లింగాకర్షక బుట్టలతో పురుగులపై నిఘా
మగ పురుగులను ఆకర్షించే లింగాకర్షక రసాయన గుళికలు పెట్టిన ఎర బుట్టలను పొలంలో ఉంచి పురుగుల సంతానం నియంత్రించవచ్చు.
ఈ గుళికలు ఆడ పురుగుల వాసన కలిగి ఉంటాయి. ఆడ పురుగులు ఉన్నాయని భావించి వాటితో కలవడానికి వచ్చే మగ పురుగులు బుట్టలో పడి పోతాయి.
ఆడ పురుగులకు సరిపడా మగ పురుగులు లేక వాటి సంయోగానికి అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల పురుగుల సంతానోత్పత్తి జరుగదు. వాటి సంతాన అభివృద్ధి ప్రక్రియని నిలిచిపోతుంది.
ఈ పద్ధతిలో పురుగుల ఉధృతిని కూడా అంచనా వేయవచ్చు.
పత్తిలో కాయ తొలిచే శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబి పురుగులను ఈ పద్ధతిలో కట్టడి చేయవచ్చు.