A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

·         తెగులు తొలి లక్షణాలు కనపడిన వెంటనే కార్బామేట్స్ లేదా క్లోరోతలోనిల్ లేదా క్యుప్రిక్స్ వంటి మందులను మొక్కలపై వాడాలి.  వాతావరణం తడిగా ఉంటే, వారం రోజులకు ఒక సారి లేదా చల్ల్లాలి. పొడిగా ఉంటే 1౦ రోజులకు ఒక సారైనా చల్లవచ్చు. వానలు పడినప్పుడు లేదా పంటకు నీళ్ళు పెట్టినప్పుడు అప్పటికి కొట్టిన మందులు పంటపై నిలబడవు కాబట్టి వాటిని మళ్లీ చల్లాల్సి ఉంటుంది.

·         తెగులుని నియంత్రించడానికి దిఫోలతాన్ (0.2%) లేదా దైతేన్ ఎం – 45 (0.2%) లేదా బవిస్టిన్ (0.1%) వంటి మందులను కూడా చల్లవచ్చు.

  • జీవ పద్దతులు

·         పంటల మార్పిడి   -  రెండేళ్ళ పాటి వరుసగా టమాట, మిరప, వంకాయ వంటి పంటలను వేసిన నేలలో అవే పంటలను వేయకూడదు.

·         తెగులు ఉన్న మట్టి మొక్కకు అంటకుండా ఉండేందుకు గాను మొక్క చుట్టూ మల్చింగ్ చేయాలి. గడ్డి జాతి మొక్కలను మొక్క  చుట్టూ వేస్తే తెగులు విస్తరించదు

·         పై నుంచి మొక్కలకు నీరు పోస్తే,  ఉదయం వేళలలోనే పోయాలి.  అప్పుడు రోజులో ఆకులు తడి లేకుండా పొడిగా ఉంటాయి.  ఇలా పొడిగా ఉంటే తెగులు సోకడం తక్కువ  .

·         తెగులు నిరోధక విత్తనాలు, వంగడాలు వాడాలి.

·         నాటే ముందు మొక్క మొలకను తెగులు ఉందో లేదో బాగా పరిశీలించాలి. తెగులు లక్షణాలు కనపడితే ఆ మొలకను నాశనం చేయాలి.

·         నేలలో సేంద్రియ పదార్థం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. అది కూడా వేళ్ళకు బాగా అందే రీతిలో ఉండాలి.

·         ఆఫ్ – సీజనులో నత్రజని స్థిరీకరించే పచ్చి ఎరువులు నేలకు అందించాలి.

·         తెగులు సోకిన మొక్కలను, మొక్క భాగాలను ఏరి నాశనం చేయాలి.