mulching/ మల్చింగ్

ఎండధాటికి, చలికి, వర్షాలకూ, మన శరీరాలను వస్త్రాలు ధరించడం వల్ల రక్షించుకుంటున్నాం. అదే విధంగా ఆకు అలములతో, మొక్కలతో భూమిని కప్పి రక్షించుకోవడాన్ని మల్చింగ్ అంటాం.

మల్చింగ్ ఉపయోగాలు

  1. ఎండ  వేడిమి నేరుగా భూమికి తగలకపోవడం వల్ల నేలలోని తేమకు, సూక్ష్మజీవులకు నష్టంలేదు.
  2. వర్షం కురిసేటప్పుడు చినుకులు నేరుగా భూమిని డీకోట్టడం వల్ల కలిగే నేలగట్టిదనాన్ని తప్పించుకోవచ్చు.
  3. వర్షపు నీరు ప్రక్కలకు పోవడానికి ఆకులు, గడ్డి మొదలైన అడ్డుతగలటం వల్ల భూమిపై ఎక్కువసేపు తచ్చాడుతూ నేలలోకి ఇంకుతాయి.
  4. భూమిపై కప్పే ఆకులు మొదలైన సేంద్రియ పదార్థాలు కుళ్ళి పోషకాలు విడుదల చేస్తాయి.