దీపపు ఎరలు
స్థానిక పరిస్థితులను బట్టి మంటలకు బదులుగా దీపపు ఎరలను వాడి రెక్కల పురుగులను ఆకర్షించ వచ్చు.
పొలంలో 150 వాట్ల బల్బు వేలాడదీసి, దానికింద తొట్టిలో నీరు పోసి ఒక మూత కిరసనాయిలు (గ్యాసు నూనె) పోసి పెడితే ఆ వెలుతురుకు రెక్కల పురుగులు ఆకర్షించబడతాయి.
బల్బు దగ్గరికి వచ్చిన వచ్చిన పురుగులు కిందనున్న తొట్టిలో పడి చనిపోతాయి.
మామూలుగా నాలుగు ఎకరాలకు ఒక దీపపు ఎర సరిపోతుంది.
ఉదాహరణకు : వరిని ఆశించే కాండం తొలిచే పురుగు, దోమ పోటు పురుగు, ఉల్లికోడు పురుగులు రెక్కల దశలో కాంతివంతమైన దీపాలకు ఆకర్షితమవుతాయి. అందువల్ల వరి సాగు చేసే క్షేత్రాలలో దీపపు ఎరలను వాడి ఆ పురుగులను కొంతవరకు తగ్గించవచ్చు. ఆ ప్రాంతంలోని రైతులందరూ సామూహికంగా దీపపు ఎరలు వాడినప్పుడే మంచి ఫలితం వస్తుంది.