బత్తాయి: 

ప్రస్తుతము మన రాష్ట్రములో బత్తాయి 1.94,345 హేక్టారులలో సాగుచేయబడుతూ 26.25 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి చేయబడుతున్నాయి. 

మన రాష్టం బత్తాయి సాగులో దేశంలోనే మెదటి స్థానాన్ని ఆక్రమించింది.  

నల్గొండ జిల్లాల్లో బత్తాయి 81,550 హెక్టారులలో సాగు చేయబడుతూ రాష్ట్రంలోనే మెదటి స్థానాన్ని ఆక్రమించింది. 

బత్తాయి నికర దిగుబడి దేశంలో 8 మెట్రిక్ టన్నులు హెక్టారుకు ఉండగా రాష్ట్రంలో నికర దిగుబడి ఒక హెక్టారుకు 11 మెట్రిక్ టన్నుల వరకు వస్తూ ఉంది. 

  అయితే ఈ మధ్యకాలంలో యాజమాన్య లోపాల వల్ల బత్తాయి తోటలు విపరీతంగా క్షీనిస్తున్నాయి.