Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు :
తెగులు సోకిన మొక్క ఆకుల మీద ఈనెలు పసుపు రంగులోకి మారి, ఒక దానితో ఒకటి అల్లుకుని ఒక గూడు లాగా మారినట్లు కనపడుతాయి.
పచ్చని కనజాలాన్ని ఇది కప్పేస్తుంది.
తొలుత ఆకుల మీద ఈనెలు మాత్రమే పసుపు రంగులో కనపడుతాయి, కానీ తెగులు పెరుగుతున్న కొద్దీ మొత్తం ఆకులు పసుపు రంగులోకి మారుతాయి.
కొన్ని సందర్భాలలో, తెగులు సోకిన ఆకులు లేత పసుపు లేదా లేత గోధుమ రంగులోకి మారుతాయి. ఆకుల పైన పచ్చదనం ఏ మాత్రం కనపడదు.
కొన్ని సార్లు ఆకుల కింద భాగంలో సూదుల వంటి బొడిపెలు కనపడుతాయి.
మొక్క తొలి దశలో తెగులు సోకితే మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది.
తెగులు సోకినా మొక్కల ఆకులు లేత పసుపు రంగులో, ఒక ఆకారం లేకుండా, గరుకుగా మారుతాయి.