శ్రీ పద్దతి అంటే...

సిస్టం అఫ్ రైస్ ఇంటెన్స్ ఫికేషన్  అన్న పదాల  అంగ్ల పొడి అక్షరాలు – ఎస్ ఆర్ ఐ . దానికి అనుగుణంగా ఈ సాగు పద్దతిని తెలుగులో శ్రీ పధ్ధతి అంటున్నాం . దీనిని 1983లో మడగాస్కర్ లో అభివృద్ధి పరిచారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో శ్రీ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు.

ప్రయోగశాలల్లో ప్రయోగ క్షేత్రాలలో శాస్త్రవేతలు రూపొందించింది . ఆధునికమని, మేలైనదని మనకు చెబుతూ వచ్చారు. కానీ శ్రీ పద్దతి రుపుదిద్దుకోవటం లోను, అభివృద్ధి చెందటం లోను రైతులే ప్రముఖ పాత్రా పోషించారు. అందుకే ప్రతి రైతు ప్రయోగాలు చేసే వక్తి. ప్రతి రైతు ఒక శాస్త్రవేత అని చెప్పొచు. ఎవరో చెప్పారని చెయ్యటం కాకుండా కాకుండా మూల సూత్రాలను అర్ధ్యం చేసుకునే, స్థానిక పరిస్తితులు , అందుబాటులో వున్న వనరులను ఉపయోగించుకుని ఏం చెయ్యాలో రైతులో నిర్ణయించుకోవడం అన్నది శ్రీ పద్దతిలో కీలకాంశము.