ముఖ్య గమనిక:

ఈ వ్యాధితో చనిపోయిన జీవాలును శవపరీక్ష (పోష్టు మార్టమ్) చెయకూడదు. చనిపోయిన పశువుల లేదా చివరిదశలో ఉన్న పశువును కోసినట్లైతే, సూక్శ్మ క్రిములు స్పోరులు ఆ ప్రాంతమంతా వ్యాపిస్థాయి. కావున శవపరీక్ష చేయకూడదు.

ఒక వేళ పొరపాటున కోసిన ఎడల స్ప్లిన్స్ చాలా పెరిగి వుంటుంది. కాలేయం మరియు మూత్రపిండాలు బాగా యర్రబారి వుంటాయి. శరీరములోపల ఎర్రని ద్రవం చేరి ఉంటుంది. పొరపాటున జీవాలను చనిపోయిన తరువాత లేదా చివరి దశలో కోసిన ఎడల వెంటనే గొయ్యి త్రవ్వి పూడ్చి సున్నం చల్లాలి. అదే విధంగా ఆప్రాంతమంతటా సున్నం చల్లాలి.