వర్మి వాష్
వర్మివాష్ తయారు చేయుటకు 10 లీటర్ల మట్టి కుండ లేదా ప్లాస్టిక్ పాత్రను తీసుకోవాలి. దానికి క్రింది భాగాన కులయిని అమర్చాలి. తరువాత ఆ పాత్రలో 10 సెం. మీ. మందంలో కొబ్బరి పీచును పరచాలి. తరువాత పాక్షికంగా కుళ్ళిన వ్యవసాయ వ్యర్ధ పదార్థాలతో పాటు కొంచం పేడను కూడా వేసి నీటితో బాగా తడపాలి. రెండు రోజులు తడిపిన దానిపై రెండు క్షజల వానపాములను వదలాలి. రెండు వారాలలో వ్యర్ధ పదార్థాలు నల్లని కంపోష్టుగా మారుతాయి. ఈ దశలో దానిపై రెండు క్లజల వానపాములను వదలాలి. రెండు వారానలో వ్యర్ధ పదార్ధాలు నల్లని కంపోష్టుగా మారుతాయి. ఈ దశలో దానిపై ౩ లీటర్ల నీటిని పోయాలి. 24 గంటల తరువాత 2 లీటర్ల వరకూ వర్మివాష్ ను కొళాయి ద్వారా సేకరించవచ్చును. ఈ పద్ధతిని వారం రోజులు కొనసాగించి కుండ లేదా ప్లాస్టిక్ పాత్రలోని కంపోస్టును తొలగించి, ఎరువుగా వాడుకోవచ్చును. తిరిగి పైన వివరించినట్లుగా పాత్ర నింపి వర్మివాష్ ను తయారుచేసుకుంటూ ఉండాలి.