సోయాచిక్కుడు ఇతర పప్పుధాన్యపు పైర్లకంటే అధిక దిగుబడి నివ్వగల శక్తి కలిగి వాటికంటే రెట్టింపు మాంసకృత్తులు (43 శాతం) మరియు నూనె (20 శాతం) కూడ కలిగిన శక్తివంతమైన కాయ ధాన్యం.
ఈ పైరు ‘ రైజోబియమ్ జపానికమ్’ అనే బాక్టీరియా సహాయంతో గాలిలోని నత్రజనిని వేరు బుడిపెల ద్వారా గ్రహించి మొక్కకు అందించడమే కాక భూమిని సారవంతం చేస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రలలో సోయాచిక్కుడు 1.70 లక్షల హె.ల లో సాగుచేయబడుతూ 323 వేల టన్నుల ఉత్పత్తినిస్తుంది. దిగుబడి ఎకరాకు షుమారుగా 800 కిలోలు.