అంతర పంటలు:
ప్రతి యేటా సాగయ్యే విస్తీర్ణంలో సుమారు 70 శాతం మెట్ట సాగు క్రిందనే వున్నది. వర్షాధారం క్రింద సాగయ్యే పంటలను మెట్ట పైర్లు అంటారు. ఉదా. జొన్న, సజ్జ, ఆముదం, కంది, వేరుశనగ, పెసర, మినుము, కొర్ర, రాగి, మొక్కజొన్న మొదలగునవి. మనదేశ వార్షిక ఆహార ధాన్యాల ఉత్పతిలో సుమారు 42 శాతం మెట్ట పైర్ల ద్వారానే లభిస్తున్నాయి. వర్షాధారిత మెట్ట పంటల సేద్యం బహు శ్రమతో కూడి, తరచూ సంభవించే వర్షాభావ పరిస్తితుల వలన అనిచ్చిత పరిస్తితుల నేదుర్కోమటు వున్నది. సనాతనంగా మెట్ట నేపధ్యంలో అపరాలు, నూనే గింజల పైర్లు, చిరు ధాన్యాల పండించ బడి వాటి ఉత్పాదకత, తద్వారా రైతాంగానికి లభించే లాభాలు చాలా తక్కువగా వుండటం గమనార్హం. మన దేశంలోని 70 శాతం భూమి సాలీనా 100 ౦ మీ. మీ. వర్షపాతం కన్నా తక్కువ పొందుతూ వుంటుంది. మెట్ట సాగు క్రింద సుమారు 90 శాతం జొన్న, సజ్జ, చిరు ధాన్యాలు, 90 శాతం అపరాలు, 80 శాతం నునే గింజల పైర్లు, 70 శాతం పత్తి మరియు మెట్ట వరి సాగు చేయబడుతున్నది . సాధారణంగా నేల స్వభావం దాని తేమ నిలుపుకునే శక్తిని, నిటి పరివాహకాన్ని పైర్ల పెరుగుదల కాలాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు అనంతపురం జిల్లాల్లోని ఎర్ర నెలల్లో 12౦ రోజుల్లో పైరును సాగు చేయడానికి అవకాశం వుంటుంది. బరువైన నల్ల రేగడి నేలలు అధిక తేమను నిల్వ వుంచుకునే శక్తీ కల్గి, 18౦ రోజుల వరకు పైర్లను పోషించగ లవు. వర్షా కాలంలో పైర్ల పెరుగుదల వర్షపాత మోతాదు మరియు దాని విస్తిర్ణంపై ఆధారపడి వుంటుంది.