A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు :

తెగులు సోకిన మొక్కల భాగాలపై  నల్లటి మచ్చలు గుల్ల బారినట్లు కనపడతాయి. ఈ మచ్చలు ఫంగస్ జీవ కణాల వల్ల ఏర్పడతాయి.  ఆకుల  మీద, కాయల మీద తొలుత ఇవి చిన్నగా గుండ్రంగా ఉంటాయి. రానురాను కలిసిపోయి పెద్ద  మచ్చలుగా మారుతాయి.  తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు  మొక్కలు పచ్చదనం కోల్పోతాయి.

ఈ తెగులు ప్రధానంగా మూడు దశలలో కనపడుతుంది. ఎండిన విత్తనం, ఆకు మచ్చ, కాయ కుళ్ళు దశల్లో తెగులు తన ప్రభావాన్ని చూపుతుంది.   తెగులు సోకితే కాయ బరువు తగ్గుతుంది.   కొన్ని రకాల ఫంగస్ వల్ల  కాయలు ఎర్రగా మారుతాయి.

కాయల పైన చిననాటి, నల్లటి, గుండ్రటి మచ్చలు కనపడతాయి.  తెగులు పెరుగుతున్న కొద్దీ మచ్చలు విస్తృతమవుతాయి. నల్లగా లేదా ఆకుపచ్చగా రంగులో కనపడే ఈ మచ్చల చుట్టూ చిక్కటి, నల్లటి  గీతల మాదిరి ఉంటాయి. మచ్చ మధ్యలో లేత నలుపు లేదా గడ్డి  రంగులో కనపడుతుంది.  కొన్ని సార్లు మచ్చలు గోధుమ రంగులో కూడా కనపడుతాయి. క్రమేపి ఇవి నలుపు రంగుకు మారుతాయి.  తెగులు ఎక్కువగా ఉంటే కాయ ఎరుపు రంగు నుంచి గడ్డి లేదా తెలుపు రంగుకు మారుతుంది.  తెగులు సోకిన కాయను కోసి చూసినప్పుడు లోపల గుండ్రంగా, చిన్నటి, నల్లటి మచ్చలు చూడవచ్చు.  విత్తనాలకు సోకినప్పుడు వాటి చుట్టూ ఉండే ఫంగస్ వల్ల అవి తుప్పు పట్టినట్లు కనపడుతాయి. చివరకు కాయ గుల్లబారి ఎండిపోతుంది.