A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

పెరినాక్స్, అజాక్సి త్రోబిన్. క్లోరాతలానిల్, కాపర్, డిఫేనోకోనాజోలె, ఫమోక్సాడొన్, ఇప్రోదియోన్, ప్రోసిమిడొన్ టోలిఫ్లుయానిడ్, కార్బెండైజిం  వంటి మందులతో తెగులును అరికట్టవచ్చు.

తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, లీటరు నీటికి 2.5 గ్రాముల మానేబ్ మందుని కలిపి చల్లితే మంచి ఫలితాలు ఉంటాయి

లీటరు నీటికి ఒక మిల్లి లీటరు  అజాక్సి త్రోబిన్ లేదా  త్రిఫ్లాక్సిస్త్రోబిన్ లేదా పైరాక్లోస్త్రోబిన్ లేదా డిఫెంకోనాజోల్  మందును కలిపి చల్లినా తెగులు నియంత్రణలో ఉంటుంది. తొలి రెండు ఆకులు వచ్చినప్పుడు తొలిసారి చల్లాలి.  తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి లెక్కన రెండు సార్లు  చల్లాలి.    

NPM పద్దతులు :

  • తెగులు సోకిన మొక్కల నుంచి విత్తనాలను విత్తడం, నాటడం చేసినప్పుడు తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాలను వాడాలి.
  • తెగులు సోకిన మొక్కలను ఏరి నాశనం చేయాలి.
  • పొలంలో తెగులుకు కారకమయ్యే ఫంగస్ కు  ఆతిధ్యమిచ్చే కలుపు  మొక్కలను కూడా ఏరిపారేయాలి.
  • నారు మడులలో నీరు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. పొలంలో మురుగు నీరు పోయే సౌకర్యం ఉండేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
  • విత్తన నిరోధక వంగడాలను వాడాలి ( ఐ ఐ హెచ్ ఆర్ 275 – 1౩-5,  ఐ ఐ హెచ్ ఆర్ ౩45 – 6, ఐ ఐ హెచ్ ఆర్ ౩౩2 – 109, సి.సి 4 , ఉజ్వల, హెచ్ 1,, హెచ్ 4, హెచ్ 6, సి. ఎ 87- 4, ఎస్ – 20- 1,  లోరై., బి.జి – 1 వంటి వంగడాలు వాడవచ్చు)     
  • సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ తో విత్తనాలను శుద్ధి చేయాలి.
  • ట్రైకో డేర్మా జాతికి చెందిన పురుగులు తెగులు నియంత్రణకు  దోహదపడతాయి.