల్సిన అవసరం ఉంది.
వాటిని అదుపుచేయడానికి పకృతి లో పరాన్న జీవులు, పరాన్న జీవులు, సాలిళ్ళు, పక్షులు మొదలగునవి, వాటిని ఆహారంగా తీసుకుని జీవించేవి ఉన్నాయి.
భూమి మీద జివరాశుల్లో 75 శాతం పురుగులే. వాటిలో 10-15 శాతం మాత్రమే పంటలకు నష్టాన్ని కలిగించేవి.
పురుగు మందులు వాడకం ఆపి, వ్యవసాయ పద్దతుల్లో కొద్దిపాటి మార్పులు చేసి మిత్ర పురుగుల్ని ప్రోత్సాహింసాలి.
సుస్తిరమైన అధిక దిగుబడుల కోసం వాటికి అనువైన వాతావరణం కల్పించాలి.
పంటలలోరైతు మిత్రులు ముఖ్యంగా రెండు రకాలు, పరాన్నజీవులు, పరాన్న భుక్కులు.
పరాన్న జీవులు: కందిరీగలు లేదా ఈగ జాతికి చెందినవి. కందిరిగాలు మొండానికి చివర ముళ్ళు కలిగి ఉంటాయి. దీనితో గుచ్చి చీడపురుగుల శరీరంలోనికి విషాన్ని, గుడ్లను చోప్పిస్తాయి.