ప్యాకింగ్;
పెద్ద పెద్ద కండ్లు కలిగిన పండ్లను వేరుచేసి మార్కెట్ చేస్తే అధిక ధర పొందవచ్చు. సీతా ఫలం కాయలు కొత తర్వాత చాలా త్వరగా పండుతాయి. కోసిన వెంటనే గంపలు లేదా అట్ట పెట్టెల్లో గడ్డి లేదా సీతా ఫలం ఆకులను క్రింద, పక్క భాగాల్లో వేసి మధ్యలో కాయలుంచి ప్యాకింగ్ చేసి దూర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. సీతా ఫలానికి నిల్వ వుండే లక్షణం లేనందున ప్రత్యక శ్రద్ధ వహించాలి.