లక్షణాలు :
పంట తొలిదశలో ఉన్నప్పుడు, పిల్ల పురుగులు మొక్క లేత భాగాలైన కొమ్మలలోకి చొచ్చుకుపోతాయి. కాయలు తయారవుతున్నప్పుడు వాటిలోకి కూడా చొచ్చుకుపోతాయి. ఇలా లోపలికి వెళ్ళడానికి అవి చేసే రంధ్రాల దగ్గర పురుగు విసర్జితాలు ఉంటాయి. పురుగు సోకిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే పాడై రాలిపోతాయి. కొమ్మలు వడలిపోతాయి.