A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు

తెగులు సోకిన మొక్కల ఆకులపై చిన్నటి, గుండ్రటి, తడిసినట్లు కనపడే గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. వాటి చుట్టూ పసుపు రంగు వలయాలు ఏర్పడతాయి. పెరిగిన మొక్కలలో, ముందుగా వచ్చిన ఆకుల మీదనే ఈ తెగులు ప్రభావం ఎక్కువ కనపడుతుంది.  ఈ ఆకులు పూర్తిగా పచ్చదనం కోల్పోతాయి.  పచ్చటి కాయపై తెగులు లక్షణాలు స్పష్టంగా కనపడుతాయి.  ముందుగా చిన్నగా ఉండే మచ్చలు క్రమేపి పెద్దవి అవుతాయి. చివరకు 1/8 – ¼  అంగుళం మేర వ్యాసార్ధం కలిగిన మచ్చలుగా మారుతాయి.  ఈ మచ్చల మధ్య భాగంలో లేత గోధుమ రంగులో, కొంచెం  కృంగినట్లు, గరకుగా ఉంటుంది. కాయ పక్వానికి వచ్చిన తరువాత ఈ తెగులు సోకదు.