బొప్పాయిని అధికంగా పండిoచే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చీమ బెంగాల్, ఒరిస్సా ముఖ్యమైనవి.
మనదేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణం లక్షా ఎనభైవేల ఎకరాలు, ఉత్పత్తి సుమారు 25 లక్షల టన్నలు .
భారతదేశము బొప్పాయి విస్తీర్ణంలోను, దిగుబడిలోను ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించిoది.
రెండు తెలుగు రాష్ట్రాలలో బొప్పాయి సుమారుగా 30 వేల ఎకరాలలో సాగు చేయబడుతూ ఎకరాకు 50 టన్నుల చొప్పున సగటు దిగుబదినిస్తోంది.