లక్షణాలు:
వ్యాధి సోకినా ఆవులు, గేదెల యొక్క పొదుగు చన్నులు వాచి ఉంటాయి.
పొదుగు మరియు చన్నులు ముట్టుకుంటే వేడిగా యుండి నొప్పితో పశువు బాధపడుతూ ఉంటుంది. పొదుగు గట్టిగా ఉంటుంది.
పొదుగు వాపు ఒక చన్నుకు గాని అన్ని చన్నులకు గానే ఒకేసారి రావచ్చు.
పాలు పితికినప్పుడు పాలు కుతపలుగా లేక నీరుగా ఉండి పశువు కొద్దిగానే పాలు ఇస్తుంది. ఒక్కోసారి పాల ధారలో చారలు కనపడుతాయి.
పశువు జ్వరంతో బాధపడుతూ మేత మేయక నీరసముగా ఉంటుంది