పంట విత్తే కాలాన్ని సరి చేయడం
అంతకు ముందరి సంవత్సరాల అనుభవాన్ని బట్టి పంటను ఆశించే పురుగుల ఉధృతి ఏ సమయంలో ఎక్కువగా ఉంటుందో గమనించి విత్తే కాలాన్ని సరి చేయడం ద్వారా పంటను పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు.
ఉదాహరణకు, వరి పైరును ఖరీఫ్ లో ముందుగా నాటి ఉల్లి కోడు బారి నుంచి కాపాడుకోవచ్చు. అలాగే పత్తి పంటను జూన్ లో వేసి తల నత్త పురుగు ఉధృతి బారి నుంచి తప్పించవచ్చు.