కంది మన రాష్ట్రంలో దాదాపు 11.25 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, 2.౦.2. లక్షల టన్నుల ఉత్పతి నిస్తుంది. ఎకరాకు 18౦ కిలోల సరాసరి దిగుబడి నిస్తుంది. పత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుచిక్కుడు లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరిఫ్ లో పండించవచ్చు. కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగు చేస్తున్నారు. కందిని రబీలో కూడా పండించవచ్చు.
దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, మరియు గుంటూరు జిల్లాల్లో ఈశాన్య ఋతు పవనాలు వల్ల కురిసే వర్షాలనుపయోగించి రబీ కందిని వర్షాధార పంటగా సాగు చేయవచ్చు. ఈ జిల్లాలే కాకుండా గోదావరి నది వరద తాకిడికి గురయి వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో వరద పోయిన తర్వాత రబీ కంది సాగుకు అనుకూలం. శ్రీరాంసాగర్ , నిజాంసాగర్ మరియు నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో కూడా కంది ఆరుతడి పంటగా పండించవచ్చు. నీటి వసతి ఉంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సాగు చేయవచ్చు.