నెల్లూరు జాతి :

దీనిని మాంసోత్పతికి మాత్రమే పెంచవచ్చు. మన దేశం లోని జాతులన్నింటికంటే పొడవైనది. నెల్లూరు జాతిలో జోడిపి, పల్లా, బ్రౌన్, అనే మూడురకాలు ఉన్నాయి. మాంసోత్పత్తిలో కాని, శరీర పరిమాణంలో కాని ఈ మూడు రకాల్లో పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో జోడిపి, బ్రౌన్ జాతి గొర్రెలను ఎక్కువగా పెంచుతున్నారు.

వివిధ వయసుల్లోని నెల్లూరు జాతి గొర్రెల బరువు (కిలోల్లో):

పొట్టేళ్లు : 40-5 0,

ఆడ గొర్రెలు 25-35,

ఆరు నెలల వయస్సులో 19-20,

మూడు నెల్ల వయస్సులో 14,

పుట్టిన పిల్ల 2.50-4.0.