పరిచయం:
వాణిజ్య పరంగా పండించే పళ్ళు దానిమ్మ పుఖ్యమైనది. అత్యంత ఒషద విలువలతో పాటు, సేద తేర్చే రసాన్ని దానిమ్మ పండ్లు నుండి పొందవచ్చు.
పండ్ల చర్మం, రసం, ఆకులు మరుయు వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందులు తయారికి ఉపయోగిస్తారు.
ఈ పంటను కరువు ప్రాంతాలలో విజయవంతంగా సాగు చేయవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రలలో దానిమ్మ అనంతపురం మరియు మహబుబ్ నగర్ జిల్లాల్లో 8750 ఎకరాలలో సాగుచేయబడి, 59 వేల 500 టన్నుల దిగుబదినిస్తున్నది.