వేసవిలో లోతుగా దుక్కులు
ఎండా కాలం పొలంలో పంట లేనప్పుడు భూమిని లోతుగా దున్నితే, భూమిలో దాక్కున్న చీడ పురుగులు చనిపోతాయి.
ఉదా : వేరుశనగలో వేరు తొలిచే పురుగు, శనగ పచ్చ పురుగు (కోశాస్థ దశ) , పొగాకు లద్దె పురుగు (కోశాస్థ దశ), మిడతల గుడ్లు - పై వన్నీ నేలలో దాక్కుని ఉంటాయి. పంట పైరు సాగు చేసినప్పుడు అవి బయటికి వచ్చి పంటను నాశనం చేస్తాయి. ఎండాకాలం దుక్కుల వల్ల నేల మీదకు వచ్చే పురుగులు ఎండ వేడికి తట్టుకోలేక చచ్చిపోతాయి. కొన్నిటిని పక్షులు ఏరుకుని తింటాయి.